Teacher MLC elections: ఏపీ రాష్ట్రంలోని కూటమి సర్కార్ కు భారీ షాక్ తగిలింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు ఎదురుదెబ్బ తగిలింది. భారీ విజయం సాధిస్తామనుకున్న చోట అనూహ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పరాజయం పొందింది. ఈ ఫలితం ఏపీ రాజకీయాల్లో పీఆర్‌టీయూ సంచలనం సృష్టించింది. అధికారంలో ఉన్న కూటమికి వ్యతిరేకంగా గవర్నమెంట్ టీచర్స్ తీర్పు ఇవ్వడం పొలిటికల్ గా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఏపీలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఒకటి టీచర్ ఎమ్మెల్సీ కాగా.. మరో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. తాజా ఎన్నికల ఫలితాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కీలకమైన ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఉపాధ్యాయులు సంచలన తీర్పు ఇచ్చారు. వైజాగ్- విజయనగరం- శ్రీకాకుళం టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకాల పాటి రఘువర్మ పోటీ చేయగా.. పీఆర్‌టీయూ తరఫున గాదె శ్రీనివాసులు పోటీ చేశారు.
సెకండ్ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో శ్రీనివాసులు విజయం..
అయితే ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గవర్నమెంట్ టీచర్ కూటమి సర్కార్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఫస్ట్ నుంచి పీఆర్టీయూ అభ్యర్థి అయిన గాదె శ్రీనివాసులు ఆధిపత్యం కొనసాగుతూనే వచ్చింది. ఎక్కడా కూడా టీడీపీ- జనసేన- బీజేపీ అభ్యర్థి పోటీలోకి రాలేదు. ఫైనల్ గా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. సెకండ్ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆయన గెలిపొందారు. శ్రీనివాసులు 10,068 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ దాటడంతో ఆయన విజేతగా నిలిచారు. మరోవైపు, వెయ్యికి పైగా ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. విజేతను డిసైడ్ చేసే ప్రక్రియలో మొత్తం ఎనిమిది మందిని ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ 11 గంటల పాటు సాగింది.
ALSO READ: TGPSC Group-2,3 Results: గ్రూప్-2,3 ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చేసింది.. కొత్త నోటిఫికేషన్లు కూడా..?
కూటమి సర్కార్ కు బిగ్ షాక్..
విశాఖపట్నం- విజయనగరం- శ్రీకాకుళం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం పది మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఎనిమిది మందిని ఎలిమినేట్ చేసిన తర్వాత మూడో స్థానంలో నిలిచిన పీడీఎఫ్ అభ్యర్థి విజయగౌరి ఎలిమినేషన్ చేస్తుండగా గాదె శ్రీనివాసులు మ్యాజిక్ ఫిగర్ దాటారు. దీంతో అతడి విజయం ఖరారైంది. గాదె శ్రీనివాసులు విజయం సాధించడంతో ఆయన మద్దతుదారులు, పీఆర్‌టీయూ ఉపాధ్యాయులు సంబరాల్లో మునిగితేలారు. అయితే తాము బలపర్చిన రఘువర్మ ఓటమి పాలవ్వడంతో కూటమి సర్కార్ కు బిగ్ షాక్ తగిలింది.