E-Paper
Advertisement

కులం పేరుతో ఎన్నో అవకాశాలు కోల్పోయా.. ఇండస్ట్రీ గుట్టు విప్పిన రవికృష్ణ!

కులం పేరుతో ఎన్నో అవకాశాలు కోల్పోయా.. ఇండస్ట్రీ గుట్టు విప్పిన రవికృష్ణ!
Advertisement

Ravi Krishna: సీరియల్స్ తో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు రవికృష్ణ. అలా డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని, తన సత్తా చాటాలని ఎన్నో కలలు కన్నారు. అందులో భాగంగానే చెన్నైలో ఒక సీరియల్ కి అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈయన, ఆ తర్వాత అనుకోకుండా నటుడుగా అవకాశం లభించింది. అలా మొగలిరేకులు సీరియల్ తో నటుడిగా సెన్సేషన్ క్రియేట్ చేసిన రవి కృష్ణ.. బిగ్ బాస్ షో తో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఈ షో తర్వాత పలు సినిమా అవకాశాల అందుకుంటూ బిజీగా మారిన రవికృష్ణ.. ‘విరూపాక్షా’ సినిమాతో ఒక్కసారిగా తన కెరీర్ ను మలుపు తిప్పుకున్నారు. ఈ సినిమాతో ఊహించని పాపులారిటీ లభించింది ..ఆ తర్వాత దండోరా, లవ్ మీ: ఇఫ్ యు డేర్ అంటూ పలు సినిమాలు చేసిన ఈయన.. ప్రస్తుతం సాయి ధరంతేజ్ హీరోగా నటిస్తున్న సంబరాల ఏటిగట్టు చిత్రంలో సుబ్బి అనే పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఉండగా గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తాను హీరోగా అవకాశాలు కోల్పోవడం పై సంచలన కామెంట్లు చేశారు.

కులం పేరుతో అవకాశాలు కోల్పోయాను -రవికృష్ణ

సాధారణంగా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఏ రేంజ్ లో అయితే పాకిపోయిందో.. కులం కూడా అంతే రేంజ్ లో పాకిపోయింది అంటూ ఎంతో మంది బాధితులు మీడియా ముందు తమ బాధను వెళ్ళబోసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా క్యాస్ట్ కారణంగా అవకాశాలు కోల్పోయామని, ఈ క్యాస్ట్ కారణంగానే ఎవరూ తమను పట్టించుకోలేదు అని.. మరికొంతమంది క్యాస్ట్ కారణంగా అవకాశాలు వచ్చాయని చెప్పిన వారు కూడా లేకపోలేదు. అయితే ఇప్పుడు క్యాస్ట్ కారణంగా అవకాశాలు కోల్పోయిన వారి జాబితాలోకి నటుడు రవికృష్ణ (Ravi Krishna) కూడా వచ్చి చేరారు. రవి కృష్ణ మాట్లాడుతూ..” కులం అనేది అన్ని రంగాలలో ఉన్న సమస్య.. ముఖ్యంగా ఇంటిపేరు చూసి మా అబ్బాయి అనుకున్నాం ..ఇప్పుడు కాదంటున్నారు.. వద్దంటున్నారు.. ఇలా ఎన్నో విన్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

also read:పరికిణీలో కుర్రకారు హృదయాలు దోచుకుంటున్న ‘రంభ ఊర్వశి మేనక’ బ్యూటీ!

కులం చూసి రిజెక్ట్ చేశారు – రవి కృష్ణ

ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కులం పేరుతో నేను చాలా అవకాశాలు కోల్పోయాను. హీరోగా అంతా సెలెక్ట్ అయ్యి, అన్ని అయిపోయాక అగ్రిమెంట్ చేసేటప్పుడు మీ పేరేమిటి అని అడిగితే.. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబరు వంటి డీటెయిల్స్ పంపించినప్పుడు.. అందులో ఉన్న సర్ నేమ్ చూసి.. ఓహ్.. మీరు ఆ అబ్బాయా.. మా అబ్బాయి అనుకున్నాము.. కాదా.. ఓకే.. సరే నాన్న మళ్ళీ చెప్తాను” అంటూ సైడ్ అయిపోయేవారు . అలా ఒక నాలుగు ప్రాజెక్ట్స్ కోల్పోయాను.

జనరేషన్ మారినా ఆగని కులం పిచ్చి..

Advertisement

అయితే మరికొంతమంది డైరెక్ట్ గా ముఖం మీద చెప్పలేక హీరోగా అనుకున్నాం కదా.. ఛానల్ నుంచి ఒత్తిడి ఉంది . ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే.. ఓకే సార్..అదైనా చేస్తాను అని అడిగాను.. లేదు నువ్వు హీరో కంటే కొంచెం హైట్ ఎక్కువగా అనిపిస్తున్నావ్ అంట నెక్స్ట్ ప్రాజెక్ట్ చూద్దాం అని గట్టిగానే చెప్పేవారు.. అలా కేవలం కులం పేరుతో నేను ఎన్నో ప్రాజెక్టులు కోల్పోయాను” అంటూ రవి కృష్ణ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా జనరేషన్ మారినా టెక్నాలజీ పెరుగుతున్నా.. కులం అనే దురద ఎప్పటికీ పోదు అనే కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

Related News

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Karthika Deepam 2 Serial Today Episode October 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ను మాలిని చంపేస్తుందా..?              

Ninnu kori Serial Today Episode October 8th ‘నిన్ను కోరి’ సీరియల్‌: గతం గుర్తుకు వచ్చిన విరాట్ ఏం చేశాడో తెలుసా..? 

Big Stories

Advertisement
×