E-Paper
Advertisement

పోలీస్ స్టేషన్‌లో దారుణం.. ఆ ఓక్క కారణంతో రాళ్లతో కొట్టుకున్న రెండు వర్గాలు!

పోలీస్ స్టేషన్‌లో దారుణం.. ఆ ఓక్క కారణంతో రాళ్లతో కొట్టుకున్న రెండు వర్గాలు!
Advertisement

Kothagudem: స్వేచ్ఛ బ్యూరో: గణేష్ నిమజ్జన బందోబస్తు విధుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు సిబ్బంది నిమగ్నమై ఉన్న సమయంలో, శుక్రవారం కొత్తగూడెం 3టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో కుటుంబ వివాదానికి సంబంధించి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం దూషించుకోవడంతో పాటు దాడులకు పాల్పడటమే కాకుండా, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని నెట్టివేసి వారి విధులకు ఆటంకం కలిగించిన ఘటనపై పోలీసులు చట్టపరమైన చర్యలు చేపట్టారు.కొరదల కుమార్ అతని భార్య వినోదకు సంబంధించిన కుటుంబ వివాదం నేపథ్యంలో ఇరువర్గాల వారు కొత్తగూడెం పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.

ఇటుక/రాయితో దాడి..

ఈ క్రమంలో మాటామాట పెరిగి పరస్పరం దూషించుకోవడంతో పాటు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో దున్నపోతుల రాజు అనే వ్యక్తిపై ఇటుక/రాయితో దాడి చేయడంతో ముక్కుపై రక్తగాయం అయినట్లు ఫిర్యాదు అందింది. అలాగే వెంకటమల్లు అనే మహిళను కొంతమంది వ్యక్తులు జుట్టు పట్టుకుని, చేతులతో కొట్టినట్లు మరో ఫిర్యాదు అందింది. ఇరువర్గాల మధ్య పరస్పరం బెదిరింపులు, దూషణలు జరిగినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.

ఈ ఘటనపై..

Advertisement

ఘర్షణను అదుపు చేసే క్రమంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులను సైతం ఇరువర్గాల వారు నెట్టివేసి, పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వారి విధులకు ఆటంకం కలిగించారు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి, సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి ఆటంకం కలిగించడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని తెలిపారు.

Also read: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు!

Tags

Related News

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు బిగ్ షాక్.. వచ్చే మంగళవారం కోర్టులో హాజరుకావాల్సిందే!

నాగార్జునతో కలిసి తమ్మిడికుంట చెరువును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రత్యేకతలు ఇవే!

ప్రపంచానికి దిశానిర్దేశం చేయనున్న హైదరాబాద్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

‘కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బుద్ధి చెప్పండి’.. గ్రాడ్యుయేట్లకు కవిత పిలుపు!

మేడ్చల్ కలెక్టర్ మనూ చౌదరిపై హైకోర్టు ఆగ్రహం.. సీపీకి కీలక ఆదేశాలు

తెలంగాణ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు.. 10+2 విధానంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం!

మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన కారు, దంపతుల మృతి

చనిపోయిన చోట కూడా చౌకబారు రాజకీయాలా..? హరీష్ రావుపై అద్దంకి ఆగ్రహం

Big Stories

Advertisement
×