
BRS party today news(Latest news in telangana):
బీఆర్ఎస్ లిస్ట్ రాకముందు అందరి అటెన్షన్ డ్రా చేసింది స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గమే. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు టికెట్ వస్తుందా రాదా? అనే ఆసక్తి కనబరిచారు. అనుకున్నట్టే ఆయన సీటు హుష్‌కాకి. అందుకు, మెయిన్ రీజన్ సర్పంచ్ నవ్యనే.
నవ్యను గిల్లడం.. ఆమె కేసు పెట్టడం.. మీడియా ముందు రచ్చ చేయడంతో ఎమ్మెల్యే రాజయ్య బాగా బద్నామ్ అయ్యారు. హైకమాండ్ ఆదేశాలతో సారీ కూడా చెప్పారు. ఆ తర్వాత కేసు విత్‌డ్రా చేసుకోవాలంటూ ఆమెను మరోసారి వేధించారు. ఇలా ఎన్నికల వేళ సర్పంచ్ నవ్యతో వ్యవహారం.. రాజయ్యకు ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా టికెటే ఎగరగొట్టింది. చేసేది లేక.. వెక్కివెక్కి ఏడ్చారు. ఇప్పుడు ఇతర పార్టీల వైపు పక్క చూపులు చూస్తున్నారని అంటున్నారు.
కట్ చేస్తే.. సర్పంచ్ నవ్య ఫుల్ ఖుషీ. తనకు స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్ఎస్ టికెట్ వచ్చినందుకు కడియం శ్రీహరి అయినా అంత హ్యాపీగా ఉన్నారో లేదో కానీ.. నవ్య మాత్రం ఆ రోజు నుంచి హల్‌చల్ చేస్తున్నారు. తనవల్లే రాజయ్య టికెట్ ఫసక్ అయిందంటూ పండుగ చేసుకుంటున్నారట.
అక్కడితో ఆగిపోలేదు ఆమె. లేటెస్ట్‌గా కడియం శ్రీహరికి కాదు ఘన్‌పూర్ టికెట్ తనకే ఇవ్వాలంటూ ముందుకొచ్చారు. 7 దశాబ్ధాలుగా స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి ఒక్కసారి కూడా మహిళకు అవకాశం రాలేదని.. ఈసారి తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు ఆర్జీ పెట్టుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయంటున్నారు.
ఎమ్మెల్యే సీటునే ఎగరగొట్టిన అనుభవంతో.. బీఆర్ఎస్ టికెట్ కొల్లగొట్టే పనిలో ఉన్నారు నవ్య. తప్పేముంది.. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా ఎదిగితే తప్పేముంది? అంటున్నారు.