E-Paper
Advertisement

హైదరాబాద్‌కి పోటీగా వరంగల్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు!

హైదరాబాద్‌కి పోటీగా వరంగల్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు!
Advertisement

Greater Warangal: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ సమగ్ర రూపురేఖలు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ తరహాలోనే వరంగల్‌ను కూడా మోడల్ సిటీగా, కాస్మోపాలిటన్ నగరంగా అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం వరంగల్ నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులకు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో నాణ్యత ముఖ్యం..

Advertisement

నగరంలో భారీ నిధులతో చేపట్టే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను అత్యంత పకడ్బందీగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రజల సొమ్ము వృథా కాకుండా, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగవంతం చేయాలన్నారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల నివారణకు వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు.

ఉత్తర తెలంగాణ కనెక్టివిటీ – రోడ్ల విస్తరణ..

Advertisement

ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలను కలుపుతూ అద్భుతమైన రోడ్డు అనుసంధానత ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అంతేకాకుండా, వరంగల్ (మామునూరు) ఎయిర్‌పోర్ట్ ప్రారంభమయ్యే సమయానికే దానికి అనుసంధానంగా ఉన్న అన్ని ప్రధాన రహదారుల అభివృద్ధి, విస్తరణ పనులు పూర్తవ్వాలని స్పష్టం చేశారు.

టెంపుల్, ఫారెస్ట్ టూరిజంపై ప్రత్యేక దృష్టి..

విమానాశ్రయం అందుబాటులోకి వచ్చాక వరంగల్‌కు వచ్చే పర్యాటకులు, భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయాల అభివృద్ధిపై శ్రద్ధ వహించాలన్నారు. టెంపుల్ టూరిజంతో పాటు అటవీ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని, భక్తులకు సరైన సౌకర్యాలు అందేలా ఆలయ కమిటీల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

ఆధునిక బస్ టెర్మినల్ ఏర్పాటు..

రాబోయే తరాల ప్రయాణ అవసరాలకు తగినట్లుగా అన్ని సౌకర్యాలతో కూడిన ఒక భారీ, ఆధునిక బస్ టెర్మినల్ నిర్మాణానికి తక్షణమే ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ‘వరంగల్ నగరానికి ఉన్న చారిత్రక, భౌగోళిక ప్రాధాన్యత దృష్ట్యా దానిని కాస్మోపాలిటన్ సిటీగా మార్చేందుకు అధికారులందరూ దూరదృష్టితో, బాధ్యతాయుతంగా పనిచేయాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగించారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read: ఖైరతాబాద్ గణేష్ భక్తులకు బిగ్ అలర్ట్.. 23వ తేదీ రాత్రి వరకే దర్శనాలు!

Tags

Related News

హైదరాబాద్‌కు బ్లూమ్‌బెర్గ్ ప్రశంసలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

ఖైరతాబాద్ గణేష్ భక్తులకు బిగ్ అలర్ట్.. 23వ తేదీ రాత్రి వరకే దర్శనాలు!

అర్ధరాత్రి పిల్లల వార్డులో పేలిన ఏసీ.. ఆదిలాబాద్ రిమ్స్ లో ఘోర అగ్నిప్రమాదం, రంగంలోకి అధికారులు

కాంగ్రెస్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. 22A భూములపై మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ!

తెలంగాణ పోటీపరీక్షల్లో సిలబస్ మార్పులు.. క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ!

హైడ్రా ప్రజావాణికి 47 ఫిర్యాదులు.. 80 గజాల్లో 7 అంతస్తుల భవనం కలకలం!

జూరాల రైతుల అరెస్టులపై హరీష్ రావు ఫైర్.. ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్!

Big Stories

Advertisement
×