E-Paper
Advertisement

కొండాయికి ‘సీతక్క’ భరోసా.. వరద బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు, రూ. 16 కోట్లతో అభివృద్ధి పనులు!

కొండాయికి ‘సీతక్క’ భరోసా.. వరద బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు, రూ. 16 కోట్లతో అభివృద్ధి పనులు!
Advertisement

Kondai Development: ములుగు జిల్లాలోని కొండాయి గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఇటీవల కొండాయి గ్రామ పంచాయతీ పరిధిలో పర్యటించిన ఆమె, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు ,ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ఏడాది సంభవించిన భారీ వరదల వల్ల కొండాయి గ్రామం ఎంతగానో నష్టపోయిందని, ఆ కష్ట కాలంలో తాము అండగా నిలబడ్డామని గుర్తు చేస్తూ.. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి మరిన్ని నిధులతో గ్రామాన్ని అన్ని రకాలుగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు.

ప్రధానంగా ఇళ్ల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తొలి విడతలోనే 115 ఇందిరమ్మ ఇళ్లను ఈ గ్రామానికి మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే మంజూరైన ఇళ్లతో పాటు, మిగిలిపోయిన అర్హులైన ప్రతి ఒక్కరికీ రెండో విడతలో ఖచ్చితంగా ఇళ్లు కేటాయిస్తామని ఆమె హామీ ఇచ్చారు. గూడు లేని నిరుపేదలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ లక్ష్యం ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చడమేనని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Also read: తల్లికి మాటిచ్చాడు.. 71 ఏళ్ల వయసులో నిలబెట్టుకున్నాడు.. ఇది కదా ప్రేమ అంటే!

అదేవిధంగా, గ్రామస్తులకు ప్రధాన సమస్యగా మారిన రవాణా సౌకర్యంపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. కొండాయి వాగుపై సుమారు 16 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను మంత్రి పరిశీలించారు. వర్షాకాలం వస్తే ఈ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, వానలు మొదలయ్యే లోపే బ్రిడ్జి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ప్రజల సౌకర్యార్థం ఈ వంతెనను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆమె గట్టిగా చెప్పారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత శక్తి మేరకు గ్రామాన్ని ఆదుకున్నామని, ఇప్పుడు అధికారంలో ఉండి మరింత బాధ్యతగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

Advertisement

Also read: అమరుల స్థూపానికి కట్టేసి కొట్టండి.. కానీ పేదలకు ఉచిత విద్య ఇవ్వండి.. కవిత సంచలన సవాల్

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×