E-Paper
Advertisement

మీ భూమి ORR పరిధిలో ఉందా? HILTP ఆన్‌లైన్ పోర్టల్ మళ్లీ ఓపెన్.. డెడ్‌లైన్ ఎప్పుడంటే?

మీ భూమి ORR పరిధిలో ఉందా? HILTP ఆన్‌లైన్ పోర్టల్ మళ్లీ ఓపెన్.. డెడ్‌లైన్ ఎప్పుడంటే?
Advertisement

HILTP Deadline: తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలు, వ్యాపార వర్గాలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని పారిశ్రామిక ప్రాంతాల పునర్నిర్మాణం, ల్యాండ్ యూజ్ మార్పిడికి సంబంధించిన ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలస’ (HILTP) గడువును పెంచుతూ సర్కార్ అడుగులు వేసింది.

3 నెలల గడువు పెంపు

Advertisement

HILTP కింద దరఖాస్తు చేసుకోవడానికి గతంలో ఇచ్చిన గడువు తక్కువగా ఉందంటూ పలువురు పారిశ్రామికవేత్తలు, వాణిజ్య సంఘాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. ఒక నెల సమయం ఏమాత్రం సరిపోదని పరిశ్రమలు తెలిపిన అభిప్రాయంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అందుకే ఆన్‌లైన్ పోర్టల్‌ను మరో మూడు నెలల పాటు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. దీని ప్రకారం ‘ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31, 2026 వరకు’ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

పాత SRO రేట్లతోనే అవకాశం

Advertisement

ఈ పొడిగింపులో వ్యాపారవేత్తలకు అతిపెద్ద లబ్ధి ఏంటంటే.. ‘జూన్ 5, 2026కు ముందు అమలులో ఉన్న SRO రేట్లతోనే’ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దీనివల్ల రిజిస్ట్రేషన్ రుసుముల భారం గణనీయంగా తగ్గుతుంది. ORR లోపలి భాగంలో ఉన్న పారిశ్రామిక భూములను సమర్థవంతంగా ‘మల్టీ-యూజ్ జోన్లు’గా మార్చుకోవడానికి ఈ అవకాశం ఎంతగానో ఉపయోగపడుతుంది.

వేగంగా అమలు బాధ్యతలు

ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ ద్వారా ఈ పాలసీ అమలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మునుపటి పాలసీ నిబంధనలు, ఆపరేషనల్ గైడ్‌లైన్స్ ఎలాంటి మార్పు లేకుండా యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Also Read: శ్రీకాకుళం జిల్లాలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, నిలిచిన రాకపోకలు!

Tags

Related News

ఓఆర్‌ఆర్ కాంట్రాక్టర్లపై సీఎం ఫైర్.. అధికారులకు ఆ రూల్స్ తప్పనిసరి!

తెలంగాణ కాంగ్రెస్‌లో క్రేజీ నియామకం.. టీపీసీసీ మీడియా చైర్మన్‌గా చామల కిరణ్!

జెన్ జీ దెబ్బకు రూటు మార్పు.. వేగంగా బీజేపీ అడుగులు, తెలంగాణ నేతలతో అధ్యక్షుడు నితిన్ కీలక భేటీ

హైదరాబాద్‌లో మూడో బస్సు టెర్మినల్.. 100 ఎకరాలు కేటాయింపు, మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన

చురుగ్గా నైరుతి రుతుపవనాలు.. ఏపీ-తెలంగాణల్లో వర్ష సూచన, ఆ జిల్లాలకు అలర్ట్

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు‌కు రోడ్డు ప్రమాదం

నాలుగు నెలల పసికందును కాపాడిన జగ్గారెడ్డి!

Big Stories

Advertisement
×