BigTV English
Advertisement

Sigachi Industries: సిగాచి ఫ్యాక్టరీ పేలుడుపై అనుమానాలు! హైదరాబాద్‌లో ఓనర్? 90 రోజులపాటు

Sigachi Industries: సిగాచి ఫ్యాక్టరీ పేలుడుపై అనుమానాలు! హైదరాబాద్‌లో ఓనర్? 90 రోజులపాటు

Sigachi Industries: హైదరాబాద్ శివారులోని పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి ఫ్యాక్టరీలో ఏం జరిగింది? ఘటన వెనుక మానవ తప్పిదమే కారణమా? ఆ కంపెనీ ఓనర్ హైదరాబాద్‌లో ఉన్నారా? కేవలం సెబీకి సమాచారం ఇవ్వడం వెనుక అసలు కథేంటి? ఘటన జరిగి మూడు రోజులైనా ఎందుకు స్పందించలేదు? ప్రమాదంలో ఆపరేషన్స్ వ్యవహారాలు చూస్తున్న వ్యక్తి ఉన్నారా? అందుకే మేనేజ్‌మెంట్ సైలెంట్‌గా ఉందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


హైదరాబాద్‌లోని సిగాచి పరిశమ్రలో మూడు రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఈ కంపెనీని స్థాపించిన వ్యక్తి నేవీ అధికారి. ఆయన నార్త్ ఇండియాకు చెందినవారు. రిటైర్‌మెంట్ తర్వాత హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కంపెనీ వ్యవహారాలను ఓ వ్యక్తికి అప్పగించారట. ఘటనకు ముందు అతడు ఫ్యాక్టరీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఆఫీసులోకి వెళ్తున్న సమయంలో భారీ ఎత్తున బ్లాస్ట్ సంభవిం చిందని అంటున్నారు. హైదరాబాద్ యూనిట్‌లో ఏం జరిగిందో యాజమాన్యానికి, సంబంధిత డైరెక్టర్లకు తెలీదని అంటున్నారు.

ఈ కంపెనీ స్టాక్ మార్కెట్‌లో లిస్టు అయ్యింది. ఘటన తర్వాత సెబీకి సమాచారం ఇచ్చింది. దురదృష్ఠకరమైన ఘటన జరిగిందని చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన ఎలాంటి కారణాలు వివరించలేదు. ఎంతమంది చనిపోయారనేది చెప్పలేదు. 90 రోజులపాటు ప్లాంట్ ఉత్పత్తి నిలిచి వేస్తున్నట్లు ప్రస్తావించిందని తెలుస్తోంది. ఫుల్ ఇన్యూరెన్స్ ప్లాంట్ అని చెబుతూనే, పెట్టుబడుదారులను కన్వీన్స్ చేసే ప్రయత్నం చేసింది. గడిచిన రెండురోజుల్లో 11 శాతం ఆ కంపెనీ షేర్లు నష్టపోయాయి. ఘటన తర్వాత ఫీల్డ్‌లో ఎవరూ కనిపించలేదు.


ఈ కంపెనీకి రబీంద్ర ప్రసాద్ సిన్హా ఛైర్మన్ కాగా, అమిత్ రాజ్ సిన్హా సీఈవో, డైరెక్టర్లు ఎలాంటి ప్రకటన చేయలేదు.  ఫార్మా కంపెనీలో కీలకమైంది మైక్రో క్రిస్టల్ సెల్యూలోస్. చెట్ల నుంచి తీసినవాటితో తెల్లటి పొడి తయారు చేస్తారు. మనం తీసుకునే టాబ్లెట్‌ చుట్టూ ఉండే తెల్లటి పొడి. ఆ మెటీరియల్ ఆ కంపెనీలో మేకింగ్ జరుగుతోంది. గడిచిన రెండేళ్లుగా ఆ కంపెనీకి దేశ, విదేశాలను భారీగా ఆర్డర్లు వచ్చాయి. ఆ కంపెనీ కార్యలపాలు 62 దేశాలతో కొనసాగుతున్నాయి. ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తున్నారు.

ALSO READ: రెడ్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

డ్రైయర్ యూనిట్‌‌లో పేలుడు సంభవించడంతో దాని ప్రభావం హెయిర్ హ్యాండ్లింగ్ యూనిట్‌పై పడిందని అంచనా వేస్తున్నారు. చివరకు మూడు అంతస్తుల భవనం నేలమట్టం అయ్యింది. హెయిర్ హ్యాండ్లింగ్‌లో యూనిట్‌ను తరచుగా తనిఖీలు చేపట్టాలి. ఆర్డర్లు ఎక్కువగా ఉండడంతో తనిఖీల విషయాన్ని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. తనిఖీ చేయాల్సిన ప్రభుత్వ అధికారులు, ప్రతీ నెల వెళ్లి చేతులు తడుపుకుని రావడం చేస్తున్నారన్న వాదన మరోవైపు బలంగా వినిపిస్తోంది. గుజరాత్‌లో ఆ కంపెనీకి ఉన్న రెండు యూనిట్లను విస్తరించారు.

హైదరాబాద్ యూనిట్ విషయానికొస్తే 6400 మెట్రిక్ టన్నులసామర్థ్యం ఉందని అంటున్నారు. అధికంగా ఉత్పత్పికి ప్లాన్ చేసి ఇబ్బందులు తలెత్తినట్టు చెబుతున్నారు. మరోవైపు సిగాచి కంపెనీ రియాక్ట్ అయ్యింది.  40 మంది మృతి చెందినట్టు తెలిపింది.  33 మందికి గాయాలు అయినట్టు వెల్లడించింది. మృతుల కుటుంబాలకు కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వనుంది.  బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని కంపెనీ సెక్రటరీ వివేక్‌కుమార్ తెలిపారు.

Related News

Top 20 News @ 7 PM: ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్.. త్రిషా ఇంటికి బాంబు బెదిరింపు.. నేటి టాప్ 20 న్యూస్ ఇవే!

Jubilee Hills Byelection: రేపే పోలింగ్.. తనకు అండగా నిలబడాలని సునీత విజ్ఞప్తి!

Karimnagar News: పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 25 మంది బాలికలకు అస్వస్థత

Top 20 News @ 6 PM: అందెశ్రీ ఇక లేరు.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు.. నేటి టాప్ 20 న్యూస్ ఇవే!

Jubilee Hills Byelection: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం.. పోలింగ్‌పై డ్రోన్‌లతో నిఘా: సీఈఓ సుదర్శన్ రెడ్డి

Indira Mahila Shakti Sarees: మహిళలకు శుభవార్త.. చీరల పంపిణీకి సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం

Hyderabad: హైదరాబాద్‌లో టెర్రరిస్ట్ అరెస్ట్.. ఆముదం గింజలతో భారీ కుట్ర!

Karimnagar: కరీంనగర్ కలెక్టరేట్‌లో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న పోలీసులు

Big Stories

×