E-Paper
Advertisement

Uttam Kumar Reddy: పాలమూరు ప్రాజెక్టులకు డెడ్ లైన్.. 2028 డిసెంబర్ కల్లా అన్ని పనులు పూర్తి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: పాలమూరు ప్రాజెక్టులకు డెడ్ లైన్.. 2028 డిసెంబర్ కల్లా అన్ని పనులు పూర్తి: ఉత్తమ్ కుమార్ రెడ్డి
Advertisement

Uttam Kumar Reddy: హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ జలసౌధలో ఆదివారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై కీలక సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఎక్సైజ్ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి సాగునీటి రంగాన్ని బలోపేతం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ఖరీఫ్ సీజన్‌లోనే అత్యధికంగా వరి సాగు జరిగిందని, కృష్ణా జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై గత ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి విమర్శించారు. రూ. 55 వేల కోట్ల ప్రాజెక్టులో కేవలం రూ. 27 వేల కోట్లు ఖర్చు చేసి, 90 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పడం హాస్యాస్పదమని మండిపడ్డారు. ప్రాజెక్టు అంచనాలను రూ. 84 వేల కోట్లకు పెంచినప్పటికీ, ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. జూరాల నుంచి శ్రీశైలానికి ప్రాజెక్టును మార్చడం వల్ల జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల భూసేకరణ కోసం జూన్ 2వ తేదీలోపు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తామని, నిధులను గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేసి 2028 డిసెంబర్ నాటికి అన్ని పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

వచ్చే మార్చి, ఏప్రిల్ నాటికి ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. గత పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసినందుకే ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. జూరాల బ్రిడ్జి భద్రత దృష్ట్యా దానిపై వాహనాల రాకపోకలను నిలిపివేస్తామని, ప్రజాభిప్రాయం మేరకే ఈ విషయంలో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. పాలమూరు ప్రజలు కన్న సాగునీటి కలలను తమ ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Read Also: Bhoodan Land Scam: భూదాన్ కమిటీ ముసుగులో.. రూ. 3 కోట్లు వసూళ్ళు చేసిన గ్యాంగ్ అరెస్ట్!

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×