E-Paper
Advertisement

అంబరాన్నంటిన భాగ్యనగర్ నిమజ్జనోత్సవం.. క్యూలో వేలాది విగ్రహాలు!

అంబరాన్నంటిన భాగ్యనగర్ నిమజ్జనోత్సవం.. క్యూలో వేలాది విగ్రహాలు!
Advertisement

Ganesh Immersion: స్వేచ్చ బ్యూరో: పదకొండు రోజుల పాటు భక్తుల నుంచి ఘనంగా న పూజలందుకున్న గణనాధుడికి మహానగరవాసులు శుక్రవారం అత్యంత భక్తి  శ్రద్ధలతో, ఆటాపాటా, నాట్యవిన్యాసాలతో ఘనంగా వీడ్కోలు పలికారు. శుక్రవారం నగరంలో గణేష్ నిమజ్జనం ప్రక్రియ ప్రశాతంగా జరిగింది. రెండో రోజైన నేడు శనివారం కూడా నిమజ్జనం కొనసాగే అవకాశాలున్నాయి. గణపతి బొప్పా మోరియా..జై భోలో గణేష్ మహారాజ్ కీ జై…జై..జై.గణేశా…బై బై గణేశా.. వెళ్లిరాయ్యా..మళ్లీ రావయ్య అంటూ భక్తులు చేసిన నినాదాలతో భాగ్యనగరం పులకించింది. గ్రేటర్ లోని మూడు పోలీసు కమిష్నరేట్లు, కోర్ అర్బన్ రీజియన్ పరిదిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్ల పరిధిలో నిమజ్జనం జరుగుతుండటంతో క్యూర్ సిటీ మొత్తం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. బ్యాండే మేళాలు, గల్లీగల్లీలో తీన్మార్ స్టెప్పులు, విచిత్ర వేషధారణలతో, ఆటలు, పాటలతో నిమజ్జనోత్సవాన్ని ఘనంగా, ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు.

సాగర తీరం జన సంద్రం..

గణనాధుడిని ఎంతో భక్తిశ్రద్ధలతో గంగమ్మ ఒడిలోకి చేర్చుతున్నారు. గణేశ్ నిమజ్జన సంబరాలు మహానగరంలో శుక్రవారం అంబరాన్నంటాయి. నగరవాసులు ఈ సారి మరింత రెట్టింపు ఉత్సాహాంతో నిమజ్జనానికి రికార్డు స్థాయిలో జనం తరలి వచ్చారు. దీంతో సాగర తీరం జన సంద్రంగా మారింది. మహానగరంలోని గల్లీ గల్లీలు, వాడల్లో ఆధ్యాత్మి వాతావరణం వెల్లివిరిసింది. మహానగరంలో ఎటు చూసినా ఆది దేవుడ్ని స్మరించే నినాదాలే. ముఖ్యంగా నగరంలో ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్, బాలాపూర్ భారీ గణపయ్యలను వీలైనంత త్వరగా నిమజ్జనం చేయాలన్న పోలీసుల వ్యూహాం కాస్త ఆలస్యమైన మొత్తానికి ఫలించింది. ఉదయం ఆరున్నర గంటలకు ఖైరతాబాద్ గణపయ్య నిమజ్జనం కోసం సాగర్ వైపు తరలగా, బాలాపూర్ గణనాధుడు కాస్త ఆలస్యంగా బయల్దేరినా, మధ్యాహ్నాం మూడు గంటల కల్లా పోలీసులు ఈ గణపయ్యను పాతబస్తీ దాటించారు.

ఖైరతాబాద్ గణనాధుడు..

Advertisement

శుక్రవారం చార్మినార్ వద్ద సామూహిక ప్రార్థనలు జరగనున్నందున పోలీసులు బాలాపూర్ వినాయకుడి నిమజ్జనంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ గణనాధుడు తుది పూజలందుకుని, రెండు గంటల 38 నిమిషాలకు గంగమ్మ ఒడిని చేరాడు. ఈ భారీ గణపయ్య శోభయాత్ర రెండు కిలోమీటర్ల పొడువున అయిదు గంటల పాటు సాగింది. ఈ సారి బాలాపూర్ టూ హుస్సేసాగర్ వరకు సుమారు 21 కిలోమీటర్ల పొడువున బాలాపూర్ గణేశుడ్నిమధ్యాహ్నాం ఒకటి గంటల్లోపు చార్మినార్ దాటించాలన్న పోలీసుల వ్యూహానికి ఈ సారి కాస్త అడ్డంకులేర్పడ్డాయి. ఎట్టకేలకు ఆరుగంటలకు బాలాపూర్ గణనాథుడు ట్యాంక్ బండ్ చేరుకున్నాడు. సాయంత్రం ఆరు గంటల 15 నిమిషాలకు ట్యాంక్ బండ్ క్రేన్ నెంబర్ 12 వద్ద బాలాపూర్ భారీ గణపయ్య నిమజ్జనమయ్యాడు.

మొత్తం 20 వేల మంది..

