Gundeninda GudiGantalu Today episode September 23rd: మీనా హాస్పిటల్లో బాధపడిపోతూ ఉంటుంది ఐదు లక్షలు డబ్బులు పోయాయి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. బాలు ఈ విషయం తెలిసి చాలా కంగారు పడిపోతూ హాస్పిటల్ కి వస్తాడు మీనాని ఆ పరిస్థితిలో చూసి బాధ పడిపోతాడు. ఇంత జరుగుతున్నా నాకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు నేను నీతో కావాలని గొడవ పడలేదు కదా నన్ను క్షమించు మీనా అని చెప్తాడు బాలు.. నేను నీ పరిస్థితిలో చూడలేకపోతున్నాను మీనా? నేను ఎంత స్పీడ్ లో వచ్చానో నాకే తెలియదు. కానీ నీకోసం అని ఆలోచించకుండా వచ్చేసాను అని బాలు చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. మీనా మాత్రం నేను మోసపోయానండి ఆ డబ్బులు దొంగలు కొట్టేశారు అది సుమతి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన డబ్బులు అండి ఎలా కట్టాలని నాకు భయంగా ఉంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది ఈ ఎపిసోడ్కి ఇదే హైలెట్ సీన్ అనే చెప్పాలి.
ఇంట్లో వాళ్ళందరూ కాఫీ అని అడుగుతూనే ఉన్నారు. ఈ మహారాణి ఎక్కడికి వెళ్లిందో ఊర్లో ఉన్న పంచాయతీలన్నీ ఈవిడ తీరుస్తున్నట్టు ఉంది అంటూ ప్రభావతి చాలా సీరియస్ అవుతూ ఉంటుంది. కాఫీ అంటూ ప్రభావతి దగ్గరికి వస్తారు. మీనా ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్ళింది అంటూ ప్రభావతి అరుస్తూ ఉంటుంది. అప్పుడే బాలు మీనా చేతికి కట్టుతో ఇంట్లోకి రావడంతో మిగిలిన వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు కానీ ప్రభావతి మాత్రం ఏం ఏం జరిగింది. ఎందుకు అంత పెద్ద కట్టు కట్టుకొని వచ్చావు చెయ్యమైనా విరిగిందా అని అడుగుతుంది. కానీ బాలు మాత్రం అసలు నిజం చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ప్రభావతి మాత్రం లోలోపల సంతోష్ పడుతున్నా కూడా పైకి మాత్రం బాధపడుతున్నట్టు నటిస్తుంది. మీద పరిస్థితిని చూసి అందరూ జాలి పడతారు..
ప్రభావతి మీనాకు గాయమైంది నీ ప్రభావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది.. అయితే మీనా ఎంత చెప్తున్నా సరే ప్రభావతి మాత్రం అది చేసింది తప్పే ఆకాశానికి నిచ్చెనలు వేయడం తప్పు కదా అని అంటుంది. ప్రభావతి ఎంత చెప్పిన సరే నా నగలు కానీ ఇంకేది కానీ నేను ఇవ్వను అని అంటుంది. అయితే సత్యం మాత్రం ప్రభావతి నగలు ఇవ్వాల్సిందే అని అంటాడు. నేను అస్సలు నా నగలు ఇవ్వను అని ప్రభావతి అంటుంది అయితే మీనా నాకు ఎవరి నగలు వద్దు మావయ్య. నేనే బాధ్యత వహిస్తాను అని అంటుంది. ఆపు నేను తీర్చుకుంటాను అని మీ నాన్న అనగానే సత్యం మాత్రం ప్రభావతి సెటైర్లు వేస్తాడు అలాగే శృతి కూడా మీ నగలు మీరు తీసుకొని వెళ్ళిపోతున్నారు కదా మరి మీనా నగలు ఎత్తుకెళ్లిన మీ అబ్బాయి ఎంత డబ్బులు ఇచ్చాడు అని అడుగుతుంది శృతి. శృతి మనతో పాటుగా రోహిణికి కూడా దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తుంది..
మీనాకు దెబ్బలు తగిలేయని పార్వతి పలకరించడానికి అని ప్రభావతి వాళ్ళ ఇంటికి వస్తుంది.. శివా సుమతి ఇద్దరు కూడా మనము మీనా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము కదా వాళ్ళ అత్తయ్య మనల్ని ఎప్పుడూ ఏదో ఒకటి అంటుంది అవసరమంటావా అని భయపడిపోతూనే లోపలికి వెళ్ళిపోతారు. వీళ్ళు చూసిన తర్వాత ప్రభావతి కామెంట్స్ చేస్తూనే ఉంటుంది కానీ పార్వతి కూడా మాటకు మాట సమాధానం చెప్పుతో ప్రభావతికి దిమ్మతిరిగి పోయేలా షాక్ ఇస్తుంది. అసలు ప్రభావతికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా రోహిణి మనోజ్లను అడ్డుపెట్టుకొని మరి తిట్టేస్తుంది. మనోజ్ కట్టే డిగ్రీల పేరు చెప్పి మళ్ళీ మళ్ళీ తిట్టేస్తుంది ఇక పార్వతి మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోతేనే బాగుంటుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
మనోజ్ షోరూంలో ఉండగా రోహిణి తన కోసమని బాక్స్ తీసుకుని వస్తుంది కానీ మనోజ్ మాత్రం రోహిణిని చూసి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు. అయితే రోహిణి మనోజ్ వెనకాలే నీకోసం జ్వరం వచ్చింది అని బాక్స్ తీసుకొని వచ్చాను అని అంటుంది. ఇన్ని రోజులు నేను ఉప్పు కారం లేకుండా నేను తిన్నాను కదా ఇప్పుడు ఏంటి కొత్తగా నాకోసం బాక్స్ తెచ్చావు అని అడుగుతాడు మనోజ్. మాట వినగానే రోహిణి మన ప్రేమ గురించి మర్చిపోయావా అంటూ మళ్లీ పాత రోజులను గుర్తు చేసే పనిలో ఉంటుంది. ఇక తర్వాత రోహిణి మనోజ్ కి తన మీద ఉన్న ప్రేమను తెలుసుకొని చాలా సంతోషంగా ఉంటుంది. మనిద్దరం సంతోషంగా ఉండాలి అంటే నువ్వు ప్రతి విషయాన్ని మీ అమ్మకు చెప్పడం ఆపేయాలి రోహిణి అంటుంది.
ప్రభావతి వంటగదిలో కుస్తీ పడుతూ ఉంటుంది. వంటగది తన మీద పగ పట్టింది అంటూ ప్రభావతి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఏవి ఎక్కడ ఉన్నాయి కూడా నాకు తెలియట్లేదు నేను నీకు అవ్వంటే ఏం చేస్తాను అని ఆలోచిస్తూ ఉండగా చేయి కోసుకుంటుంది. అయితే ప్రభావతి వంటగదిలో కష్టపడుతున్న సమయంలో కామాక్షి ఏంటి వదిన ముగ్గురు కోడలు వచ్చినా కూడా నువ్వు వంట గదిలో ఇంతగా కష్టపడుతున్నావు అని అంటుంది. దానికి ప్రభావతి ఆ మీనా కింద పడి దెబ్బలు తగిలించుకున్నాను అని చెప్పింది ఇవాల్టికి నేనే వంట చేయాలి అని అనగానే కౌంటర్ల వర్షం కురిపిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.