Supreme Court: రాష్ట్రంలోని గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీలుగా కొనసాగుతోన్న కోదండరాం, అమీర్ అలీఖాన్‌లకు గట్టి షాకే తగిలింది. వారి నియామకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు బుధవారం తీర్పునిచ్చింది. కొన్ని నెలల క్రితం వీరిద్దరూ తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియామకం చేపట్టిన సంగతి తెలిసిందే.
అయితే.. వీరి నియామకం అక్రమంగా జరిగిందని.. విచారణ జరిపించి.. నియామకాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టు, సత్యనారాయణలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ రోజు విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. వారి నియామకం చెల్లదని సంచలన తీర్పును వెలువరించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది.
ALSO READ: Hyderabad News: గొర్రెల కోసం ఆకులు తెంపడానికి వెళ్లి నాలాలో పడ్డాడు.. చివరకు?
ఈ సందర్భంగా మీడియాతో బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మాట్లాడారు. గతంలో ఉన్న సుప్రీంకోర్టు ఆర్డర్ ను మాడిఫై చేస్తామన్నారు.. రాజకీయ పార్టీలతో మాకు సంబంధాలు ఉన్నట్టే.. కొదండరాం, అలీఖాన్ కు కూడా ఉన్నాయి. ధర్మం గెలవాలని కోరుకుంటున్నా.. కోర్టులో ఆర్డర్ ఉన్నప్పుడు ఎలా ఫిల్ చేస్తారు’ అని దాసోజు శ్రణ్ ప్రశ్నించారు.
ALSO READ: Weather News: అత్యంత భారీ వర్షాలు.. డేంజర్ జోన్‌లో ఈ జిల్లాలు.. బయటకు వెళ్లొద్దు