ఎలాంటి అవాంచనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులు గట్టి బందోబస్తు చేశారు. పాతబస్తీలోని 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే గుర్తించిన సమస్యాత్మకమైన, సున్నితమైన ప్రాంతాల్లో ముందస్తుగా ప్రత్యేక భద్రతా దళాలను మోహరించారు. మొత్తం 20 వేల మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. నిమజ్జన రూట్ తో పాటు పలు చారిత్రక ప్రార్థన మందిరాల వద్ద అడుగడుగున నిఘా ఏర్పాటు చేసి, ఎప్పటికపుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. సాధారణంగా ఉదయం నుంచి మంద కోడిగా సాగే నిమజ్జనం ఈ సారి ఉదయం నుంచే ఊపందుకుంది. పైగా సాగర్ చుట్టూ ఏర్పాటు చేసిన క్రేన్ల వద్ద ఈ సారి నిమజ్జనం కోసం వచ్చిన విగ్రహాల సంఖ్య భారీగా పెరిగింది. పోలీసులు అంచనా వేసిన విగ్రహాల సంఖ్యలో సాయంత్రం ఆరున్నర గంటల కల్లా కేవలం 40 శాతం విగ్రహాలు మాత్రమే నిమజ్జనమైనట్లు తెలిసింది.

Advertisement

Also read: ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ నోటీసుల కలకలం

మూడు కంట్రోల్ రూమ్ ల నుంచి పర్యవేక్షణ

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు పోలీసు కమిష్నరేట్ లలో జరిగిన గణేష్ నిమజ్జనాన్ని పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికపుడు మూడు కంట్రోల్ రూమ్ ల నుంచి పర్యవేక్షించారు. బంజారాహిల్స్ లోని ఇంటిగ్రెటెడ్ పోలీసు కమాండ్ కంట్రోల్, జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ తో పాటు డీజీపీ ఆఫీసులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ నియంత్రం, మండపాల తరలింపునకు సంబంధించి సూచనలు జారీ చేశారు. డీజీపీ సీవీ ఆనంద్ నేరుగా క్షేత్ర స్థాయి పరిస్థితులను ఎప్పటికపుడు పర్యవేక్షించారు. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సైతం సీసీ నిఘా నేత్రాల ఫుటేజీని పరిశీలిస్తూ నిమజ్జనం ప్రశాంతంగా వేగంగా జరిగేందుకు వీలుగా సూచనలు జారీ చేశారు.

డీజీపీ సీవీ ఆనంద్..

నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ నిమజ్జనం జరుగుతున్న తీరును నేరుగా పర్యవేక్షించారు. జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా సుమారు గంట సేపు ఏరియల్ సర్వే నిర్వహించారు. మండప నిర్వాహకులు వీలైనంత త్వరగా నిమజ్జనాన్ని ముగించేందుకు పోలీసులకు సహకరించాలని జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ సారి నిమజ్జనోత్సవాన్ని తిలకించేందుకు ఎక్కువ సంఖ్యలో జనం వచ్చారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత చార్మినార్, లాల్ దర్వాజ, ఫలక్ నుమా ప్రాంతాల్లో సుమారు కిలోమీటరు పొడువున వరుసగా గణేష్ మండపాలు క్యూ కట్టాయి.

రెండో రోజు కొనసాగనున్న నిమజ్జనం

గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో అంతిమ ఘట్టమైన నిమజ్జనం రెండో రోజైన శనివారం కూడా కొనసాగే అవకాశముంది. ముఖ్యంగా పాతబస్తీ నుంచి గణేశ్ మండపాలు కాస్త ఆలస్యంగా నిమజ్జనం వైపు కదలటంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలిసింది. ముఖ్యంగా పాతబస్తీతో పాటు న్యూ సిటీలోని చాలా ప్రాంతాల నుంచి వినాయక మండపాలు నిమజ్జనం కోసం సాయంత్రం ఐదు గంటల తర్వాత కదలటంతో నిమజ్జనం శనివారం సాయంత్రం కొనసాగే అవకాశమున్నట్లు అధికారులు భావిస్తున్నారు. గత సంవత్సరం కూడా సాగర్ చుట్టూ మండపాలు క్యూ కట్టడంతో పోలీసులు కూడా ట్రాఫిక్ ఆంక్షల అమలును మధ్యాహ్నాం మూడు గంటల వరకు పొడిగించిన సంగతి తెల్సిందే. కానీ ఈ సారి మూడో రోజైన ఆదివారం ఉదయం వరకు నిమజ్జనం కొనసాగే అవకాశమున్నట్లు సమాచారం.

Also read: ప్రేమకు అడ్డుగా మారిన ఊరి గొడవలు… తమిళనాడు బ్యాక్‌డ్రాప్‌లో ఇంట్రెస్టింగ్ లవ్ డ్రామా

గణేష్ యాక్షన్ టీమ్..

