E-Paper
Advertisement

Telangana: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

Telangana: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
Advertisement

Telangana: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉదయం 11.45 గంటలకు శాసనసభ, శాసనమండలి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించనున్నారు. సభ మరుసటి రోజుకు సభవాయిదా వేయనున్నారు. మధ్యాహ్నం బీఏసీ సమావేశంలో సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనేదానిపై స్పష్టత రానుంది. గవర్నర్ కు కృతజ్ఞతపై 17న సీఎం, మంత్రులు, సభ్యులు మాట్లాడనున్నారు. అయితే ఈ నెల 31 వరకు సమావేశాలు కొనసాగిస్తారని సమాచారం. 19న ఉగాది సెలవు, 21న రంజాన్, 22, 29 ఆదివారం కావడంలో సెలవు ఉంటుందని సమాచారం. 20న బడ్జెట్ ను భట్టి విక్రమార్క అసెంబ్లీలో, మంత్రి శ్రీధర్ బాబు మండలిలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

Also Read: Rythu Bharosa: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఈ నెల 22 నుంచే రైతు భరోసా నిధులు!

తెలంగాణ తల్లి విగ్రహాం

Advertisement

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి శాసనసభ, మండలి సమావేశాలు ఒకే భవనంలో జరుగుతున్నాయి. మంత్రులు సైతం రెండు సభల్లో చర్చల సమయంలో పాల్గొనేందుకు సులభంగా వీలు కలుగుతుంది. ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి లు ఆవిష్కరించనున్నారు. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత గవర్నర్ బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. ద్రవ్య వినిమయబిల్లు ఆమోదం తర్వాత అసెంబ్లీని నిరవధిక వేయనున్నట్లు సమాచారం. గవర్నర్ బడ్జెట్ పై చేసే ప్రసంగం సమయంలో బీఆర్ఎస్ అడ్డుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బడ్జెట్ ప్రసంగంలో రుణమాఫీ,రైతు భరోసా, పంటలకు 500బోనస్ వంటి అంశాల ప్రస్తావన వచ్చిన సందర్భంలో రన్నీంగ్ కామెంట్రీలు చేసే అవకాశం ఉందని సమాచారం. దీనికి అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎలా అడ్డుకుంటారో చూడాలి.

Also Read: Thriller Series OTT : నమ్మిన వాళ్ళను నట్టేట ముంచే హీరోయిన్… కేక పెట్టిస్తున్న కొరియన్ సిరీస్

Related News

తెలంగాణ గ్రామ పంచాయతీలకు.. సీక్రేట్ ఆర్డర్స్ జారీ చేసిన సర్కార్..?

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

Big Stories

Advertisement
×