E-Paper
Advertisement

Medak District: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పై మంత్రి వివేక్ సమీక్ష..!

Medak District: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పై మంత్రి వివేక్ సమీక్ష..!
Advertisement

Medak District: స్వేచ్ఛ బ్యూరో: అధికారులు ప్రజలతో మమేకం కావాలని జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మెదక్ ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో మంత్రి వివేక్ వెంకటస్వామి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధ్యక్షతన జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంలో కర్మిక గనుల శాఖ, మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు మాధవనేని రఘునందన్ రావు, సురేష్ షెట్కర్, ఎం ఎల్ సీ,అంజిరెడ్డి శాసన సభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, సంజీవ రెడ్డి,,టి జి ఐ ఐ సీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి లు పాల్గొన్నారు.

99 రోజుల కార్యక్రమాల్లో..

ముందుగా కలెక్టరేట్ కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, సిద్దిపేట జిల్లా కలెక్టర్, హైమావతి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన మంత్రి కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ప్రజలతో అధికారులు మమేకం కావాలని,99 రోజుల కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణలో ఉమ్మడి మెదక్ జిల్లా మొదటి స్థానంలో ఉండేలా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఘనంగా నిర్వహించాలని అన్నారు. ప్రజలతో మమేకమై వారితో కలిసి పనిచేసి నప్పుడే సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు అవకాశం ఉందని సీఎం భావించి ఈ కార్యక్రమంను తీసుకొచ్చారాని,దీన్ని అమలుచ్చేసే భాద్యత అధికారులదే అన్నారు. సమ్మర్లో త్రాగునూరు సమస్యరకుండా రిపర్లు, బోర్లు ప్రతిపదనలు పంపలన్నారు.వాటి పై అసెంబ్లీలో చర్చించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Also Read: Crystal Mala: ఒత్తిడిని మాయం చేసే ‘స్పటిక’.. ధరిస్తే కలిగే మార్పులివే!

పంట మార్పిడినీ 30% అమలు

ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేసేందుకు సీఎం దృష్టికి తీసుకెళ్తానని, రెసిడెన్షియల్ స్కూల్లో త్రాగునీరు ఉండేలా చూడాలన్నారు.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కాలుష్య నియంత్రణ చెర్యలు తీసుకునేలా వారిని మానిటర్ చెయ్యాలనీ పేర్కొన్నారు. గుమ్మడిదల ఫైర్ స్టేషన్, సోలార్ సూర్య ఘర్ యోజన పథకం పై రివ్యూ చెయ్యాలనీ. ఏటిసి త్వరగా నిర్మాణం అయ్యేలా టిజీఐఐసి చర్యలు తీసుకోవలని సూచించారు. 6 గ్యారంటీలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చెయ్యాలన్నారు. పంట మార్పిడినీ 30% అమలు చెయ్యాలి. విద్యా, వైద్యం చాలా ముఖ్యమని పేద ప్రజలకు నాణ్యమైన విద్యా, వైద్య సేవలాందించాలన్నారు. రేషన్ కార్డ్స్, డిజిటల్ హెల్త్ కార్డ్స్లు అందించాలని సూచించారు.

మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ..

Advertisement

ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. దుబ్బాకలో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చెయ్యాలని, కొత్త మండలాల ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. ప్రతీ సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షా 25 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు.రవాణా శాఖ డ్రైవింగ్ లైషన్స్ ఇచ్చేటప్పుడు రోడ్డు భద్రత నియమాలపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. వివిధ నిర్మాణాలు, రహదారులు, పరిశ్రమలలో కాలుష్యాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, ప్లాస్టిక్ వ్యర్ధాల నుండి డీజిల్ ను తీసేందుకు ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థకు సిద్దిపేట పట్టణంలో అర ఎకరం స్థలం కేటాయించాలని, నార్మట్టలో నిర్మించిన ఆయిల్ ఫెడ్ సూచించారు. ఎంపీ సురేష్ షట్కర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంపై గ్రామ స్థాయిలో ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని,మహిళలకు హెల్త్ ప్రొఫైల్ చెక్ చేయాలని,వైద్య పోస్టులు భర్తీ చేయాలని,డాక్టర్లు అందుబాటులో ఉండాలన్నారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను మరమ్మత్తు చేయాలన్నారు.

Also Read: SPDCL Employees: విద్యుత్ శాఖలో ఎస్పీడీసీఎల్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

మెడికల్ కాలేజీల్లో ఒపీ ఫీజులు

ఎంఎల్సి చిన్నమైల్ అంజిరెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ లు ఏర్పాటుచేయాలి. వాహనాలు అధికంగా నడిచే ప్రాంతాల్లో అండర్ పాస్ నిర్మించాలని, అపోజిట్ లో వాహనాలు వెళ్లకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకువాలని, ఆయిల్ ఫామ్అధికంగా సాగు చేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఒపీ ఫీజులు వసూలు చేయకుండా చూడాలన్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలన్నారు. పాల ఉత్పత్తులు పెంచాలన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులకు డ్యూప్యుటేషన్లు ఇవ్వోదన్నారు. శాసన సభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ.. జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పనులు ప్రారంభించాలన్నారు. జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. టి జి ఐ ఐ సీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ.. బసవేశ్వర ప్రాజెక్ట్ పనులు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాలన్నారు . భూములు కోల్పోయిన వారిని ఆదుకోవాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని,ఆయిల్ ఫామ్ పంటలను అభివృద్ధి చేయాలన్నారు.

మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్..

మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలను నెరవేర్చే దిశగా పని చేస్తామన్నారు. జిల్లాలోని 2 నియోజకవర్గాలకు నోడల్ అధికారులను నియమించడం జరిగిందని అన్నారు. ఎప్పటికప్పుడు జిల్లా స్థాయిలో అధికారులను సమన్వయం చేసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే. హైమావతి మాట్లాడుతూ.. అధికారులతో పాటు ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిశీలించేందుకు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమాన్ని ప్రణాళిక బద్దంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.

ఫైల్స్ క్లియరెన్స్‌పై ప్రత్యేక దృష్టి..

సంగారెడ్డి కలెక్టర్ ప్రవీణ్య మాట్లాడుతూ.. “99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా నేటి నుంచి మార్చి 15వ తేదీ వరకు కొనసాగనున్న పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే అధికారులు తమ తమ కార్యాలయాల్లో ఉన్న పెండింగ్ ఫైల్స్‌ను త్వరితగతిన క్లియర్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎస్పీ శ్రీనివాస్ రావు, ,మెదక్ అదనపు కలెక్టర్లు నగేష్ ,మాధురి ,అబ్దుల్ హమీద్ ,మెదక్ మున్సిపల్ చైర్మన్ కనుగుల రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కౌన్సిలర్లూ,జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Also Read: LPG Supply Rules: సామాన్యులకు భారీ ఊరట.. వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×