BigTV English

Weather News: జాగ్రత్త..! ఆ నాలుగు జిల్లాలకు వర్షాలే వర్షాలు..

Weather News: జాగ్రత్త..! ఆ నాలుగు జిల్లాలకు వర్షాలే వర్షాలు..

Weather News: రాబోయే మూడు రోజుల పాటు హైదరాబాద్ మహా నగరంలో వర్షాలు కురుసే అవకాశం ఉందని భారత వాతావరణ భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపటి నుంచి మూడు రోజులు భాగ్య నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.  మధ్యాహ్నం, సాయంత్రం వేళ్లలో హైదరాబాద్ మహానగరం మేఘావృతమై ఉంటుందని వివరించింది. గత కొన్ని రోజులు భారీ ఉష్ణోగ్రతల కారణంగా భాగ్యనగర వాసులు తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు. ఇక రాబోయే మూడు వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు.


ఈ నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..

ఉత్తర తెలంగాణలో రేపు, ఎల్లుండి రెండు రోజులు వడగాలుల వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు పడుతాయని వివరించింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఏప్రిల్ 26 వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.


తెలంగాణ వెదర్ మ్యాన్ టీ. బాలాజీ ఏమన్నారంటే..?

వాతావరణ నిపుణులు టి. బాలాజీ ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు వీచే అవకాశం ఉందని  చెప్పారు. ఉత్తర తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదు కావచ్చని కూడా ఆయన అంచనా వేశారు. హైదరాబాద్ మహా నగరంలో 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని ఆయన తెలిపారు.

Also Read: AP Tenth Results: పదో తరగతి ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600/600 సాధించింది.. రియల్లీ ఆమె గ్రేట్

హైదరబాద్ కు ఎల్లో అలెర్ట్..

భారత వాతావరణ శాఖ హైదరబాద్ మహానగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో హైదరాబాద్ కు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ అధికారులు ఏప్రిల్ 26 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వాతావరణ వాఖ అంచనాల ప్రకారం.. రాష్ట్రంలో పలు చోట్ల ఏప్రిల్ 25 వరకు 41 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయే అవకాశం ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 26న అవి కాస్త తగ్గి 36 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదుు అయ్యే ఛాన్స్ ఉందని అధికారులు పేర్కొన్నారు.

నిర్మల్‌లో భారీ ఉష్ణోగ్రత నమోదు..

నిన్న మారేడ్ పల్లిలో అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యిందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యిందని తెలిపారు.  అయితే రాబోయే మూడు రోజులు హైదరాబాద్ మహా నగరంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. గత కొన్ని రోజులు భారీ ఉష్ణోగ్రతల కారణంగా భాగ్యనగర వాసులు తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు. ఇక రాబోయే మూడు వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు.

Also Read: NTPC Recruitment: డిగ్రీ అర్మతతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు, ఇంకా 2 రోజులే ఛాన్స్ భయ్యా, జీతం రూ.71,000

 

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×