Weather Updates of Telangana: ఓ వైపు ఎండలు, మరోవైపు వర్షాలు. గత కొద్ది రోజుల నుంచి ఈ భిన్న వాతావరణ పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడుతున్నాయి. తాజాగా కూడా రాష్ట్రంలో ఇదే వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇంకొన్ని చోట్లా మోస్తరు వర్షాలు పడ్డాయి. రాష్ట్రంలో ఎక్కడెక్కడా వర్షాలు కురిశాయి..? ఎక్కడెక్కడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అనేవాటిపై వివరాలను వెల్లడిస్తూ ఓ చల్లని కబురు కూడా చెప్పింది వాతావరణ శాఖ. నేటి నుంచి వచ్చే నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం కురిసింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో కురిసింది. మరికొన్నిచోట్లా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో 6.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అదేవిధంగా మెదక్ జిల్లాలోని శంకరంపేటలో 4.7 సెం.మీ. వర్షపాతం, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ లో 3.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్లలో 3.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వికారాబాద్, భద్రాద్రి, సంగారెడ్డి, వనపర్తి, కామారెడ్డి జిల్లాల్లో కూడా వర్షం కురిసింది.
మరోవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా జకోరాలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
అయితే, వాతావరణ శాఖ తాజాగా మరో సూచన చేసింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈ నెల 15 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఇంకొన్ని చోట్లా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: కేసీఆర్ ధన దాహానికి పాలమూరు బలైంది: సీఎం రేవంత్
ఇదిలా ఉంచితే.. వర్షాలతో కొంత ఉప శమనం కలుగుతుందని భావించిన ప్రజలకు వెనువెంటనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఓ వైపుపు ఎండలు దంచికొడుతున్నాయి.. మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి.. వాతావరణం భిన్నంగా ఉందంటూ ఆశ్చర్యపోతున్నారు. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వడగండ్ల వానల కారణంగా రాష్ట్రంలో వేర్వేరు ఘటనల్లో పలువురు మృత్యువాతపడ్డారు. అదేవిధంగా రైతులు తీవ్రంగా పంట నష్టపోయారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు.