
Congress revanth reddy news(Telangana politics) :
గ్యాస్ సిలిండర్ ధరల తగ్గింపుపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్పందించారు. ట్విట్టర్ వేదికగా కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఓ గజ దొంగ దారి దోపిడీ చేసి సర్వం దోచుకుని.. దారి ఖర్చులకు తిరిగి రూ. 200 ఇచ్చాడనట్లుగా కేంద్రం వ్యవహారం ఉందని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ హయాంలో రూ. 410 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను రూ.1200కు పెంచి.. ఇప్పుడు రూ. 200 తగ్గించడాన్ని ఇలా కాకుండా ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.
మరోవైపు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశన్నంటాయి. పెరిగిన రేట్స్ సామాన్యులకు పెనుభారంగా మారాయి. లీటర్ పెట్రోల్ ధర 110 రూ. దాటేసింది. ఇన్నాళ్లూ ధరలు పెరగడమే తప్ప.. తగ్గిన ధాఖలాలు కపిపించలేదు. ఓవైపు పెట్రో, డీజిల్ ధరలు.. మరోవైపు వంట గ్యాస్ ధరలు ఇలా సామాన్యునికి పెను భారంగా మారాయి. అయితే గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 తగ్గించిన కేంద్రం పెట్రోల్ రేట్స్ పై మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గించాలని విపక్ష పార్టీలతోపాటు సామన్యులు కోరుతున్నారు. మరి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందా? ఇంధన ధరలను కూడా తగ్గిస్తోందా?
KTR: విఫల ప్రధాని అంటూ మోదీకి కేటీఆర్ కౌంటర్లు..