ఈ విషయాన్ని ముందే గుర్తించిన జీహెచ్ఎంసీ నిమజ్జనం పాయింట్ల వద్ద, శోభ యాత్ర జరిగే నిమజ్జనం రూట్ లో ఒక్కో షిఫ్టులో ఎనిమిది గంటల పాటు గణేష్ యాక్షన్ టీమ్ విధులు నిర్వర్తించేలా ఏర్పాట్లు చేసింది. పైగా ఈ సారి లిబర్టీ చౌరస్తా నుంచి హైదరాబాద్ నర్సింగ్ హోమ్ మీదుగా నెక్సా షోరూమ్ వైపు మండపాలను అనుమతించలేదు. దీంతో గత సంవత్సరం ఈ రూట్ లో వెళ్లిన భారీ గణేష్ విగ్రహాల మండపాలు అంబేద్కర్ విగ్రహాం ముందు నుంచి బేఆర్కే భవన్ పక్క నుంచి ఇక్బాల్ మినార్ వరకు వెళ్లి, అక్కడి నుంచి యూ టర్న్ తీసుకుని ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ వైపు వెళ్లాల్సి ఉన్నందున, గత సంవత్సరం కన్నా ఈ సారి నిమిజ్జనానికి ఎక్కువ సమయం పట్టే అవకాశముంది.

ఆలస్యంగా కదిలిన పాతబస్తీ మండపాలు

పాతబస్తీలోని పలు ప్రాంతాల నుంచి వినాయక మండపాలు నిమజ్జనానికి ఆలస్యంగా కదిలాయి. దీంతో నిమజ్జనం మరుసటి రోజైన శని, ఆదివారాల్లో కూడా కొనసాగే అవకశాల్లేకపోలేవు. పైగా ఈ సారి నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు లక్ష విగ్రహాలను ప్రతిష్టించినట్లు, ఇందులో హుస్సేన్ సాగర్ లో దాదాపు 40 వేల విగ్రహాలు నిమజ్జనం చేయనున్నట్లు సర్కారు అంచనా వేయగా, శుక్రవారం రాత్రి వరకు క్యూలో ఉన్న విగ్రహాలను ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్ బండ్ పై నిమజ్జనం చేసేందుకు శనివారం సాయంత్రం వరకు సమయం పట్టే అవకాశమున్నట్లు సమాచారం.

హుస్సేన్ సాగర్ చుట్టూ..

ప్రతి మండపం వద్ద చివరి రోజు పూజా, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఆలస్యంగా కదిలిన మండపాల్లోని వినాయకులు శోభాయాత్ర రూట్ లో క్యూ కట్టాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ ఏర్పాటు చేసిన క్రేన్లలో ఒక్కో క్రేన్ గంటకు గరిష్టంగా ఆరు విగ్రహాలు, కనిష్టంగా మూడు విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నందున సాగర్ చుట్టూ, శోభయాత్ర జరిగిన బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ రూట్ లో విగ్రహాలు క్యూ కట్టాయి. సాయంత్రం అయిదు గంటల తర్వాత పాతబస్తీలోని బడా విగ్రహాలు నిమజ్జనం వైపు పయనమైనట్లు తెలిసింది.

Also read: కేబుల్‌తో ఛార్జ్ చేయాలా? వైర్‌లెస్‌గా చేయాలా? AirPods విషయంలో ఇదిగో ఫుల్ క్లారిటీ!

Tags

Related News

ప్యారడైజ్‌ మూవీ విమర్శకులను సుతి మెత్తగా అర్సుకున్న నాని..! మీ కోసమే ఇదంతా చేశాం.. మీ విమర్శలను ఎంజాయ్‌ చేశా..!

సర్ పై కాక్రోచుల దండు దాడి..! జంతర్‌ మంతర్‌ వేదికగా ‘అంతకు మించి’ ఆందోళన..! సీఈసీ జ్ఞానేశ్వర్‌ రాజీనామా కోసం అక్టోబర్‌ నుంచి భారీ ఉద్యమానికి శ్రీకారం..

తెలంగాణ బీజేపీలో మళ్లీ సునీల్ బన్సల్.. ఈసారైనా వ్యూహం ఫలించేనా..?

తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫుల్ ఫోకస్.. త్వరలో కొత్త నియామకాలు!

మీ ఇంటిపై భారీ విద్యుత్ లైన్లు ఉన్నాయా.. అయితే మీకో గుడ్ న్యూస్!

టీపీసీసీ చీఫ్‌ సొంత జిల్లాలో గౌడ్‌ల సాంఘీక బహిష్కరణ.. వీడీసీల ఆగడాలకు చెక్‌ పడేదెలా…? దశాబ్దాలుగా ఆ రెండు నియోజకవర్గాల్లో ఇదే అరాచకం..

బైపోల్ తో ఇక అన్నీ సమకూరుతున్నట్టేగా! ఇందిరమ్మ ఇండ్లకు కొదవలేదు… అభివృద్ధి పనులకు అడ్డులేదు..!

Big Stories

Advertisement
×