E-Paper
Advertisement

తెలంగాణ స్త్రీనిధిలో ఆంధ్ర పెత్తనం? హెచ్‌ఆర్ అర్హతే లేదు.. కానీ అడ్మిన్ సీటు ఆమెదే!

తెలంగాణ స్త్రీనిధిలో ఆంధ్ర పెత్తనం? హెచ్‌ఆర్ అర్హతే లేదు.. కానీ అడ్మిన్ సీటు ఆమెదే!
Advertisement

Sthree Nidhi: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో గ్రామీణ మహిళలు, పేదల ఆర్థిక సాధికారతకు దిక్సూచిగా నిలవాల్సిన ‘స్త్రీనిధి’లో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు పరాకాష్ఠకు చేరాయని సమాచారం. స్థానిక ఉద్యోగుల హక్కులను కాలరాస్తూ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి ఆధిపత్యమే నడుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీస విద్యార్హతలు, నిబంధనలతో సంబంధం లేకుండా అర్హులైన తెలంగాణ ఉద్యోగులకు ప్రమోషన్లు నిరాకరిస్తూ, పైరవీకారులకు, పక్క రాష్ట్రానికి చెందినవారికే ఉన్నతాధికారులు పెద్దపీట వేస్తున్న తీరుపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

డిగ్రీ లేదు.. కానీ ప్రమోషన్లు సొంతం!

Advertisement

శ్రీనిధిలో అడ్మినిస్ట్రేషన్ (పరిపాలన) విభాగంలో ఉన్నత పదవి దక్కించుకోవాలంటే హెచ్‌ఆర్ (HR) లేదా దానికి సంబంధించిన ప్రత్యేక డిగ్రీలు తప్పనిసరి. కానీ, ఓ కన్సల్టెన్సీ ద్వారా తాత్కాలిక పద్ధతిలో చేరిన ఒక మహిళా ఉద్యోగికి ఎటువంటి హెచ్‌ఆర్ డిగ్రీ లేకపోయినా అడ్డగోలుగా అడ్మిన్ ప్రమోషన్ కట్టబెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. గతంలో ఎండీ (మేనేజింగ్ డైరెక్టర్) స్పష్టంగా నిర్దేశించిన ప్రమోషన్ల నిబంధనలను, సీనియారిటీ జాబితాను పక్కనబెట్టి మరీ ఈ నియామకం చేపట్టినట్లు తెలుస్తోంది.

డిగ్రీ లేకున్నా అడ్మిన్ పదవి?

Advertisement

స్త్రీనిధిలో పరిపాలన (అడ్మినిస్ట్రేషన్) విభాగంలో ఉన్నత బాధ్యతలు చేపట్టాలంటే హెచ్‌ఆర్ సంబంధిత ప్రత్యేక డిగ్రీ లేదా తత్సమాన అర్హత తప్పనిసరి. కానీ, ఓ కన్సల్టెన్సీ ద్వారా 2019లో జాయినింగ్ అయిన ఆ ఉద్యోగికి ప్రమోషన్ కల్పించాలంటే రోస్టర్ పాయింట్ పాటించాలి. కానీ తాత్కాలిక పద్ధతిలో చేరిన ఒక మహిళా ఉద్యోగికి ఎలాంటి హెచ్‌ఆర్ అర్హతలు లేకపోయినా అడ్డగోలుగా అడ్మిన్ ప్రమోషన్ కట్టబెట్టారనే ప్రచారం జరుగుతుంది. సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ స్పష్టంగా నిర్దేశించిన ప్రమోషన్ల నిబంధనలను, సర్వీసు సీనియారిటీ జాబితాను పూర్తిగా పక్కనబెట్టి ఈ నిర్ణయం తీసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆయన సంస్థ నిబంధనలను తుంగలో తొక్కడం తీవ్ర చర్చకుదారితీసింది. అంతేకాదు కన్సల్టెన్సీగా పనిచేసిన ఆ ఉద్యోగి..రిజైన్ చేసింది. మళ్లీ3 నెలల తర్వాత జాయిన్ అయింది. కంటిన్యూగా చేస్తున్న ఉద్యోగులను కాదని ఆమెకు ప్రమోషన్ ఇవ్వడంపై చర్చజరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఏజీఎం పోస్టుకు సైతం దరఖాస్తు చేసుకోగా, ఇంటర్వ్యూకు కాల్ లెటర్ సైతం వచ్చినట్లు చర్చజరుగుతుంది. అయితే దీనిపై సైతం ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు రిజక్టు చేసినట్లు సమాచారం.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీరని అన్యాయం..

