BigTV English

Ponguleti: కొత్త పార్టీకే పొంగులేటి ఓటు?.. నాలుగు జిల్లాల్లో పక్కా లెక్కలు!!

Ponguleti: కొత్త పార్టీకే పొంగులేటి ఓటు?.. నాలుగు జిల్లాల్లో పక్కా లెక్కలు!!


: పొంగులేటి దారేది? కాంగ్రెస్‌వైపు వెళ్తారా? బీజేపీ ఆఫర్లకు జై కొడతారా? త్వరలోనే తేల్చేస్తా అంటున్నారాయన. అయితే, ఇప్పుడు అన్ని టికెట్లు ఇస్తాం.. ఇన్ని టికెట్లు ఇస్తామని.. పార్టీ కండువా కప్పేసి.. చివరాఖరికి ఎన్నికల సమయంలో తాను అడిగినన్ని సీట్లు ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? అసలే జాతీయ పార్టీలు.. ఎవరినని అడుగుతాం? అందుకే, ప్లాన్ ఏ, బీలతో పాటు సీ ని కూడా రెడీ చేసుకున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇది కూడా కొత్త ఆప్షన్ ఏమీ కాదు.. మొదట్లో వినిపించిందే.

సొంతంగా పార్టీ పెడితే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనపై మరింతగా చర్చిస్తున్నారట పొంగులేటి. TRS పేరు స్ఫురించేలా పార్టీ పెడతారని అంటున్నారు. తెలంగాణ రైతు సమాఖ్య పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఓ పార్టీ రిజిస్ట్రేషన్ జరిగింది. పొంగులేటి అనుచరులే ఆ పార్టీని రిజిస్టర్ చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది.


సొంత పార్టీ తరఫున 45 స్థానాల్లో అభ్యర్థులను నిలపాలని భావిస్తున్నారట. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటికి మంచి పట్టుంది. ఆ జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. పక్కనే ఉన్న వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ ఎంతోకొంత ప్రభావం చూపగలరు. అటు.. పాలమూరు నుంచి జూపల్లి కృష్ణారావు కూడా పొంగులేటితో కలిసి అడుగులేస్తున్నారు. మరికొన్ని జిల్లాల నుంచి కూడా BRS అసంతృప్తులు, ఉద్యమ కారులు తమతో చేతులు కలుపుతారని భావిస్తున్నారు. మొత్తంగా 45 స్థానాల్లో పోటీ చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది. అందులో కనీసం 15 స్థానాలైనా గెలిచి.. హంగ్ వస్తే కింగ్ మేకర్ కావాలనేది ఆయన స్కెచ్.

శ్రీనివాస్‌రెడ్డి రాజకీయ వ్యూహంపై నల్లగొండ జిల్లాలో చర్చ జరుగుతోంది. జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్, ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలు పొంగులేటితో టచ్‌లో ఉన్నారని టాక్. ఇటీవల బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన నల్లగొండ జిల్లా సీనియర్‌ నేత చకిలం అనిల్‌కుమార్‌ పొంగులేటితో భేటీపై ఆసక్తి నెలకొంది.

బీజేపీలో చేరితే ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పార్టీ పరంగా ఆయనకు అందివచ్చే అదనపు ప్రయోజనం శూన్యం. కాంగ్రెస్‌లో చేరినా.. నల్లగొండలో కాలు కూడా పెట్టనివ్వరు. ఏదో పార్టీలో చేరి.. ఎవరో చెప్పినట్టు వినడం కంటే.. సొంతంగానే కేసీఆర్‌తో తేల్చుకోవాలని చూస్తున్నారు. అందుకే, బీజేపీ, కాంగ్రెస్ కాకుండా.. సొంత పార్టీ అయితేనే.. తాను స్వతహాగా ఎదగొచ్చనేది ఆయన లెక్క. అర్థబలం, అంగబలం మెండుగా ఉండటంతో.. పోరాడితే పోయేదేమీ లేదనేది పొంగులేటి వ్యూహంలా కనిపిస్తోంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×