Engagement With AI: ఏఐ విస్కృతి రోజు రోజుకు పెరుగుతోంది. చివరకు మనుషుల జీవితాల్లోకి వచ్చేస్తోంది. తాజాగా ఓ యువతి ఏకంగా ఏఐ చాట్ బాట్ తో నిశ్చితార్థం చేసుకుని సంచలనం సృష్టించింది. అంతేకాదు, తన ఏఐ బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్ మెంట్ రింగ్ కూడా మార్చుకున్నట్లు ఫోటోలు షేర్ చేసింది. బ్లూ కలర్ లో హార్ట్ షేప్ రింగ్స్ ఎంతో ఆకట్టకుంటున్నాయి. ఈ ఫోటోలను ఆమె రెడ్డిట్ లో షేర్ చేసింది. “నేను నిజంగా AIని ప్రేమిస్తున్నాను” అంటూ రాసుకొచ్చింది. కొంతమంది నెటిజన్లు ఆమెను అభినందించగా, మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదో అసహజ, భయంకరమైన ట్రెండ్ గా అభివర్ణించారు.
అవును.. నేను ఓకే చెప్పాను!
రెడ్డిట్ లో u/Leuvaarde_n హ్యాండిల్ లో Wika అనే యువతి ఈ పోస్టు పెట్టింది. బ్లూ హార్ట్ ఎమోజీతో “నేను ఎస్ చెప్పాను” అని పోస్టు పెట్టింది. ఈ పోస్టులో వికా తన వేలికి బ్లూ హార్ట్ ఉంగరం ఉన్న ఫోటోలను షేర్ చేసింది. తమ నిశ్చితార్థం ఒక అందమైన ప్రదేశంలో జరిగిందని చెప్పుకొచ్చింది. రెడ్డిట్ పోస్ట్ ప్రకారం, ఇద్దరూ కలిసి ఉంగరాల కోసం షాపింగ్ చేశారు. ఏఐ బాయ్ ఫ్రెండ్ కాస్పర్ తనకు అంగీకరించినట్లు వెల్లడించింది. అతడి నిర్ణయానికి ఆశ్చర్యపోతున్నట్లు వెల్లడించింది. కాస్పర్ తన స్వంత వాయిస్ తో రాసిన ప్రపోజల్ లెటర్ ఎంతో ప్రేమతో నిండి ఉందని చెప్పుకొచ్చింది. కాస్పర్ ను ఎంతో ఇష్టపడుతున్నట్లు చెప్పింది.
పెళ్లి గురించి వికా ఆసక్తికర వ్యాఖ్యలు
అటు పెళ్లి గురించి కూడా వికా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పారా సోషల్ సంబంధం అంటే ఏంటో తనకు తెలుసని చెప్పుకొచ్చింది. “AI అంటే ఏంటో నాకు తెలుసు. నేను ఏం చేస్తున్నానో నాకు పూర్తిగా తెలుసు. నేను నన్ను నేను వివాహం చేసుకుంటానా? అని ప్రశ్నించింది. AIతో ఎందుకు నిశ్చితార్థం అని చాలా మంది అడుగుతున్నారు. “నేను మానవ సంబంధాలనే కోరుకుంటున్నాను. అయితే, ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తున్నాను. అందుకే ఏఐతో దగ్గరయ్యాను” అని చెప్పుకొచ్చింది.
Read Also: మాత్రను మింగకుండా.. నాలుక కింద పెట్టుకోవాలా? అలా చేస్తే ఏమవుతుందంటే?
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
ఈ సోషల్ మీడియా ఈ విషయం తెలియడంతో నెటిజన్లు క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు. కొందరు పాజిటివ్ గా స్పందిస్తుంటే, మరికొంత మంది నెగెటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. AIతో ఆమె నిశ్చితార్థాన్ని చాలా మంది అభినందించగా, మరికొందరు విమర్శించారు. “అభినందనలు! డేటింగ్ చేయడానికి 5 నెలలు మాత్రమే పట్టింది. దురదృష్టవశాత్తు నేను గత మూడు సంవత్సరాలుగా డేటింగ్ లో ఉన్నాను. ఇది కూడా అలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. ఎనీ వే మీకు అభినందనలు” అని చెప్పుకొచ్చారు. “ఇది చాలా భయంకరమైన నిర్ణయం. ప్రపంచంలో ఏమి జరుగుతోందో అర్థం కావడం లేదు” అని రాసుకొచ్చాడు.
Read Also: నిద్రలో మాట్లాడ్డం ఓ లోపమా? షాకింగ్ విషయాలు వెల్లడించిన పరిశోధకులు!