సంస్థ స్థాపన నుండి శ్రమిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ఉద్యోగులకు ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. సంస్థ ఎండీగా పనిచేసి రిటైర్ అయిన ఆ అధికారి.. రోస్టర్ పాయింట్లు, సర్వీస్ నిబంధనలను బొందపెట్టి, ఆంధ్రా వారికి, తనకు అనుకూలంగా ఉన్నవారికి, పైరవీకారి చేసేవారికి ప్రాతిపదికన తమ వారికి మాత్రమే ప్రమోషన్లు కట్టబెడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సంవత్సరాల తరబడి అర్హత కలిగిన బహుజన ఉద్యోగులు ఒకే హోదాలో మూలుగుతుంటే, కన్సల్టెన్సీ రూట్ లో వచ్చిన వారికి ఎర్రకార్పెట్ పరచడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఫిర్యాదులొచ్చినా కదలని యంత్రాంగం..

సదరు మహిళా ఉద్యోగి అక్రమ ప్రమోషన్, సంస్థలో ఆమె సాగిస్తున్న నిబంధనల ఉల్లంఘనలపై ఆధారాలతో సహా రాతపూర్వకంగా అనేక ఫిర్యాదులు అందినప్పటికీ ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన పెద్దలే ఆమెకు అండగా నిలుస్తుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. సీనియర్ అధికారులను సైతం పక్కనబెట్టి ఆమెకు అపరిమిత అధికారాలు కట్టబెట్టడం వెనుక స్త్రీనిధిలోని కొందరు ఉన్నతాధికారుల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆ ఉద్యోగి తోటి మహిళా ఉద్యోగులను సైతం ఇబ్బందులకు గురిచేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఆమె పెడుతున్న ఇబ్బందులను తట్టుకోలేక ఒక మహిళా ఉద్యోగి రిజైన్ చేసినట్లు సమాచారం. మరో మరోకరు టర్మినేషన్ అయినట్లు సమాచారం. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించి శ్రీనిధిలో జరిగిన ఈ ప్రమోషన్ల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: మౌలాలి రైల్వే స్టేషన్‌లో విషాదం.. వందే భారత్ రైలు ఢీకొని నర్స్ మృతి

Tags

Related News

చేప పిల్లల పంపిణీకి బకాయిల బ్రేక్.. సస్పెన్స్‌లో మత్స్యకారుల భవిష్యత్తు!

మౌలాలి రైల్వే స్టేషన్‌లో విషాదం.. వందే భారత్ రైలు ఢీకొని నర్స్ మృతి

జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం.. ఉరివేసుకొని ఇంటర్ విద్యార్థిని సూసైడ్!

ముక్కలవుతున్న సీతారామ కాలువలు.. పట్టించుకోని అధికారులు

జవాన్ల పిల్లల చదువు, వైద్యంపై కేంద్రం స్పెషల్ ఫోకస్.. మంత్రి బండి సంజయ్ హామీ!

రేషన్ కార్డుల ప్రింటింగ్‌లో భారీ స్కామ్.. బయటపెట్టిన ఎమ్మెల్సీ దాసోజు!

కల్యాణలక్ష్మి- షాదీ ముబారక్ రద్దుకు కాంగ్రెస్ కుట్ర.. ఊరూరా నేతలను నిలదీయండి: కేటీఆర్

Big Stories

Advertisement
×