Hyderabad News:హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారు జామున దాసరి సంజీవయ్య కాలనీలో ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో జలగం సాయి సత్య శ్రీనివాస్ (32) మంటల్లో సజీవ దహనం అయ్యాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగింది..? అని పరిశీలిస్తున్నారు. మృతుడిని ఏపీ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.