BigTV English

Congress: దారికొచ్చిన కోమటిరెడ్డి!.. ఓర్పుతో నెగ్గుకొచ్చిన రేవంత్‌రెడ్డి!!

Congress: దారికొచ్చిన కోమటిరెడ్డి!.. ఓర్పుతో నెగ్గుకొచ్చిన రేవంత్‌రెడ్డి!!
CONGRESS

Congress: జూన్ 21. రేవంత్‌రెడ్డికి కీలకమైన రోజు. ఉదయాన్నే ఎంపీ కోమటిరెడ్డి ఇంటికెళ్లారు. ఆయన్ను తీసుకొని.. మధ్యాహ్నానికి జూపల్లి ఇంట్లో లంచ్ మీటింగ్ జరిపారు. సాయంత్రానికి పొంగులేటి నివాసంలో ‘చాయ్ పే చర్చ’ నిర్వహించారు. ఇలా అనేక ఆసక్తికర సమావేశాలతో బిజీబిజీగా గడిచింది రేవంత్‌కు.


కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. చాలాకాలంగా కాంగ్రెస్‌ కంటిలో నలుసుగా ఉండేవారు. తనకు పీసీసీ పీఠం దక్కలేదనే అక్కస్సుతో రగిలిపోయేవారు. రేవంత్‌రెడ్డికి చాన్నాళ్లూ దూరంగా ఉంటూ వచ్చారు. తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి పార్టీ వీడినా ఆపలేకపోయారు. ఢిల్లీలో మోడీ, అమిత్‌షా, నడ్డాలను కలుస్తూ కలకలం రేపారు. మునుగోడులో కాంగ్రెస్‌ను ఓడించే ప్రయత్నం చేయడం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలుస్తాయంటూ కాంట్రవర్సీ స్టేట్‌మెంట్లు.. షోకాజ్ నోటీసులు.. అబ్బో చాలా రచ్చే జరిగింది కోమటిరెడ్డి చుట్టూ. అధిష్టానంతో ఆయనకున్న చనువే కాపాడుతూ వస్తోంది.

కట్ చేస్తే.. తానెంత గింజుకున్నా.. ఇక చేసేది ఏమీ లేదని తెలుసుకున్నారు. తమ్ముడి దారిలోనే బీజేపీలోకి వెళ్దామని అనుకున్నా.. మునుగోడు ఓటమితో మనసు మార్చుకున్నాడు. ఇక కాంగ్రెస్సే దిక్కని గట్టిగా ఫిక్స్ అయ్యారు. మరి, పార్టీలో ఉండాలంటే.. తనకిష్టం వచ్చినట్టు చేస్తే చెల్లదనే తత్వం ఆలస్యంగా బోధపడింది. ఎట్టకేళకు రేవంత్‌రెడ్డి నాయకత్వానికి జై కొట్టేశారు వెంకట్‌రెడ్డి. రేవంత్‌తో కలిసి పనిచేస్తానని ఇప్పుడు బహిరంగంగానే చెబుతున్నారు. రేవంత్ తాను సోదరులుగా ఉంటామని బంధం బలోపేతం చేసుకుంటున్నారు.


అటు.. కోమటిరెడ్డి విషయంలో రేవంత్‌రెడ్డి ఓర్పును అభినందించాల్సిందే. తనను ఎంతగా గిల్లుతున్నా.. సీనియర్ లీడర్‌గా ఆయన స్థాయిని ఎక్కడా తగ్గించినట్టు మాట్లాడలేదు పీసీసీ చీఫ్. మనం మనం కాంగ్రెస్ వాదులమే అన్నట్టు వ్యవహరించారు. ఓసారి కోమటిరెడ్డి ఇంటికెళ్లి కలిసొచ్చారు. గాంధీభవన్‌లో చర్చలు జరిపారు. కేవలం కోమటిరెడ్డి అనే కాదు.. మిగతా సీనియర్స్ అందరితోనూ అంతే సహనంగా ఉంటూ వచ్చారు పీసీసీ చీఫ్. ఇటీవల నల్గొండలో కాంగ్రెస్ నిరుద్యోగ సభ నిర్వహిస్తే.. తన ప్రసంగంలో సగం సమయం.. నల్గొండ లీడర్లను పొగిడేందుకే కేటాయించారు రేవంత్‌రెడ్డి. పెద్దలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిల గురించి గొప్పగా చెప్పారు. తాను తగ్గి.. సీనియర్ల విషయంలో నెగ్గారని అంటున్నారు.

అయితే, ఉత్తమ్, జగ్గారెడ్డి లాంటి వాళ్లు ఇంకా గ్యాప్ మెయిన్‌టెన్ చేస్తున్నా.. కోమటిరెడ్డి మాత్రం కలిసిపోయారు. పలుమార్లు హైకమాండ్‌ను కలవడం.. అటు నుంచి సైతం రేవంతే ఫైనల్ అనేలా సిగ్నల్ రావడంతో వెంకట్‌రెడ్డి కాస్త వెనక్కి తగ్గారు. పీసీసీ చీఫే తనకు అంతగా ప్రాధాన్యం ఇస్తుంటే.. ఇంకా బెట్టు చేయడం సరికాదని భావించారేమో. రేవంత్‌తో చేతిలో చెయ్యేశారు. లేటెస్ట్‌గా జరిగిన జూపల్లి, పొంగులేటిల భేటీలో.. కలిసి చర్చలు జరిపారు. అలా కాంగ్రెస్ ‘బలగం’ను నేర్పుగా ప్రదర్శించారు రేవంత్‌రెడ్డి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×