E-Paper
Advertisement

22A భూ బాధితులకు.. క్షమాపణలు చెప్పిన మంత్రి పొంగులేటి!

22A భూ బాధితులకు.. క్షమాపణలు చెప్పిన మంత్రి పొంగులేటి!
Advertisement

22A Land: 22A భూ బాధితులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్ష్మమాపనలు చెప్పారు. 22A వల్ల ప్రజలకు కొంతమంది కి ఇబ్బంది జరిగిన మాట వాస్తవం అని అన్నారు. బాధితులకు క్షమాపణల చెబుతున్నామని మంత్రి తెలిపారు. 22A బాధితులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాధితులు అధికారులకు అప్లికేషన్ చేసుకోండని తెలిపారు.

22A జాబితా..

న్యాయ బద్దంగా ఉన్న ప్రైవేట్ భూములను వెంటనే 22A జాబితా నుండి తొలగిస్తున్నామని మంత్రి అన్నారు. 22A బాధితుల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, బాధితుల కోసం టోల్ ఫ్రీ నెంబర్(1800 5994 788) అందుబాటులో ఉంచామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే బాధితులు నేరుగా కానీ.. టోల్ ఫ్రీకి కాల్ చేసి పిర్యాదు చేయవచ్చని మంత్రి తెలిపారు.

హైదరాబాద్ CURE ప్రాంతంలో..

Advertisement

22A జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్స్ కోసం అధికారులు ఇబ్బంది పెడుతున్నారని మా దృష్టికి వచ్చిందన్నారు. సబ్ రిజిస్టర. ఎమ్మార్వో. రెవెన్యూ అధికారులు బాధితులను ఇబ్బంది పెడుతున్నారని, హైదరాబాద్ CURE ప్రాంతంలో 4 జిల్లాలకు సంబంధించి 757 మంది 22A బాధితులు ఉన్నారని మంత్రి తెలిపారు. మేడ్చల్ జిల్లాలో 511, రంగారెడ్డి – 144, హైదరాబాద్ – 49, సంగారెడ్డి – 38, 757 మంది ప్రైవేట్ భూమి 22 A లో పెట్టి దరఖాస్తు చేసుకున్నారని మంత్రి క్లారిటీ ఇచ్చారు.

Also Read: ఎండిపోయిన నిమ్మ తొక్కలతో దోమలకు చెక్.. 3 సింపుల్ ట్రిక్స్ ఇవిగో

నిషేదిత జాబితా..

Advertisement

గ్రౌండ్ రియాలిటీ ఏంటి అని అధికారులతో మేము చర్చించామని, సబ్ రిజిస్టర్ స్థాయి నుండి IG వరకు MRO ల నుండి కలెక్టర్ లతో సమావేశాలు నిర్వహించామన్నారు. ఆ భూములు నిషేదిత జాబితా లోకి ఎలా వెళ్లాయి అని టెక్నీకల్ గా సమాచారం సేకరించామని మంత్రి పొంగులేటి తెలిపారు. క్యూర్ ప్రాంతంలో ఉన్న వారికి సందేశమని, హైకోర్టులో కేసులు పెండింగ్ ఉన్న వివరాలు ఆన్లైన్‌లో అధికారులు అప్లోడ్ చేయకపోవడం వల్ల ఈ తప్పిదం జరిగిందని మంత్రి తెలిపారు. ఖచ్చితంగా మా అధికారుల పొరపాటు ఉంది.. ఎవరి ప్రైవేట్ భూములకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి క్లారిటీ ఇచ్చారు.

ULC జాబితాలో..

మేడ్చల్ జిల్లాకి చెందిన 511 అప్లికిషన్స్ లో ULC జాబితాలో గతంలో ఉన్నాయి. 2025 సెప్టెంబర్‌లో హైకోర్టులో 6 వేల కు పైగా ప్రోహిబిటెడ్ లిస్ట్‌లో ఉన్న భూముల కేసులు ఉన్నాయి. గతంలో ఉన్న కేసుల వివరాలు ఆన్లైన్‌లో అప్లోడ్ చేయకపోవడం వల్ల తప్పిదం జరిగిందని, న్యాయంగా ULC లో ఉన్నారో వారికి ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. వారి కి ఎలాంటి ఇబ్బంది లేదు.. అన్ని వివరాలు..అప్లోడ్ చేస్తాం అని, ULC లో జెన్యూన్ గా ఉన్నాయో వారి వివరాలు ఆన్లైన్ లో పెడతామని, ప్రజలకు కొంతమందికి ఇబ్బంది జరిగిన మాట వాస్తవం అని అన్నారు. ఇందుకుగాను బాధితులకు క్షమాపణలు చెబుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Also Read: బిజినెస్‌లో బిగ్ ట్రబుల్… బావమరుదులు వేసిన ప్లాన్స్ చూస్తే మైండ్ బ్లాక్

Tags

Related News

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. శుక్రవారం లోపు డబ్బులు చెల్లించాలి, లేకుంటే రద్దయ్యే ఛాన్స్!

రూ. 400 కోట్లతో తూప్రాన్‌లో అమూల్ డెయిరీ ప్లాంట్.. భూమిపూజ చేసిన కిషన్ రెడ్డి

ట్యాంక్‌బండ్ వద్ద లారీ బీభత్సం.. ఆరేళ్ల పాపతో పాటు బంధువు మృతి!

దమ్ముంటే రాజీనామా చేయండి.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డీకే అరుణ ఓపెన్ ఛాలెంజ్!

జగద్గిరిగుట్టలో వరుస చోరీలు.. రూ.58 లక్షల సొత్తు మాయం

మద్యం ప్రియులకు షాక్.. నేటి నుంచి తెలంగాణలో బార్లు-రెస్టారెంట్లు బంద్, మళ్లీ ఏమైంది?

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

Big Stories

Advertisement
×