Ali Fazal: ఒకప్పుడు ఒక ఇండియన్ యాక్టర్ హాలీవుడ్ సినిమాల్లో నటించడమే పెద్ద విషయంగా ఉండేది. కానీ ఈరోజుల్లో ఇండియన్ యాక్టర్స్.. హాలీవుడ్ సినిమాల్లో, హాలీవుడ్ యాక్టర్స్.. ఇండియన్ సినిమాల్లో నటించడం చాలా కామన్ అయిపోయింది. హాలీవుడ్ మేకర్స్ సైతం ఇండియన్ యాక్టర్స్‌ను ఏరికోరి తమ సినిమాల్లో ఎంపిక చేసుకుంటున్నారు. అలా ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌తో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న నటుడికి కూడా ఇంగ్లీష్ సినిమాలో నటించే అవకాశం లభించింది. ఆ యాక్టర్ మరెవరో కాదు.. అలీ ఫజల్. ‘మీర్జాపూర్’లో గుడ్డూ భయ్యాగా ఆకట్టుకున్న అలీ.. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ మూవీతో హాలీవుడ్ ప్రేక్షకులను అలరించనున్నాడు. దాని ఎక్స్‌పీరియన్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు.
మంచి ఎక్స్‌పీరియన్స్
అలీ ఫజల్ (Ali Fazal) ఇంగ్లీష్ సినిమాల్లో నటించడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా పలు హాలీవుడ్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఈ బాలీవుడ్ స్టార్. ఇక త్వరలోనే ‘రూల్ బ్రేకర్స్’ అనే మరో మూవీతో మరోసారి ఇంగ్లీష్ ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ మూవీ 2025 మార్చి 7న విడుదలకు సిద్ధమయ్యింది. కేవలం నార్త్ అమెరికన్ థియేటర్లలో మాత్రమే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో అసలు తన పాత్ర ఎలా ఉంటుంది అనే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసి మరీ వివరించాడు అలీ ఫజల్. ‘రూల్ బ్రేకర్స్’కు సంబంధించిన ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకున్నాడు.
చాలా గర్వపడుతున్నాను
‘రూల్ బ్రేకర్స్’లో సమీర్ సిన్హా అనే పాత్రలో కనిపించనున్నాడు అలీ ఫజల్. ‘‘ఈ సినిమా ఒక ఆణిముత్యం. ఇందులో భాగమయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. రూల్ బ్రేకర్ అనేది మామూలు కథ కాదు. ఇందులో ధైర్యం, ఐక్యత్వం, చదువు ప్రాముఖ్యత.. ఇలా అన్నీ ఉంటాయి. మహిళల ధైర్యానికి అద్దంపట్టేలా ఉండే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈ సినిమా అమెరికాలో విడుదల అవ్వడం అనేది దీనిని మరింత స్పెషల్‌గా మారుస్తుంది. ఈ ప్రయాణాన్ని వెండితెరపై ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూస్తారా అని ఎదురుచూస్తున్నాను’’ అంటూ సంతోషంతో ఈ విషయాన్ని పంచుకున్నాడు అలీ ఫజల్.
Also Read: థియేటర్లలో ‘సనమ్ తేరీ కసమ్’ జోరు.. సంతోషంగా సీక్వెల్ రిలీజ్ డేట్ రివీల్ చేసిన మేకర్స్..
మహిళ పోరాటం
‘రూల్ బ్రేకర్స్’ (Rule Breakers) సినిమా నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. అమ్మాయిలకు విద్య అందడం కోసం ఒక మహిళ ముందుకొచ్చి ఎలా పోరాడింది అనేదే ఈ సినిమా కథ. ఈ మూవీలో ఫోబీ వాలర్ బ్రిడ్జ్ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ బిల్ గుట్టెన్‌ట్యాగ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ‘అలీ ఫజల్’ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తను లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘మెట్రో ఇన్ దినో’ సినిమా చాలాకాలంగా ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ మూవీ విడుదల కోసం చాలామంది బాలీవుడ్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇది కాకుండా మరో రెండు సినిమాలు కూడా అలీ ఫజల్ ఖాతాలో ఉన్నాయి.