BigTV English

Sharmila: పిల్లలకు ఆస్తులు రాసిచ్చిన షర్మిల.. జగన్ వల్లేనా?

Sharmila: పిల్లలకు ఆస్తులు రాసిచ్చిన షర్మిల.. జగన్ వల్లేనా?
sharmila childrens

YS Sharmila latest news(Telugu news headlines today): వైఎస్‌ షర్మిల మాత్రం ఎందుకో తన ఆస్తిని పిల్లల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయడం ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌గా మారింది. ఇడుపులపాయలో ఉన్న 9 ఎకరాల 50 సెంట్ల స్థలాన్ని కుమారుడి పేరుతో.. 2 ఎకరాల 12 సెంట్ల స్థలాన్ని కూతురు పేదమీద రిజిస్ట్రేషన్ చేయించారు షర్మిల. ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కోసం కుటుంబ సభ్యులు స్వయంగా రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌కు వెళ్లారు.


వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆస్తుల పంపకం చేశారు. కడప జిల్లాలోని వేంపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లిన షర్మిల తన పేరు మీదున్న కొన్ని ఆస్తులను కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలికి బదిలీ చేశారు. ప్రత్యేక విమానంలో కడపకు చేరుకున్న షర్మిల అక్కడి నుంచి కారులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అప్పటికే సిద్ధంగా ఉన్న డాక్యుమెంట్ల మీద కొడుకు, కూతురితో కలిసి ఆమె సంతకాలు చేశారు. గతంలో తాను కొనుగోలు చేసిన నిమ్మతోటను సైతం కుమార్తె పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించారు షర్మిల.

షర్మిల ఆస్తుల పంపకం పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌ అయింది. పిల్లలు మేజర్లు కావడం వల్లే వాళ్ల పేరుతో భూ రిజిస్ట్రేషన్‌ చేయించారా లేదంటే మరైవైనా కారణాలు ఉన్నాయా అనే చర్చ జరుగుతోంది. శనివారం ఇడుపులపాయలో వైఎస్ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అంతకుముందే శుక్రవారమే షర్మిల.. ఇడుపులపాయకు సంబంధించిన భూమిని పిల్లల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించారు. దీనివెనకాల రీజన్‌ ఏం అయ్యింటుందనే చర్చ జరుగుతోంది.


తన సోదరుడు, ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌తో షర్మిలకు విబేధాలు వచ్చాయని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. చాలా విషయాల్లో అది నిజమే అనే సందేహాలు వచ్చాయి. షర్మిల పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపైనా జగన్‌ స్పందించకపోవడం ఊహాగానాలకు తావిచ్చేలా చేసింది. అలాగే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం కూడా హాట్ టాపిక్‌ అయింది. విధానపరమైన నిర్ణయాల్లో ఏపీ ప్రభుత్వంపైనా షర్మిల విమర్శలు చేస్తున్నారు. ఈ వ్యవహారం వెనక వైఎస్‌కు సంబంధించిన ఆస్తుల పంపకాల విషయంలోనే తేడాలు వచ్చాయనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే షర్మిల ఇడుపులపాయ భూమిని పిల్లల పేరుతో మార్చేశారు అనే టాక్‌ నడుస్తోంది.

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×