Champions Trophy 2025: టీమిండియా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2024లో భారత జట్టు టి-20 ప్రపంచ కప్ ఛాంపియన్ గా నిలిచిన అనంతరం అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్ కి వీడ్కోలు ప్రకటించారు. ప్రస్తుతం వన్డేలు, టెస్టుల్లో కొనసాగుతున్న ఈ ఇద్దరు గత కొన్ని నెలలుగా పేలవ ఫామ్ తో సతమతమవుతున్నారు. ముఖ్యంగా రెడ్ బాల్ క్రికెట్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
Also Read: Dimuth Karunaratne: చాంపియన్స్ ట్రోఫీకి కంటే ముందే శ్రీలంకకు షాక్.. స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్..!
ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఇక ఆటకు సెలవు ఇచ్చి యువ క్రికెటర్లకు మార్గం సుగమం చేయాలనే డిమాండ్లు వినిపించాయి. ఇక టి-20 క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వీరిద్దరూ శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో మాత్రమే పాల్గొన్నారు. తాజాగా మరోసారి ఇంగ్లాండ్ తో వన్డేలకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 6 నుండి సొంత గడ్డపై జరగబోతున్న ఈ సిరీస్ అనంతరం.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 {Champions Trophy 2025} లో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బిజీ అవుతారు.
ఐతే చిరకాల ప్రత్యర్ధులైన భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ ల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇరు దేశాల అభిమానులే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచం ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దాయాది దేశాలు ద్వైపాక్షిక సిరీస్ లు ఆడకుండా.. కేవలం ఐసీసీ, ఏసిసి టోర్నీలో మాత్రమే తలపడుతున్నాయి. చాంపియన్ ట్రోఫీ 2025 {Champions Trophy 2025} లో భాగంగా భారత్ – పాకిస్తాన్ జట్లు ఈనెల 23న దుబాయ్ వేదికగా తలపడబోతున్నాయి.
ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మకి ఘోర అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ {Champions Trophy 2025} కి ముందే కోహ్లీ వార్తల్లో నిలిచాడు. తాజాగా పాకిస్తాన్ లోని నగరాలు, వీధుల్లో విరాట్ కోహ్లీ పోస్టర్లు వెలిశాయి. ఇవి చాంపియర్స్ ట్రోఫీ ప్రచార పోస్టర్లు. ఈ పోస్టర్లను ఓ పాకిస్తాన్ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ప్రమోషనల్ పోస్టర్లలో విరాట్ కోహ్లీ తో పాటు ఇతర జట్ల స్టార్ ఆటగాళ్ల ఫోటోలు కూడా ఉన్నాయి.
Also Read: IND Vs ENG ODI 2025: వన్డే సిరీస్ టైమింగ్స్.. ఉచితంగా ఎలా,ఎక్కడ చూడాలంటే..?
అయితే మధ్యలో కోహ్లీని పెద్దగా చూపించారు. ఇందులో విషయం ఏంటంటే.. భారత జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్ కాకపోవడం గమనార్హం. కెప్టెన్ రోహిత్ శర్మని గుర్తించకుండా.. అతడిని అవమానిస్తూ విరాట్ కోహ్లీ ఫోటో ప్రచురించడం ఏమిటని రోహిత్ శర్మ అభిమానులు మండిపడుతున్నారు. అయితే ఇందులో కోహ్లీ పోస్టర్ని చేర్చడానికి కారణం ఏమిటంటే.. అతడికి పాకిస్తాన్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. పాకిస్తాన్ క్రీడాభిమానులకు కూడా కోహ్లీ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే కోహ్లీ ఫోటోతో ఉన్న పోస్టర్లు దర్శనమిచ్చాయి.
VIRAT KOHLI IN THE POSTERS OF CHAMPIONS TROPHY IN PAKISTAN. 👑
– King Kohli, The Face of Cricket. 🐐 pic.twitter.com/iFjJs5LUUP
— Tanuj Singh (@ImTanujSingh) February 4, 2025