Miss World-2025: తెలంగాణలోని హైదరాబాద్ వేదికగా రెండు రోజులుగా మిస్ వరల్డ్-2025 పోటీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం నాగార్జునసాగర్‌కు ప్రపంచ అందగత్తెలు వెళ్తున్నారు. సమీపంలోని బుద్ధవనాన్ని సందర్శిస్తారు. దాదాపు మూడు గంటలపాటు వారంతా అక్కడ గడపనున్నారు.
నల్గొండ జిల్లాలోని సాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధవనాన్ని సందర్శించనున్నార మిస్ వరల్డ్-2025 పోటీదారుల టీమ్. 30 దేశాలకు చెందిన సుందరీమణులు హాజరవుతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మూడు గంటలకు చింతపల్లి మండలం వెల్లంకికి చేరుకుంటారు.
బుద్ధవనం ప్రాముఖ్యత తెలిసేలా అన్ని ఏర్పాట్లను చేసింది పర్యాటక శాఖ. సుందరీ మణులకు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలకనున్నారు 24 మంది లంబాడా కళాకారులు. బుద్ధ చరితంపై 18 మంది కళాకారులు ఇచ్చే ప్రదర్శనను తిలకించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు నాగార్జునసాగర్‌కు వారంతా చేరుకుంటారు. అక్కడి నుంచి విజయ విహార్‌కు వెళ్తారు.
5.30 గంటలకు విజయ విహార్ ప్రధాన ద్వారం వద్ద ఫోటోషూట్ జరగనుంది. 5.45కు విజయ విహార్ నుంచి బుద్ధవనానికి వెళ్లనున్నారు. ఆరు గంటలకు బుద్ధవనం వద్ద ఫోటో షూట్ జరగనుంది. సాయంత్రం 6.10 గంటలకు మహాస్థూపం వద్దకువారికి స్వాగతం పలకనుంది మరో టీమ్. 6.20 వరకు మహాస్థూప విశేషాలకు పర్యటక శాఖ గైడ్ శివనాగిరెడ్డి తెలియజేస్తారు.
ALSO READ: కేఏ పాల్ మజాకా.. ముంబైలో రచ్చరచ్చ
6.30 వరకు బౌద్ధ శాసన వద్ద ధ్యానం, ఆపై బుద్ధవనం గురించి ఉపన్యాసం ఉంటుంది. రాత్రి 7.00 గంటల వరకు జాతక వనంలో రాత్రి భోజనం ఉంటుంది. అనంతరం పర్యటన ముగించుకుని రాత్రి 8.45 కు చింతపల్లి మండలం వెల్లింకి చేరుకుని రాత్రి 9 గంటలకు హైదరాబాద్ పయనం కానున్నారు.
అందాల భామల పర్యటన నేపథ్యంలో నాగార్జునసాగర్‌లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 2వేల మంది పోలీసులతో అంతర్జాతీయ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు.