E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode August 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  దొంగతనం చేశావా అంటూ రాజును అవమానించిన చలపతి   

Brahmamudi Serial Today Episode August 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  దొంగతనం చేశావా అంటూ రాజును అవమానించిన చలపతి   
Advertisement

Brahmamudi serial today Episode: డబ్బులు తీసుకుని రాజు, ఇందు కలిసి చలపతి ఇంటికి వెళ్తారు. చలపతి వెటకారంగా రాజును తిడుతుంటాడు. అందుకు లక్ష్మీ ఏవండి వాడు కనిపించకపోతే అల్లాడిపోతారు.. ఇలా కళ్ల ముందు ఉంటే అలా మాట్లాడతారేంటి..? అంటుంది. చలపతి వెంటనే.. సరేలే నేను వెళ్లి చికెన్‌ తీసుకొస్తాను నేను వచ్చేలోపు అన్ని రెడీ చేసి పెట్టు అంటూ చలపతి వెళ్లిపోతాడు. లక్ష్మీ ఇంట్లోకి వెళ్లిపోతుంది. రాజు తాను ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అసలు నేను విషయం చెబితే మా నాన్న నమ్మడు అనగానే.. ఏమ కాదులేండి..? మీరేం టెన్షన్‌ పడకండి అంటుంది ఇందు.

పక్కన డల్లుగా కూర్చున్న వెంకీని చూసి రాజు ఏంట్రోయ్‌ ముఖం అలా పెట్టుకు కూర్చున్నావు అనగానే.. వెంకీ డల్లుగానే.. ఏం లేదు అని చెప్తాడు. రాజు ఇంట్లోకి వెళ్లిపోతాడు. ఇందు, వెంకీ దగ్గరకు వెళ్లి ఎందుకు డల్లుగా ఉంటున్నావు.. ఎందుకు నందుకు దూరంగా ఉంటున్నావు.. ఈ మధ్య ఫోన్‌ చేయడం లేదు.. కనీసం మెసెజ్‌కు రిప్లై కూడా ఇవ్వడం లేదట ఏం మాట్లడవేంటి వెంకీ అని అడగ్గానే.. ఏం లేదు వదిన నేను కొంచెం బిజీ అయిపోయాను అందుకే వీలు కావడం లేదు అని చెప్తాడు. మీరేం అనుకుంటున్నారో అదేం నా మనసులో లేదు అంటూ చెప్పగానే.. మరి అయితే ఇంతకు ముందులా ఎందుకు తనతో ఉండటం లేదు అని అడగ్గానే.. వెంకీ తనకు అర్జెంట్‌ పని ఉంది అంటూ వెళ్లిపోతాడు. ఇందు కూడా లోపలికి వెళ్లిపోతుంది.

Advertisement

కిచెన్‌లో వంట చేస్తున్న లక్ష్మీ దగ్గరకు వెళ్లిన రాజు తను తీసుకొచ్చిన ఐదు లక్షలు ఇవ్వబోతే.. వెళ్లి చలపతికే ఇవ్వమని చెప్తుంది. రాజు అమ్మో నాన్నకా అంటూ భయపడితే.. లక్ష్మీ ఎమోషనల్‌ అవుతుంది. మీ నాన్నకు మీరు ప్రయోజకులు అయితే నలుగురిలో గొప్పగా చెప్పుకోవాలని ఉందిరా…? ఇప్పుడు ఈ డబ్బులు తీసుకెళ్లి ఆయన చేతిలో పెడితే ఆయన చాలా సంతోషిస్తారురా అని చెప్పగానే.. రాజు నాన్న ఎక్కడున్నాడు అమ్మా అని అడగ్గానే.. బయట ఉన్నాడు వెళ్లరా అని చెప్తుంది లక్ష్మీ. రాజు మెల్లగా బయటకు వెళ్తాడు. మంచం మీద కూర్చున్న చలపతి దగ్గరకు వెళ్లిన రాజు తన చేతిలో ఉన్న ఐదు లక్షలు తీసి చలపతి ముందు టేబుల్‌ మీద పెడతాడు. ఆ డబ్బులు చూసి చలపతి షాక్‌ అవుతాడు.

రాజు మాత్రం నాన్న జీవితంలో మొదటిసారి నేను కష్టపడి సంపాదించిన డబ్బు నాన్న ఇది తీసుకో అని చెప్పగానే.. చలపతి కోపంగా రేయ్‌ ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావురా ఈ డబ్బు.. చెప్పరా నీకు పెళ్లి అయింది. గొప్ప ఇంటికి అల్లుడు అయ్యావు.. ఇంకా దొంగతనాలు చేసుకుని బతుకుతున్నావా..? అంటూ నిలదీయగానే.. నేను తప్పు  చేయలేదు నాన్న.. నేను ఇప్పుడు స్వరాజ్‌ గ్రూఫ్‌ ఆఫ్‌ కంపెనీస్‌లో పని చేస్తున్నాను నాన్న అని చెప్పగానే.. అయితే తిన్నింటి వాసాలు లెక్కపెట్టావా..? అంటూ చలపతి తిడుతుంటే.. ఇందు అడ్డు పడుతుంది. అంకుల్‌ మీకు తెలియదు అంకుల్‌ అంటుంటే.. చలపతి కోపంగా ఇందును ఆగమని రాజును తిడుతుంటాడు.

Advertisement

లక్ష్మీ, వెంకీ అడ్డు వచ్చినా వాళ్లను తిట్టి వీడు మన కుటుంబం పరువు తీస్తున్నాడురా అంటూ ఏడుస్తూ.. రాజును తిడుతుంటాడు. ఇందు గట్టిగా అరుస్తూ.. ఇంతకు ముందు రాజు వేరు ఇప్పుడు మీ కళ్ల ముందు ఉన్న రాజు వేరు.. తన కష్టాన్ని, టాలెంట్‌ను వెల కట్టలేము అంటూ చెప్తుంది. ఇందు మాటలకు చలపతి ఎమోషనల్ అవుతాడు. రాజును హగ్‌ చేసుకుని హ్యాపీగా ఫీలవుతాడు. తర్వాత చుట్టుపక్కల వాళ్లను పిలిచి నా కొడుకు గురించి మీరంతా చాలా బ్యాడ్‌గా మాట్లాడేవారు కదా ఇప్పుడు చూడండి నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడు. మీలాగా చిన్నా చితకా కంపెనీలలో పని చేయడం లేదు.. ఈ సిటీలోనే పెద్దదైన స్వరాజ్ గ్రూప్‌ ఆఫ్‌ కంపనీలో పని చేస్తున్నాడురా అంటూ గొప్పగా చెప్పుకుంటుంటే.. వెనక నుంచి అంతా వింటున్న రాజు ఏమోషనల్ అవుతాడు. చుట్టుపక్కల వాళ్లంతా ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×