BigTV English

New Virus To Chickens: చికెన్ ప్రియులకు బిగ్ షాక్.. కోళ్లకు మిస్టరీ వైరస్..

New Virus To Chickens: చికెన్ ప్రియులకు బిగ్ షాక్.. కోళ్లకు మిస్టరీ వైరస్..

New Virus To Chickens:  మీరు చికెన్ ప్రియులా.. వారానికి కనీసం రెండు, మూడు సార్లు అయిన తింటారా.. అయితే మీకు ఇది బ్యాడ్ న్యూసే. ఎందుకంటే చికెన్ అంటే ఇష్టపడని మాంసం ప్రియులు ఉండరు. అంతెందుకు పక్కింట్లో చికెన్ వండితే మన ఇంట్లో వారి నోట్లో నీళ్లు ఊరుతాయి. చికెన్ బిర్యానీ అయితే ఇక చెప్పనవసరం లేదు. పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు లొట్టలేసుకుంటూ తింటారు. అది చికెన్‌కు ఉన్న క్రేజ్. మటన్ ధర ఎక్కువగా ఉండటం, ఫిష్ చాలా మందికి నచ్చకపోవడం కూడా చికెన్ ఇష్టపడడానికి కారణం అని చెప్పొచ్చు. అయితే చికెన్ ప్రియులకు తాజాగా షాకింగ్ న్యూస్ తగిలింది. అసలు విషయం ఏంటంటే కోళ్లు అంతు చిక్కని వైరస్‌తో మృతి చెందుతున్నాయి.


ఏం జరుగుతుందో తెలియదు. ఏ మహమ్మారి సోకిందో కానీ కోళ్లు.. పిట్టల్లా రాలుతున్నాయి. అంతుపట్టని వైరస్‌ ఎఫెక్ట్‌కు తెలుగు రాష్ట్రాల్లోని నాటు, బాయిలర్‌ కోళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాతపడుతున్నాయి. షెడ్డులో ఒక్క కోడికి వైరస్‌ సోకితే.. సాయంత్రానికి మిగతా కోళ్లకు పాకి అవి కూడా చనిపోతున్నాయి. దాంతో కోళ్ల ఫారాల యజమానులు గతంలో ఎన్నడూ లేనంత నష్టాలను చవిచూస్తున్నారు. వైరస్‌ కారణంగా కోళ్లు చనిపోతే ఆ షెడ్డులో మూడు నెలల వరకు మరొక బ్యాచ్‌ పిల్లలు వేసే అవకాశం ఉండదు. దాంతో యజమానులకు నష్టం పెరిగిపోతోంది.

వైరస్ సోకి వేలాది కోళ్లు చనిపోయాయి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని కారాయిగూడెంకు చెందిన పౌల్ట్రీ రైతు నాగేశ్వరరావు, ఉప్పలయ్యకు చెందిన పదివేల బాయిలర్‌ కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఇది కేవలం ఆ గ్రామంలోని సిచ్యూవేషన్‌ మాత్రమే. అలాంటి సీన్లు తెలుగు రాష్ట్రాల్లోని అనేక పౌల్ట్రీల్లో ఈ మధ్య కనబడుతున్నాయి. పది లక్షల నష్టం వాటిల్లిందని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్‌ను సేకరించి హైదరాబాద్‌కు పంపించారు. మృత్యువాతపడ్డ కోళ్లను రోడ్డు పక్కల పూడ్చొద్దని సూచిస్తున్నారు.


ఇక నిజామాబాద్‌ జిల్లాలో కూడా కోళ్లు పెద్దమొత్తంలో మృత్యువాతపడుతున్నాయి. ప్రధానంగా వేల్పూర్‌, భీంగల్‌ మండలాల్లోని కోళ్ల ఫారాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక్కో ఫామ్‌ లో వందల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఫారాల్లోకి కొత్త వ్యక్తులను అనుమతించవద్దని వెటర్నరీ అధికారులు చెబుతున్నారు. ఫామ్‌లో శానిటేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ వైరస్‌ తో మనుషులకు ఎలాంటి హానీ లేదని.. మాంసం ఉడకబెట్టి తినవచ్చని అధికారులు చెబుతున్నారు.

Also Read: విషాదం.. ఫేర్ వెల్ పార్టీలో ఆగిన స్టూడెంట్ గుండె

సీజనల్ వ్యాధులతోనే కోళ్లు మృత్యువాత పడుతున్నాయని, చికెన్ ప్రియులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు వరంగల్ ఎల్బీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ పౌల్ట్రీ డిపార్ట్మెంట్ డాక్టర్ విజయ్ కుమార్. ఇతర ప్రాంతాల నుండి వలస వస్తున్న పక్షుల కారణంగా బర్డ్ ఫ్లూ విజృంభించే అవకాశం ఉందని.. పౌల్ట్రీ యజమానులు బయో సేఫ్టీ విధానాలు పాటించాలని సూచిస్తున్న సూచిస్తున్నారు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అంతుచిక్కని వైరస్‌తో లక్షలాది కోళ్ళు మృత్యువాత పడుతున్నాయి. గత 15 రోజుల్లో 40 లక్షల కోళ్ళు చనిపోయినట్లు తెలుస్తోంది. కోళ్ల ఫారాలు వద్ద గుట్టలు గుట్టలుగా బాయిలర్ కోళ్లు, ఫారం కోళ్లు చచ్చిపడి ఉన్నాయి. కోళ్ల మృత్యువాతతో భారీగా కోడిగుడ్ల ఎగుమతి పడిపోయిందని కోళ్ల ఫారం యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. H5N1 అనే వైరస్ సోకినట్లు పశు సంవర్ధక శాఖ అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల వైరస్ పై మరింత సమాచారం మా ప్రతినిధి శివ సాగర్ అందిస్తారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×