E-Paper
Advertisement

సందట్లో సడేమియా.. ఆ పని కానిచ్చిన తెలంగాణ బీజేపీ చీఫ్

సందట్లో సడేమియా.. ఆ పని కానిచ్చిన తెలంగాణ బీజేపీ చీఫ్
Advertisement

Telangana Bjp: తెలంగాణ బీజేపీలో నేతల మధ్య లుకలుకలకు ఫుల్‌స్టాప్ పడినట్టేనా? కేంద్రం పెద్దలతో నేతలంతా ఒకే తాటి మీదకు వచ్చారా? ఇంకా ఏమైనా ఉందా? పైకి చెప్పకున్నా.. లోలోపల కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారా? ఇదే సరైన సమయమని భావించిన తెలంగాణ బీజేపీ, పెండింగ్‌లో ఉన్న జిల్లా అధ్యక్షుల పదవులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

 

అంతర్గత విభేదాలకు ముగింపు

Advertisement

తెలంగాణ బీజేపీలో కొంతకాలంగా మూడు జిల్లాల అధ్యక్షుల నియామకాలు పెండింగ్‌లో పడ్డాయి. నేతలంతా ఒకే తాటి మీదకు రావడంతో ఆ జిల్లాల అధ్యక్షుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చింది. అందులోని కరీంనగర్, వికారాబాద్, మేడ్చల్- అర్బన్ వంటి జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు వాటికి కొత్త అధ్యక్షులను నియమిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌‌రావు.

 

ఇద్దరు నేతలకు సమ న్యాయం!

Advertisement

కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా సాయి మల్లేశం, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా రమేశ్, మేడ్చల్- అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా గిరివర్ధన్‌‌రెడ్డిలను నియమించారు. ఈ జిల్లాల అధ్యక్షుల ఎంపికపై కీలక నేతలు ఈటల రాజేందర్-బండి సంజయ్ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. తమ వర్గానికి చెందిన నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇరునేతలు పట్టుబట్టినట్టు ప్రచారం సాగింది.

ఈ కారణం వల్ల ఆ నియామకాలను పార్టీ నాయకత్వం పెండింగ్‌లో పెట్టింది. ఇటీవల ఇరువురి నేతల మధ్య విస్తృత చర్చలు జరగడం, నేతలు సరేనని ఊ కొట్టినట్టు సమాచారం. అన్నివర్గాలకు ఆమోద యోగ్యమైన జిల్లాల అధ్యక్షుల పేర్లను ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు.. కొత్తగా లక్ష రేషన్ కార్డులు, మరో వారంరోజుల్లో..

కరీంనగర్ విషయంలో బండి సంజయ్ తన పట్టు నిరూపించుకున్నారని అంటున్నారు. మేడ్చల్ విషయంలో ఈటెల పతం నెట్టిందని అంటున్నారు. మొత్తానికి నేతలంతా ఒకేతాటి మీదకు రావడంతో ఆ మూడు పదవులు భర్తీ అయిపోయాయి. ప్రస్తుతానికి టీ బీజేపీలో మంచి వాతావరణ కనిపిస్తోందని అంటున్నారు కొందరు. ఇదే కంటిన్యూ అవుతుందా? లేదా అనేది చూడాలి.

Related News

కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి- మంత్రి అడ్లూరి లక్ష్మణ్

మందుబాబులకు బిగ్ షాక్.. బోనాల వేళ వైన్ షాపులు క్లోజ్.. ఆ రెండ్రోజులు చుక్క లేనట్లే!

ఆ కేసులు తేలితే జీవితకాలం జైల్లోనే!.. సీనియర్ ఐఏఎస్‌పై హైకోర్టు సెన్సేషనల్ కామెంట్స్

ఓఆర్‌ఆర్ కాంట్రాక్టర్లపై సీఎం ఫైర్.. అధికారులకు ఆ రూల్స్ తప్పనిసరి!

తెలంగాణ కాంగ్రెస్‌లో క్రేజీ నియామకం.. టీపీసీసీ మీడియా చైర్మన్‌గా చామల కిరణ్!

మీ భూమి ORR పరిధిలో ఉందా? HILTP ఆన్‌లైన్ పోర్టల్ మళ్లీ ఓపెన్.. డెడ్‌లైన్ ఎప్పుడంటే?

జెన్ జీ దెబ్బకు రూటు మార్పు.. వేగంగా బీజేపీ అడుగులు, తెలంగాణ నేతలతో అధ్యక్షుడు నితిన్ కీలక భేటీ

హైదరాబాద్‌లో మూడో బస్సు టెర్మినల్.. 100 ఎకరాలు కేటాయింపు, మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన

Big Stories

Advertisement
×