Virender Sehwag Criticizes Gary Kirsten: టీమిండియా ఒకప్పటి కోచ్ గ్యారీ కిర్ స్టెన్ పై (Gary Kirsten) వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2011 వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ గ్యారీ కిర్ స్టెన్ వల్ల రాలేదని బాంబు పేల్చారు. టీమిండియాలో ఉన్న సభ్యులందరూ కలిసి కష్టపడి ఆ ట్రోఫీని గెలిచినట్లు వివరించారు. కానీ కొంతమంది గ్యారీ కిర్ స్టెన్ కారణంగా 2011 వరల్డ్ కప్ వచ్చిందంటూ విషప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. టీమిండియా హెడ్ కోచ్ గా అతను బాధ్యతలు తీసుకోకముందే… తమ జట్టు చాలా బలమైందని వ్యాఖ్యానించారు. 2007 టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని గెలిచిన నుంచి టీమిండియా చాలా బలంగా తయారైందని వ్యాఖ్యానించారు. అనవసరంగా 2011 వన్డే వరల్డ్ కప్ ట్రాఫిక్ క్రెడిట్ ను గ్యారీ కిర్ స్టెన్ ఖాతాలో వేస్తున్నారని సీరియస్ అయ్యారు వీరేంద్ర సెహ్వాగ్. దీంతో గ్యారీపై వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
2007 టి20 ప్రపంచ కప్ మహేంద్ర సింగ్ ధోని సారధ్యంలో టీమిండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2008 సంవత్సరంలో గ్యారీ క్రిస్టన్ టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్నారు. 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచే వరకు టీమిండియా కోచ్ గానే ఆయన పని చేశారు. అయితే ఈ ట్రోఫీ గెలవడం వెనక గ్యారీ పాత్ర ఉందని క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా స్పష్టం చేస్తున్నారు. వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ఆరోపణలలో నిజం లేదని స్పష్టం చేస్తున్నారు. టీమిండియాలో యువ క్రికెటర్లను తీసుకువచ్చింది గ్యారీ క్రిస్టన్ అంటూ వ్యాఖ్యానించారు.
కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో నిత్యం టచ్ లో ఉంటూనే… ఇద్దరు కలిసి మంచి పని చేశారని స్పష్టం చేస్తున్నారు. ధోని అలాగే గ్యారీ కామినేషన్ లో టీమిండియా ర్యాంకింగ్స్ లో కూడా నెంబర్ వన్ స్థానానికి చేరుకుందని స్పష్టం చేస్తున్నారు. చివరికి 2011 వన్డే వరల్డ్ కప్ కూడా టీం ఇండియా గెలిచిందని పేర్కొంటున్నారు. కీలకమైన సమయాలలో టీమిండియా కు సలహా సూచనలు ఇస్తూ.. అందరి కోచ్ ల లాగా కాకుండా భిన్నంగా జట్టును లీడ్ చేశారు. అందుకే ఇతని పిరియడ్ లో టీమిండియా ఎన్నో విజయాలు సాధించిందని కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
టీమిండియా ఒకప్పటి కోచ్ గ్యారీ కిర్ స్టెన్ ను అందరూ మెచ్చుకుంటుంటే వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం చాలా విమర్శలు చేశారు. 2011 వన్డే వరల్డ్ కప్ విజయంలో గ్యారీ పాత్ర ఏమీ లేదంటూ పరువు తీశారు. గ్యారీ రాకముందే టీమిండియా బలంగా ఉందని… ఇందులో అతడు పీకిందేమీ లేదన్నారు. అయితే గ్యారీ కోచ్ గా ఉన్న సమయంలో వీరేంద్ర సెహ్వాగ్ కు సరైన అవకాశాలు రాలేదని అంటున్నారు. ఈ క్రమంలోని అతనిపై విమర్శలు చేశారని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.