E-Paper
Advertisement

గాంధీ పరివార్ కోసం నా ప్రాణాలైనా ఇస్తా: సీఎం రేవంత్!

గాంధీ పరివార్ కోసం నా ప్రాణాలైనా ఇస్తా: సీఎం రేవంత్!
Advertisement

Revanth Reddy:

కేరళంలోని నిలంబూరులో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ప్రతిష్ఠాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్ 2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఈ అవార్డును ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపి కే.సీ. వేణుగోపాల్ ప్ర‌దానం చేసారు. కేరళ దిగ్గజ కాంగ్రెస్ నేత, దివంగత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవార్డు ప్రదానం చేశారు. రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గాను అవార్డుకు సీఎం రేవంత్ రెడ్డి ఎంపికయ్యారు.

సీఎం రేవంత్ రెడ్డి

Advertisement

ఆర్యదాన్ ముహమ్మద్ 2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డ్స్‌కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గోన్నారు. ప్రస్తుతం దేశంలో రెండు పరివార్‌ల మధ్య పోరాటం జరుగుతోందని అన్నారు. ఒకటి సంఘ్ పరివార్, రెండోది గాంధీ పరివార్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

గాంధీ పరివార్..

సంఘ్ పరివార్ దేశాన్ని మతం, భాష, సంస్కృతి, కులం ఇలా అన్ని విధాలుగా విడగొడుతోందని అన్నారు. కానీ గాంధీ పరివార్ దేశం కోసం అన్నీ ఇచ్చిందన్నారు. మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి, రాష్ట్రపతి లాంటి పదవులను త్యాగం చేశారని అన్నారు.

సంఘ్ పరివార్..

Advertisement

సంఘ్ పరివార్‌ను ఓడించడానికి దేశం అంతా గాంధీ పరివార్‌కు అండగా ఉండాలని కోరుతున్నామన్నారు. సంఘ్ పరివార్ దేశానికి, ప్రజాస్వామ్యానికి అతి పెద్ద ప్రమాదకారన్నారు. దేశాన్ని సంఘ్ పరివార్ నుంచి రక్షించడానికి గాంధీ పరివార్ కోసం నా ప్రాణం కూడా త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని, సంఘ్ పరివార్‌ను ఓడించి ఈ యుద్ధంలో ముందున్నామని ఇందుకోసం కేరళ రాష్ట్రం ఇప్పటికే సంకేతాలు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also read: పోలీస్ స్టేషన్‌లో దారుణం.. ఆ ఓక్క కారణంతో రాళ్లతో కొట్టుకున్న రెండు వర్గాలు!

Tags

Related News

జాతీయస్థాయిలో జోగులాంబ గద్వాల జిల్లాలో ఖ్యాతి.. ఎందుకో తెలుసా..?

పోలీస్ స్టేషన్‌లో దారుణం.. ఆ ఓక్క కారణంతో రాళ్లతో కొట్టుకున్న రెండు వర్గాలు!

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ నోటీసుల కలకలం

సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై ఎంపీ చామల కుమార్ రెడ్డి ఫైర్..!

చలానాల రాబడిపై సర్కార్ కొత్త ప్లాన్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!

ఏపీలో భారీ వర్షాలకు అన్నదాత కుదేలు.. ఈ ప్రాంతాల్లో విపరీతంగా పంటనష్టం?

గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణపతి.. తరలివచ్చిన భక్తజనం.. వైభవంగా నిమజ్జనం!

Big Stories

Advertisement
×