Rain alert: రాబోయే రెండు రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మొత్తం 13 రాష్ట్రాలకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, కేరళ, త్రిపుర, వెస్ట్ బెంగాల్, సిక్కం, తమిళనాడు, పుదుచ్ఛేరి, తెలంగాణ, బీహర్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఈ క్రమంలోనే.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ అధికారులు కీలక సూచనలు ఇచ్చారు. రేపు, ఎల్లుండి (శని, ఆది) భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి త్వరగానే వస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకినట్లు పేర్కొంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా అకాల వర్షాలు కురుస్తుండగా.. రేపు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు..
అటు అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, శ్రీకాకుళం, గుంటూరు, కర్నూల్, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నిన్న రాత్రి నుంచి విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నగరంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నిన్న రాత్రి పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. కోనసీమ జిల్లా అమలాపురం, ఏలూరు జిల్లా నిడమర్రులో 54, కాకినాడ జిల్లా కాజులూరులో 42, అనకాపల్లి జిల్లా పాతవలసలో 41, కాకినాడ జిల్లా కరపలో 32.2, పిఠాపురంలో 31.7, అల్లూరి జిల్లా దళపతిగూడలో 31.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
కాగా.. వాయువ్య భారతం నుంచి వీచే పొడిగాలులతో కోస్తాలో పలుచోట్ల వడగాడ్పులు వీయడంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదైనట్టు అధికారులు వివరించారు. నిన్న బాపట్ల జిల్లా ఇంకొల్లులో 42.6, పల్నాడు జిల్లా వినుకొండ, నెల్లూరు జిల్లా దగదర్తిలో 42.5 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా ముచ్చినపల్లిలో 41.9 డిగ్రీలు, ప్రకాశం జిల్లా వేమవరంలో 41.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Also Read: AP Court Jobs: 1620 కోర్టు ఉద్యోగాలకు అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది.. దరఖాస్తు చేసుకున్నారా మిత్రమా?
ఇక తెలంగాణ రాష్ట్రంలో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఆదివారం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడతాయని.. గాలి వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల ఉండొచ్చని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లొదని హెచ్చరించింది.
Also Read: UNION BANK: యూనియన్ బ్యాంక్ నుంచి భారీ నోటిఫికేషన్.. ఈ జాబ్ వస్తే రూ.85,920 జీతం..