Saidhapur Attack: స్వేచ్చ బ్యూరో: ఇద్దరు మూగ పిల్లలను పోషించుకుంటున్న ఒంటరి మహిళపై కొందరు వ్యక్తులు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన సైదాపూర్ మండలంలో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.
బొమ్మకల్ గ్రామానికి చెందిన బజ్జూరి తిరుమల వ్యవసాయ భూమిపై కోర్టు ఇంజంక్షన్ ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి. అయినప్పటికీ బండి రమేశ్, బండి సారయ్య, ఎలబోయిన కొమురయ్య, బండి వనమ్మలు ఉద్దేశపూర్వకంగా భూమిలోకి చొరబడ్డారు. ఉదయం ఆమె బావి వద్దకు వెళ్లగా కర్రలతో కొట్టి తీవ్ర రక్తగాయాలు చేశారు. అదే సమయంలో కౌలు రైతు అంకూస్ రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
వెళ్తూ.. “మాట వినకపోతే నిన్నూ, నీకున్న ఇద్దరు మూగ పిల్లలనూ చంపేస్తాం” అని బెదిరించినట్లు బాధితురాలు కన్నీటిపర్యంతమయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆమెను హుజూరాబాద్ ఆసుపత్రికి తరలించారు. భర్త లేని తనకు దివ్యాంగులైన పిల్లలే లోకమని, దాడికి పాల్పడిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆమె పోలీసులను వేడుకున్నారు.
Also read: వరుస హత్యలు… అంతుచిక్కని ఆధారాలు… 5 భాషల్లో రచ్చ లేపుతున్న మోస్ట్ డేంజరస్ సైకో థ్రిల్లర్