BigTV English

China Weapons: భారత్-పాక్ యుద్ధంలో చైనా ఆయుధ కంపెనీలు బలి

China Weapons: భారత్-పాక్ యుద్ధంలో చైనా ఆయుధ కంపెనీలు బలి

భారత్-పాక్ యుద్ధం ఆగిపోవడంతో చైనాలో ఆయుధ కంపెనీల షేర్లు పడిపోయాయి. యుద్ధం కొనసాగి ఉంటే ఆయా కంపెనీల షేర్లకు ఇంకా డిమాండ్ ఉండేది. మరోవైపు చైనా ఆయుధాలన్నీ తుస్సుమనడం కూడా సంచలనంగా మారింది. చైనా నుంచి ఆయుధాల అగ్రిమెంట్లు చేసుకున్న దేశాలన్నీ ఇప్పుడు ఆలోచన మొదలు పెట్టాయి. పాకిస్తాన్ లాగే తాము కూడా నాసిరకం ఆయుధాలు కొని మోసపోవాలా అంటూ చైనా కంపెనీలను ప్రశ్నిస్తున్నాయి


ఆయుధ కంపెనీల షేర్లకు డిమాండ్
భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత పాకిస్తాన్ పండగ చేసుకుంది. ముఖ్యంగా ఆ దేశంలోని ఆయుధాల కంపెనీలకు అనూహ్యంగా లాభాలు మొదలయ్యాయి. పాక్ ఉపయోగించే ఆయుధాల్లో చాలా వరకు చైనా నుంచి దిగుమతి చేసుకున్నవే కావడం విశేషం. ఇందులో PL-15 మిసైల్ ముఖ్యమైనది. HQ-9, HQ-16.. అనే రెండు రక్షణ వ్యవస్థలు కూడా ఉన్నాయి. వీటిని తయారు చేస్తున్న చైనా కంపెనీల షేర్లు అమాంతం పెరిగాయి. దీంతో ఆయా కంపెనీలు పండగ చేసుకున్నాయి. వాటి షేర్లు ఒక్కసారిగా పెరిగాయి. చాలామంది మదుపర్లు ఆయుధాల కంపెనీల షేర్లు కొనడానికి ఆసక్తి చూపించారు. యుద్ధం మొదలయ్యాక చైనా షేర్ మార్కెట్ కి కూడా కళ వచ్చింది.

పడిపోయిన షేర్లు..
అయితే యుద్ధం ఆగిపోయిందనే వార్తలతో ఒక్కసారిగా చైనా మార్కెట్ లో కుదుపు మొదలైంది. ముఖ్యంగా చైనా ఆయుధ కంపెనీల షేర్ల రేట్లు తగ్గాయి. యుద్ధం మొదలైన తర్వాత కృత్రిమ పెరుగుదల కనపడగా.. అది ఆగిపోయాక అలా పెరిగిన రేట్లు తగ్గాయి. అయితే ఆ తగ్గుదల అక్కడితో ఆగలేదు. మరింత కిందకు పడిపోయింది. దీనికి మరో కారణం ఉంది. ఆ కారణం మరింత ఆసక్తికరం.


తుస్.. తుస్..
ఇక చైనా ఆయుధాల కంపెనీలకు యుద్ధం వల్ల పెద్ద కష్టం వచ్చింది. యుద్ధం ఆగిపోవడం వల్ల కృత్రిమ పెరుగుదల తగ్గగా.. ఆ తర్వాత అసలు విషయం వైరల్ గా మారింది. యుద్ధంలో భారత్ దే పైచేయి అనే విషయం ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. యుద్ధంలో భారత్ ప్రయోగించిన మిసైల్స్ విధ్వంసం సృష్టించాయి. పాకిస్తాన్ ప్రయోగించిన చైనా తయారీ PL-15 మిసైల్స్ తుస్సుమన్నాయి. అంటే వీటిని నమ్ముకోవడం కష్టం అని పాకిస్తాన్ కి బాగా తెలిసొచ్చింది. అంతే కాదు ఆ మిసైల్స్ కోసం ఆర్డర్ పెట్టిన మిగతా దేశాలు కూడా మాకొద్దంటూ ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నాయట. దీంతో చైనాలో సదరు మిసైల్స్ తయారీ సంస్థలకు నష్టాలు మొదలయ్యాయి. రక్షణ వ్యవస్థలు కూడా చైనానుంచే దిగుమతి చేసుకున్న పాకిస్తాన్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాసిరకం చైనా ఆయుధాలను పాక్ కూడా రిజెక్ట్ చేస్తోంది. ఇలా బారత్-పాక్ యుద్ధం కారణంగా చైనా పరువు పోయింది.

చైనా వస్తువులంటే మార్కెట్లో చీప్ అనే పేరుంది. ఇప్పుడు చైనా ఆయుధాలు కూడా అంతే చీప్ అనే పేరు ఫిక్స్ అయింది. మరి చైనా తన సొంతానికి కూడా ఇలాంటి ఆయుధాలనే తయారు చేసుకుంటుందా..? కేవలం ఇతర దేశాలకు మాత్రమే ఇంత చీప్ ఆయుధాలను ఎగుమతి చేస్తుందా..? అసలు చైనా వ్యూహం ఏంటి అనేది తేలాల్సి ఉంది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×