Malayalam Crime Thriller Series OTT : ఓ వ్యక్తి మనల్ని వెంబడిస్తున్నాడనే అనుమానం మొదట్లో చిన్న విషయంలా అనిపించొచ్చు. కానీ అదే వ్యక్తి పదేపదే బెదిరిస్తూ, మన కదలికలను గమనిస్తూ, ఎక్కడికి వెళ్లినా వెంటాడుతుంటే… ఆ భయం నిజమని తెలిసే సమయానికి పరిస్థితి చేతులు దాటిపోయి ఉంటే… వరుసగా జరుగుతున్న హత్యల వెనుక స్టాకింగ్ కు సంబంధించిన ప్రమాదకరమైన కోణం బయటపడితే… ఇలాంటి ఉత్కంఠభరితమైన అంశాలతో వచ్చిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘Eyes’. స్టాకర్లను గుర్తించి, వారి తదుపరి చర్యలను అడ్డుకోవడానికి ప్రయత్నించే మానసిక ఆరోగ్య నిపుణులు, పోలీసుల బృందం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మరి ఈ సైకో థ్రిల్లర్ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అన్నది తెలుసుకుందాం పదండి.
ఎదుటివారి అనుమతి లేకుండా నిరంతరం వెంబడించడం, వారి వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవడం, బెదిరింపులతో భయపెట్టడం వంటి చర్యలు ప్రమాదకరంగా మారవచ్చు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సిరీస్ లో అలాంటి ప్రవర్తన వెనుక ఉన్న మానసిక పరిస్థితులను అర్థం చేసుకుని, హింసకు దారి తీసే సంఘటనలను అడ్డుకోవడానికి ఓ ప్రత్యేక బృందం ప్రయత్నిస్తుంది. ఈ బృందం పేరు ‘ఐస్’. మానసిక ఆరోగ్య నిపుణులు, పోలీసు సిబ్బంది కలిసి స్టాకర్ల ప్రవర్తనను అధ్యయనం చేస్తూ, బాధితులకు రక్షణ కల్పించడానికి ప్రయత్నిస్తారు. ఒక వ్యక్తి ఎలాంటి సంకేతాలు చూపిస్తున్నాడు, అతడి ప్రవర్తన ఎప్పుడు ప్రమాదకరంగా మారవచ్చు, తదుపరి ఎవరిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది వంటి అంశాలను అర్థం చేసుకోవడం వారి పనిలో కీలకం.
కథలో రితిక అనే నటి కీలక పాత్రలో కనిపిస్తుంది. ఆమెను గతంలో మిలన్ అనే స్టాకర్ వేధిస్తుంటాడు. కొంతకాలం తర్వాత మళ్లీ అతడి నుంచి బెదిరింపులు రావడంతో రితిక తీవ్ర ఆందోళనకు గురవుతుంది. గతంలో తనకు రక్షణ కల్పించిన ఐస్ బృందాన్ని సంప్రదించాలని నిర్ణయించుకుంటుంది. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఆమెకు ఊహించని విషయం తెలుస్తుంది. తనకు భరోసా ఇచ్చిన ఆ బృందం ఇప్పుడు పని చేయడం లేదని తెలుసుకుని నిరాశకు గురవుతుంది. మరోవైపు స్టాకర్ల హత్యలతో సంబంధం ఉన్న కేసులు కూడా పోలీసుల ముందుకు వస్తాయి. వరుస సంఘటనలను విడివిడిగా చూడకుండా, వాటి మధ్య ఉన్న సంబంధాలను గుర్తించాల్సి వస్తుంది.
బాధితుల భయాలు, నిందితుల ప్రవర్తన, పోలీసుల దర్యాప్తు.. ఈ మూడు కోణాలతో సిరీస్ ముందుకు సాగుతుంది. ఇప్పుడు రితికకు రక్షణ కల్పించేది ఎవరు ? మిలన్ నిజంగా ఏం చేయాలనుకుంటున్నాడు ? అతడి బెదిరింపుల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి ? రితికను వెంటాడుతున్న మిలన్ టార్గెట్ ఏమిటి ? ఐస్ బృందం మళ్లీ రంగంలోకి దిగుతుందా ? వరుస హత్యల వెనుక ఉన్న నిజం బయటపడుతుందా ? ఈ విషయాలు తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే.
Also Read : హోటల్ నిండా దెయ్యాలు… చిన్న పిల్లాడిలో డెమాన్… నవ్విస్తూనే భయపెట్టడానికి తిరిగొచ్చిన సీజన్ 2
ఏడు ఎపిసోడ్ల క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘ఐస్’కు మను అశోకన్ దర్శకత్వం వహించారు. కని కుసృతి, నిఖిల విమల్, దేవ్ మోహన్, శ్రుతి రామచంద్రన్ తదితరులు ఇందులో నటించారు. SonyLIVలో అక్టోబర్ 9 నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ సిరీస్ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ వెర్షన ఆడియోతో అందుబాటులో ఉంది.