E-Paper
Advertisement

జూరాలకు 5 టీఎంసీల నీళ్లు వస్తాయా? డీకే శివకుమార్‌తో రేవంత్ టీమ్ బిగ్ డీల్!

జూరాలకు 5 టీఎంసీల నీళ్లు వస్తాయా? డీకే శివకుమార్‌తో రేవంత్ టీమ్ బిగ్ డీల్!
Advertisement

Jurala Water: రైతులకు సాగునీళ్లే ఎజెండాగా.. బెంగళూరుకు వెళ్లింది పాలమూరు మంత్రులు, ఎమ్మెల్యేల బృందం. మంత్రులు జూపల్లి  కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి.. కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ను కలిసేందుకు బెంగళూరు వెళ్లారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగు, తాగునీటి కష్టాలు తీర్చడమే ఈ టూర్ ఉద్దేశం. కర్ణాటకతో ఎలా చర్చించాలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. మంత్రుల బృందం బెంగళూరు వెళ్లడానికి ముందే.. కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జూరాలకు నీళ్లు వదలాలని కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు.

జూరాలకు 5 టీఎంసీల నీటి విడుదల..?

Advertisement

ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్‌ల నుంచి జూరాలకు 5 టీఎంసీల నీటి విడుదలపైనే.. సీఎం డీకేతో భేటీలో చర్చించనున్నారు. అయితే, కర్ణాటకకూ ఇబ్బందులు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో 100 నియోజకవర్గాల్లో కరువు ప్రకటించినట్లు స్వయంగా శివకుమార్‌ ఇటీవల చెప్పారు. తాగునీరు, విద్యుత్‌ కొరత ముంచుకొస్తుందని ఆయన హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితిలో అదనపు నీటి విడుదల ఏ మేరకు సాధ్యమన్నదే కీలక ప్రశ్న. మరోవైపు.. జూరాల ఆయకట్టు రైతులకు నీటి విడుదలపై.. తెలంగాణలో రాజకీయ దుమారం రేగింది. నీరు విడుదల చేయాలంటూ.. బీఆర్ఎస్, బీజేపీ పోరుబాట పట్టాయి. అయితే, కృష్ణా జలాల కేటాయింపులో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టుల డిజైన్లు, వాటర్‌ సోర్స్‌ మార్చారని మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2 లక్షల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదని విమర్శించారు. ఎల్‌నినో ప్రభావంతో వచ్చిన తాగునీటి కష్టాలకు బీఆర్‌ఎస్‌ తప్పులే కారణమని ఉత్తమ్‌ ఆరోపించారు.

కర్ణాటకలో కరువు.. మనకు నీళ్లు దొరికేనా?

Advertisement

బెంగళూరు భేటీలో.. సీఎం డీకే శివకుమార్‌ ఏం చెబుతారన్నదే ఇప్పుడు కీలకం. కర్ణాటకే కరవులో ఉన్నప్పుడు.. తెలంగాణకు ఎన్ని నీళ్లు దక్కుతాయి? జూరాల రైతుల ఎదురుచూపులకు.. నీళ్ల రూపంలో ఫలితం దక్కుతుందా? అనేది బిగ్ క్వశ్చన్.

Tags

Related News

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, ఏపీ-ఉత్తర తెలంగాణల్లో ఫ్లాష్‌ఫ్లడ్‌, అలర్ట్ చేసిన వాతావరణ కేంద్రం

రేపు తెలంగాణకు భారీ వానగండం.. ఈ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..?

ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. మంత్రి వివేక్ కీలక ప్రకటన!

ఇక స్మార్ట్ సిటీగా నల్గోండ జిల్లా.. మంత్రి వెంకట్ రెడ్డి కీలక నిర్ణయం!

ఎమ్మెల్సీ ఎన్నికలకు కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

ఏసీబీకి చిక్కిన మంచిర్యాల గ్రామ పరిపాలనా అధికారి!

ప్రభుత్వ వైద్యం దయనీయం.. చిన్నారుల చావుల్లోనూ నిర్లక్ష్యమా?.. కవిత తీవ్ర ఆగ్రహం!

Big Stories

Advertisement
×