MLA Naini Rajender Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య మీటింగ్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ అంశంపై బీఆర్ఎస్, బీజేపీ నేతలతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం రియాక్ట్అయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో హస్తం పార్టీలో అలజడి మొదలైందని వ్యాఖ్యానిస్తుండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దీనికి రియాక్ట్ అవుతున్నారు. వారి వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు ఖండిస్తున్నారు. తాజా వ్యవహారంపై వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రియాక్ట్ అయ్యారు.
మీడియా అంటే ప్రత్యేక గౌరవం ఉందని.. వక్రీకరించి వార్తలు ప్రసారం చేయడం సరికాదని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవల జరిగిన ఓ రహస్య సమావేశంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై ఎమ్మెల్యే స్పందించారు. తాను ఎలాంటి రహస్య సమావేశంలో పాల్గొనలేదని.. అయినప్పటికీ తాను కూడా మీటింగ్‌లో పాల్గొన్నట్లు ప్రచారం చేయడం సరైన చర్య కాదని అన్నారు. ప్రతిపక్ష BRS సృష్టించిన ఒక ఫేక్ వార్తను కొన్ని మీడియా ఛానెళ్లు నిజానిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మీడియా అంటే ఎంతో గౌరవం ఉందని ఇలాంటి తప్పుడు ఆరోపణల కథనాలను ప్రసారం చేసి మీడియాపై ఉన్న గౌరవాన్ని దిగజార్చుకోకూడదని ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారానికి సంబంధించి తాజాగా.. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీని ఆయన ఖండించారు. ఉద్దేశ పూర్వకంగానే కొందరు ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారని ఫైరయ్యారు. తమపై లేనిపోని అబద్దపు ప్రచారం చేస్తున్నవారని కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే నాయిని హెచ్చరించారు. కుట్ర వెనుక ఎవరున్నా.. వదిలే ప్రసక్తే లేదని.. పరువునష్టం దావా వేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. యూట్యూబర్స్‌పై చట్టపరమైన చర్యలు తీసకుంటామని అన్నారు. ఎమ్మెల్యేలు అందరూ ఒకే చోట చేరి.. అభివృద్ధిపై మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. ఈ విషయంపై ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. ఈ నేపథ్యంలోని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే నాయిని లేఖ రాశారు. తాను భేటీలో పాల్గొనలేదని లేఖలో పేర్కొన్నారు.
Also Read: Gajuwaka News: దారుణం.. యువతి స్నానం చేస్తుండగా వీడియోలు తీశాడు.. చివరకు..?
ఇప్పుడు, ఎమ్మెల్యే రహస్య భేటీ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారంగా మారింది. కాంగ్రెస్ సర్కార్‌పై ప్రభుత్వం తిరుగుబాటు అంటూ సోషల్ మీడియా చేసిన దుమారంతో తెలంగాణ కాంగ్రెస్ అలెర్ట్ అయ్యింది. హస్తం పార్టీ ఎమ్మెల్యే భేటీ కావడానికి గల కారణాలేంటి..? అసలు ఎందుకు భేటీ అవ్వాల్సి వచ్చింది..? అనే దానిపై తెలంగాణ కాంగ్రెస్ ఆరా తీస్తోంది. రహస్య భేటీ ఏర్పాటు చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ లోసంభాషించారు. ఇలాంటి రహస్య భేటీలు ఏర్పాటు చేయడం.. ప్రస్తుత సమయంలో సబబు కాదని హితవు పలికారు. మీకు ఏదైనా సమస్యలు కానీ.. అభివృద్ది పనులకు సంబంధించి కానీ సందేహాలు ఉంటే తన దృష్టి కానీ.. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి అయినా కానీ తీసుకెళ్లాలని సూచించారు. అయితే ఈ భేటీలో ఎవరూ హాజరుకాలేదంటూ మీడియాకు కాంగ్రెస్ వివరించింది. తమ ప్రభుత్వంపై ప్రత్యర్థి పార్టీల సోషల్‌మీడియా వేదికగా అబద్దపు ప్రచారాలు చేస్తుందని చెప్పింది.