Medigadda Barrage 7th Block: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీలో పలు నిర్వహణ లోపాలను నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ.. NDSA గుర్తించినట్లు తెలిసింది. ఏడో బ్లాక్‌ను పూర్తిగా తొలగించి.. మళ్లీ నిర్మించాలని సిఫార్సు చేసినట్లు సమాచారం. ఈ బ్లాకును మళ్లీ నిర్మించేందుకు అవసరమైన డిజైన్‌ను రూపొందించే బాధ్యతను కేంద్ర జలసంఘానికి…అప్పగించాలని సూచించినట్లు తెలుస్తోంది. కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ.. రెండు వారాల క్రితం నివేదికను అందజేయగా.. దీనిపై మూడ్రోజుల క్రితం కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ చర్చించినట్లు సమాచారం.
NDSA, జలసంఘం, జల్‌శక్తి అధికారులకు చంద్రశేఖర్ అయ్యర్ నివేదికలోని ముఖ్యాంశాలపై ప్రజంటేషన్ ద్వారా వివరించినట్లు తెలిసింది. ఈ నివేదికను.. తదుపరి కార్యాచరణకు NDSA రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది. 2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు కొన్ని పియర్స్ దెబ్బతిన్నాయి. NDSA నిపుణుల కమిటీ పరిశీలించి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌లో వైఫల్యాల వల్ల దెబ్బతిన్నట్లు నివేదించింది.
రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2024 మార్చి 2న చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని NDSA నియమించింది. బ్యారేజీలను అధ్యయనం చేసి వాటి పరిస్థితిని అంచనా వేసి.. ఏయే చర్యలు తీసుకోవాలో సిఫార్సు చేయాలని సూచించింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్లను కూడా అధ్యయనంలో చేర్పించింది. ఈ కమిటీ.. గతేడాది మే ఒకటిన ప్రాథమిక నివేదిక ఇచ్చింది. బ్యారేజీలలో నీటిని నిల్వ చేయకుండా గేట్లు తెరిచి ఉంచాలని, పలు పరీక్షలు చేయించాలని సూచించింది. మేడిగడ్డకు సంబంధించి పరీక్షలన్నీ పూర్తయి ఫలితాలు వచ్చిన తర్వాత.. పలు సిఫార్సులతో తుది నివేదిక ఇచ్చింది. బ్యారేజీల పరిస్థితి, వైఫల్యాలకు కారణాలు, తదుపరి తీసుకోవాల్సిన చర్యల గురించి నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం.
Also Read: మహిళలకు గుడ్ న్యూస్.. మీ కోసమే కొత్త పథకాలు.. డోంట్ మిస్
మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పరీక్షలు అన్ని పూర్తయ్యాక.. వచ్చిన ఫలితాలను బట్టి పలు సిఫార్సులతో తుది నివేదిక ఇచ్చింది. బ్యారేజీల పరిస్థితి, వైఫల్యాలకు గల కారణాలు.. తరువాత తీసుకోవాల్సిన చర్యల గురించి నివేదికలో ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు నిర్మాణం, డిజైన్, నిర్వహణ, నాణ్యతలో లోపాలు ఉన్నాయని, మేడిగడ్డ ఏడో బ్లాక్ తొలగించి, మళ్లీ కొత్తగా నిర్మించాల్సి ఉంటుందని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. కొద్దిపాటి వరదకే మేడిగడ్డ ఏడో బ్లాక్ కృంగిందని.. భవిష్యత్తులో భారీ వరదలు వచ్చిన తట్టుకుంటుందన్న గ్యారెంటీ లేదని నివేదికలో తెలిపినట్లు తెలుస్తోంది. మేడిగడ్డ కాలమ్స్‌లోనూ లోపాలు ఉన్నాయని, బ్యారేజ్‌పై భాగంలో సీకెంట్ ఫైల్స్ నాణ్యత కూడా సరిగ్గా లేవని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. బ్యారేజ్ కుంగిన తర్వాత.. అక్కడ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పినా సరిగ్గా పట్టించుకోలేదని, గ్రౌంటింగ్ చేసి అక్కడున్న ఎవిడెన్స్ తుడిచిపెట్టారని నివేదికలో వెల్లడించినట్లు సమాచారం.