Congress MP: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. అలాగే మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మాత్రం సినిమా ఛాన్స్ తప్పక వస్తుందని కూడా ఎంపీ అన్నారు. అంబటి డ్యాన్స్ కూడా బాగా చేస్తారని తనకు తెలిసిందన్నారు ఆ ఎంపీ. ఇంతకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అలా ఎందుకు అన్నారంటే..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణలో జగన్ పాలన మాదిరిగా లేదని, ప్రజా ప్రభుత్వం నడుస్తుందన్నారు. సంధ్యా థియేటర్ ఘటన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పాలనా పరంగా తీసుకున్న నిర్ణయాలుగా పవన్ అభిప్రాయ పడ్డారు. పవన్ చేసిన కామెంట్స్ పై హైదరాబాద్ అసెంబ్లీ వద్ద ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
ఎంపీ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో రూలింగ్ పార్టీని వ్యతిరేకించడానికి బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పోటీ పడ్డారన్నారు. పవన్ కళ్యాణ్ వాస్తవ పరిస్థితులు మాట్లాడారని అభిప్రాయపడ్డ ఎంపీ, రాజకీయ నాయకుడిగా పవన్ మాట్లాడలేదన్నారు. పవన్ మానవత్వ కోణంలో కామెంట్స్ చేశారని ఎంపీ తెలిపారు. జగన్ లాంటి పాలన తెలంగాణలో లేదని పవన్ మాట్లాడడం వెనుక తమ ప్రభుత్వాన్ని పవన్ రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలిపినట్లుగా భావించవచ్చన్నారు.
అల్లు అర్జున్ అరెస్టు విషయం దేశవ్యాప్తంగా చర్చ జరిగిందని, ఆ విషయంలో చట్టం తన పని తాను చేసుకు పోయిందన్నారు. ఇక మాజీ మంత్రి అంబటి గురించి కూడా ఎంపీ కీలక కామెంట్స్ చేశారు. అంబటి రాంబాబు మంచి కళాకారుడిగా గుర్తింపు పొందారని, నెక్స్ట్ సినిమాలో అంబటి కి మంచి రోల్ వచ్చే అవకాశం ఉందన్నారు. అంబటి డాన్స్ కూడా బాగానే చేస్తారని తనకు తెల్సిందన్నారు. రాజకీయాలలో అంబటి రాంబాబుకి అంత సీన్ లేదని విమర్శించారు.
అల్లు అర్జున్ అరెస్ట్ తో సినిమాకి ఇంకా ఎక్కువ కలెక్షన్లు వచ్చాయని, మరో 2 నెలలు పుష్ప సినిమా నడుస్తుందని ఎంపీ అన్నారు. గురుకుల హాస్టల్ విద్యార్థిని శైలజ కుటుంబాన్ని సీఎం ఎందుకు పరామర్శించలేదని ప్రతిపక్షాలు విమర్శించడంపై ఎంపీ మాట్లాడుతూ.. సీఎం స్థాయిలో అన్ని చోట్లకు వెళ్లడం సాధ్యం కాదన్నారు. ముఖ్యమంత్రిని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని, తెలంగాణలో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, ఓర్వలేక కావాలనే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
పవన్ కళ్యాణ్ చిట్చాట్పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రియాక్షన్
పవన్ కళ్యాణ్ వాస్తవ పరిస్థితులు మాట్లాడారు.. రాజకీయ నాయకుడిగా మాట్లాడలేదు
పవన్ మాకు అనుకూలంగా మాట్లాడాడని నేను అనుకోవట్లేదు.. మానవత్వ కోణంలో మాట్లాడారు
జగన్ లాంటి పాలన తెలంగాణలో లేదని పవన్ అన్నారు
అంబటి రాంబాబు… pic.twitter.com/g3t0NMIvrP
— BIG TV Breaking News (@bigtvtelugu) December 30, 2024