BigTV English

Tonique Liquor Shop: మందుబాబులకు షాక్.. టానిక్ లిక్కర్ షాపు క్లోజ్!

Tonique Liquor Shop: మందుబాబులకు షాక్.. టానిక్ లిక్కర్ షాపు క్లోజ్!

Tonique Liquor Shop Close: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్ 36లో ఉన్న లగ్జరీ లిక్కర్ మార్ట్ టానిక్ ఎలైట్ వైన్ షాపును ఎక్సైజ్ శాఖ అధికారులు క్లోజ్ చేయనున్నారు. ఈ షాపు లైసెన్స్ గడువు ఆదివారంతో ముగిసిపోయింది. దీంతో ఉదయం 11 గంటలకే అధికారులు షాపు వద్దకు చేరుకున్నారు. కాగా, లైసెన్స్ పొడిగించాలని షాపు యజమానులు దరఖాస్తు చేసుకున్నారని, అయితే సాధ్యం కాదని పొడిగించలేదని సమాచారం.


జూబ్లీహిల్స్‌లోని టానిక్ వైన్ షాప్ వద్దకు ఎక్సైజ్ పోలీసులు చేరుకున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో టానిక్ లిక్కర్ మార్ట్ స్పెషల్ జీఓతో అనుమతి తీసుకున్నారు. ఈ మేరకు గత ప్రభుత్వం టానిక్‌కు ఏ4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేసింది.

రాష్ట్రంలో ఏ వైన్ షాపునకు లేని విధంగా విదేశీ మద్యం బ్రాండ్ల అమ్మకాలు చేసుకునేలా గత ప్రభుత్వం టానిక్‌కు అనుమతి ఇచ్చింది. గత ప్రభుత్వం ఈ లిక్కర్ మార్ట్ కు అనేక వెసులుబాటులు ఇచ్చింది. అయితే టానిక్ లిక్కర్ మార్ట్‌లో అవకతవకలు జరిగినట్లు కమర్షియల్ టాక్స్ అధికారులు గుర్తించారు.


కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనిఖీలు నిర్వహించింది. ఇది ఎక్సైజ్ పాలసీకి పూర్తి విరుద్ధంగా ఉందని తేలింది. ప్రస్తుతం టానిక్ సంస్థకు హైదరాబాద్ వ్యాప్తంగా 11 ఫ్రాంచైజీలు ఉండగా.. క్యూ బై టానిక్ పేరుతో మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారు.

Also Read: సీఎం అత్యవసర రివ్యూ.. అధికారులు సెలవులు పెట్టొద్దు

ఇందులో ని మద్యం బాటిళ్లను సమీప దుకాణలకు పంపిస్తున్నారు. ప్రపంచంలోని ఎంత ఖరీదైన బ్రాండ్ మద్యం అయినా ఇక్కడ లభిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ నుంచి అయినా మద్యం తెచ్చుకునే వెసులుబాటు కల్పించడంతో వ్యాపారం కోట్లల్లో జరిగేదని చెబుతున్నారు. తాజాగా, అధికారులు చర్యలు తీసుకోవడంతో చర్చనీయాంశంగా మారింది.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×