Weather News: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి నెలలోనే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయంటే ఎండలు ఏ రేంజ్ లో కొడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మూములుగా మే నెలలో ఎండలు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. ఈ మాసంలోనే ఎండలు మే నెలను తలపిస్తున్నాయి.
దంచికొడుతున్న ఎండలు..
ఏప్రిల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎండల తీవ్రత మరింత పెరగనుంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో గత రెండు, మూడు రోజుల నుంచి చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కొన్ని చోట్ల అయితే 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో దంచి కొట్టాల్సిన ఎండలు.. ఇప్పుడే చుక్కలు చూపిస్తున్నాయి. అయితే ఈ సమయంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది.
తెలంగాణకు వర్షాలు..
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు మూడు రోజుల తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం లభించనుంది. అయితే తేలికపాటి వర్షాలు కురుస్తాయని.. మెరుపులు, ఉరుములు, ఈదురుగాలులతో ఉండవని అధికారులు తెలిపారు. అయితే రేపటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు రాష్ట్రంలో పొడి వాతావరణమే కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
Weather warnings of Telangana for the next 5 days dated 29.03.2025@TelanganaCMO @TelanganaCS @DCsofIndia @IASassociation @IasTelangana @tg_weather @metcentrehyd #CMO_Telangana @TelanganaDGP @GHMCOnline @CommissionrGHMC pic.twitter.com/JWX5cZNbeA
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) March 29, 2025
ఏపీలో మాడు పగిలేలా కొడుతున్న ఎండలు
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత అంతకంతకు పెరుగుతుంది. ఏపీలో వడగాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకు 40 డిగ్రీలు పైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరాయి. రాష్ట్రంలో చాలా చోట్లఅ సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు అవుతున్నట్టు ఐఎండీ అధికారులు తెలిపారు. ఈ సమయంలో 34 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సింది.. 40 డిగ్రీలకు పైనే ఎండలు కొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 150 కి పైగా మండలాల్లో 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అయితే 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదు అయ్యాయి. ప్రకాశం జిల్లా కొమరోలు, నంద్యాల, కమలాపురంలో అత్యధికంగా 42.5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు అధికారులు పేర్కొన్నారు. ఎస్ కోట, అనకాపల్లి, అన్నమయ్య జిల్లా రుద్రవరంలో 42 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాని తెలిపారు. కర్నూలు జిల్లా కొసిగి, శ్రీకాకుళం జిల్లా మిళియాపుట్టు, సత్యసాయి జిల్లా తాడిమర్రి, సబ్బవరం, వీరఘట్టంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని చెప్పారు.
ఇక అనంతపురం జిల్లా గుంతకల్లు, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం, తిరుపతి, నెల్లూరులో 40 డిగ్రీల ఉష్ణోగ్రతతో నమోదు కాగా.. చిత్తూరు, కృష్ణా జిల్లా మచిలీపట్నం, పల్నాడు జిల్లా నరసరావుపేట, ఏలూరు తదితర ప్రాంతాల్లో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడంతో ప్రజలకు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. భారీ ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ISRO Recruitment: ఐటీఐ, బీటెక్ అర్హతతో ఇస్రోలో ఉద్యోగాలు.. స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం.. ఇంకెందుకు ఆలస్యం
ఇది కూడా చదవండి: NABARD Jobs: కొడితే ఈ జాబ్ కొట్టాలి భయ్యా.. రూ.70లక్షల జీతం.. దరఖాస్తుకు మాత్రం ఇంకా..?