BigTV English

PM Modi: మోదీ వరంగల్ టూర్ అందుకేనా?.. రాహుల్ ఎఫెక్టేనా!?

PM Modi: మోదీ వరంగల్ టూర్ అందుకేనా?.. రాహుల్ ఎఫెక్టేనా!?

Narendra Modi news today live(Telangana bjp news): ప్రధాని మోదీ ఫస్ట్ టైమ్ వరంగల్ టూర్. రోడ్డు, రైలు ప్రాజెక్టులకు రిమోట్ కంట్రోల్‌తో శంకుస్థాపన. ఎన్నికల ముందు తెలంగాణలో హడావుడి చేస్తున్నారనేది నిజం. అయితే, సడెన్‌గా వరంగల్‌నే ఎంచుకోవడమే ఇంట్రెస్టింగ్ పాయింట్. గతంలో వందేమాతరం రైలుకు జెండా ఊపేందుకు హైదరాబాద్.. ఎరువుల కర్మాగారం ఓపెనింగ్‌కు రామగుండం..వచ్చారు. అవి ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్. వరంగల్ పర్యటన మాత్రం అలా కాదు. ఇలా వ్యాగన్ ఫ్యాక్టరీని అనౌన్స్ చేసి.. అలా హెలికాప్టర్‌లో వాలిపోవడమే రాజకీయంగా ఆసక్తికర పరిణామం.


మోదీ వరంగల్ టూర్‌ను సెలెక్ట్ చేసుకునేందుకు రెండు కారణాలను చెబుతున్నారు. ఇటీవలే ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభ ఘనంగా జరిగింది. ఆ సభలో రాహుల్ మేనియా మామూలుగా లేదు. లక్షల్లో జనం తరలివచ్చారు. 4వేల పెన్షన్ అంటూ మొదటి గ్యారెంటీ కార్డు ప్రకటించారు. ఆ ఎఫెక్ట్ బీజేపీ మీద బాగానే పడిందంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, రాహుల్ ఛరిష్మాను మరోసారి బలంగా చాటిందంటున్నారు. ఆ ప్రభావాన్ని కాస్త మసకబరచడానికి.. మోదీ ఖమ్మం పక్కనే ఉండే వరంగల్ జిల్లాను ఎంచుకున్నారని కూడా అంటున్నారు.

ఏ బయ్యారంలోనో ఉక్కు ఫ్యాక్టరీ ప్రకటించేసి.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే సభ పెట్టొచ్చు కానీ.. మరీ రాహుల్ గాంధీకి భయపడి కావాలనే అక్కడికి వచ్చారనే ప్రచారం జరిగే అవకాశం ఉందని.. బయ్యారం కాకుండా కాజీపేటకు లొకేషన్ ఛేంజ్ చేశారని అంటున్నారు. ఖమ్మంలో బీజేపీ బలం మరీ అంతంతమాత్రమే కాబట్టి.. ఖమ్మం కాకుండా.. కాస్త ఉనికి ఉండే వరంగల్ అయితే.. ఉమ్మడి జిల్లాతో పాటు పక్కనే ఉండే కరీంనగర్ నుంచి కూడా జనాలను తరలించడం ఈజీ అని.. ఈ ఈవెంట్‌ను ఎంచుకున్నారని చెబుతున్నారు.


ఇంకో కారణం మరింత ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఏడాది క్రితం మే 6న.. ఇదే వరంగల్ జిల్లాలో ‘రైతు సంఘర్షణ సభ’ వేదికగా ‘వరంగల్ డిక్లరేషన్’ ప్రకటించారు రాహుల్ గాంధీ. ఆనాటి రాహుల్ సభ గ్రాండ్ సక్సెస్. వరంగల్ రైతు డిక్లరేషన్ అంతకంటే సూపర్ సక్సెస్.

రైతును రాజు చేయటమే లక్ష్యంగా.. 2లక్షల వరకు రైతు రుణమాఫీ, కౌలు రైతులకు ఏడాదికి 15వేల పెట్టుబడి సాయం, రైతు కూలీలకు 12వేల ఆర్థిక సాయం, చెరుకు కర్మాగారాలను తెరిపించడం, పసుపు బోర్డు ఏర్పాటు, పంటల బీమా, భూమిలేని రైతులకు రైతు బీమా, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం, పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన రైతులకు యజమాన్య హక్కులు, ధరణి పోర్టల్ రద్దు, పంటలకు మద్దతు ధర, రైతు సమస్యల పరిష్కారానికి ‘రైతు కమిషన్’.. ఇలా అనేక కీలక హామీలతో వరంగల్ డిక్లరేషన్ ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఆ సభతో.. వరంగల్ జిల్లాలో, తెలంగాణ రైతుల్లో.. అప్పటినుంచీ రాహుల్ గాంధీ పేరు మారుమోగిపోతోంది. ఆ ఇమేజ్‌ను దెబ్బ కొట్టేందుకే.. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాజీపేటకు వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చేసి.. ప్రారంభోత్సవంతో పాటు విజయ సంకల్ప సభనూ ప్లాన్ చేసి.. రాహుల్‌కు, కాంగ్రెస్ ఇమేజ్‌కు చెక్ పెట్టేలా మోదీ టూర్‌తో ముందుకొచ్చారని విశ్లేషిస్తున్నారు.

Related News

MLC Kavitha VS Harish Rao: సిద్దిపేట నుంచి కవిత పోటీ?

Local Body Elections: ముదురుతున్న స్థానిక ఎన్నికల రగడ.. ఎన్నికలు జరుగుతాయా? లేదా?

Kandi Srinivasa Reddy: కంది శ్రీనివాస్ రెడ్డికి.. కాంగ్రెస్ బిగ్ షాక్!

Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ రచ్చ.. అసలేం జరిగిందంటే!

Musi River Floods: మూసీ ఉగ్రరూపం.. హైడ్రా ఆన్ యాక్షన్..

Kadapa TDP Internal Issue: కడపలో గ్రూపు రాజకీయాలు.. ఈ వ్యవహారం వెనుక ఉన్నదెవరు?

YCP Digital Book: ఒక్కొక్కరికి ఇక సినిమానే..! డిజిటల్ బుక్‌పై టీడీపీ రియాక్షన్ ఏంటి?

Telangana: ఆధిపత్య పోరుకు పుల్ స్టాప్.. మల్లు రవి యాక్షన్ వర్కౌట్ అవుతుందా?

Big Stories

×