BigTV English

Nalgonda : ఘోర ప్రమాదం.. ఒకరు సజీవదహనం..

Nalgonda : ఘోర ప్రమాదం.. ఒకరు సజీవదహనం..
Nalgonda Latest news

Nalgonda Latest news(Today news in telangana) :

నార్కట్ పల్లి హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి చీరాలకు వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉండగా ఒక వ్యక్తి సజీవదహనమయ్యారు. నల్గొండ జిల్లాలో మర్రిగూడ బైపాస్ రోడ్డు వద్ధకు రాగానే షార్ట్ సర్కూట్ వల్ల బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ కేకలు వేయగా.. ప్రయాణికులు పరుగులు తీశారు.


స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కానీ.. అప్పటికే మంటలు తీవ్రం కావడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో సజీవదహనమైన వ్యక్తి వివరాలు సేకరిస్తున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.


Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×