CM Revanth with Mandakrisha: ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్లపై సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. మంగళవారం ముఖ్యమంత్రి నివాసానికి మందకృష్ణతోపాటు ఎస్సీ వర్గానికి చెందిన పలువురు నేతలు ఉన్నారు.
షెడ్యూల్డు కులాల వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ సిఫారసులను శాసనసభ ఆమోదించింది. కమిషన్ చేసిన సిఫారసుల్లో క్రిమీలేయర్ ప్రతిపాదనను తిరస్కరించింది. మిగతా వర్గీకరణ ప్రతిపాదనలను శాసనసభ ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే.
రాజకీయ ప్రయాజనాలకు అతీతంగా, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే మంచి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. అసెంబ్లీలో చర్చించి, కేబినెట్ సబ్ కమిటీ వేశామన్నారు. నివేదికల ఆధారంగా కేబినెట్‌లో చర్చించి, అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
దీనివల్ల ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు లేకుండా చేశామని తెలిపారు సీఎం. వర్గీకరణకు తీర్మానం చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కొట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం లేవనెత్తిన సమస్యలు, అభ్యంతరాలను కేబినెట్ సబ్ కమిటీతో పాటు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు సీఎం.
ALSO READ: చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద నిఘా.. నెక్స్ట్ దాడికి వస్తే చుక్కలే..
సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గకరణ తొలి నుంచి మద్దతు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రిజర్వేషన్ పర్సెంటేజ్‌ల గురించి ప్రస్తావించామన్నారు. గతంలో కొన్ని కులాలను వేరే గ్రూపులో చేర్చారన్నారు. న్యాయబద్దమైన డిమాండ్లను పరిశీలించి ముఖ్యమంత్రి తగు నిర్ణయం తీసుకుంటామని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారాయన.
సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భేటీ pic.twitter.com/4M7KXjYKwe
— BIG TV Breaking News (@bigtvtelugu) February 11, 2025