E-Paper
Advertisement

ఆపరేషన్ క్రాక్ డౌన్.. 101 మంది సైబర్ కేటుగాళ్ల అరెస్ట్!

ఆపరేషన్ క్రాక్ డౌన్.. 101 మంది సైబర్ కేటుగాళ్ల అరెస్ట్!
Advertisement

Cyber Crackdown: స్వేచ్ఛ బ్యూరో: కమీషన్ల కోసం కక్కుర్తి పడి సైబర్ క్రిమినల్స్​ కు బ్యాంక్​ అకౌంట్లను సమకూరుస్తున్న వారిపై తెలంగాణ సైబర్​ సెక్యూరిటీ బ్యూరో కొరడా ఝళిపించింది. కేరళం, ఆంధ్రప్రదేశ్​, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరిలలో రెండు వారాలపాటు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి ఆపరేషన్​ క్రాక్​ డౌన్​ జరిపింది. ఇందులో భాగంగా 101మందిని అధికారులు అరెస్ట్​ చేశారు. విదేశాల్లో ఉంటున్న సైబర్​ క్రిమినల్స్​ ఏటా మన దేశం నుంచి రకరకాల మోసాలు చేస్తూ వేలాది కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. ఇలా లూటీ చేస్తున్న డబ్బును కేటుగాళ్లు మ్యూల్​ అకౌంట్ల ద్వారా తరలించుకు పోతున్నారు.

కమీషన్ల ఆశ చూపించి..

Advertisement

బ్యాంక్​ అకౌంట్లను సమకూరిస్తే భారీ మొత్తాల్లో కమీషన్​ ఇస్తామని చెప్పి సైబర్ క్రిమినల్స్ వందల సంఖ్యలో జనాన్ని ఉచ్ఛులోకి లాగుతున్నారు. చిరువ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు, రోజు కూలీలు, గృహిణిలను ప్రలోభ పెట్టి వారి బ్యాంక్​ అకౌంట్ల వివరాలు, డెబిట్​, క్రెడిట్​ కార్డులు, పాస్​ వర్డ్​ లతోపాటు మొత్తం సమాచారాన్ని తీసుకుంటున్నారు. ఆ తరువాత మోసాలు చేసి కొల్లగొట్టిన డబ్బును ఈ ఖాతాల్లోకి తరలిస్తున్నారు. ఆ తరువాత మరిన్ని ఖాతాల్లోకి డబ్బును ట్రాన్స్​ ఫర్​ చేసి క్రిప్టో కరెన్సీ రూపంలో తరలించుకుంటున్నారు.

వాళ్లే టార్గెట్ గా..

Advertisement

ఈ క్రమంలోనే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు మ్యూల్​ అకౌంట్లను సమకూరుస్తున్న వారిపై దృష్టిని సారించారు. ఇంతకు ముందు ఒకసారి స్పెషల్​ ఆపరేషన్​ జరిపి పదుల సంఖ్యలో నిందితులను అరెస్ట్​ చేశారు. తాజాగా వందమంది సిబ్బందితో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి జరిపిన ఆపరేషన్​ లో 101మందిని పట్టుకున్నారు. వీరిలో 18మంది మహిళలు ఉండటం గమనార్హం. అత్యధికంగా కేరళంలో 35మంది పట్టుబడగా ఆంధ్రప్రదేశ్ లో 22, కర్ణాటకలో 18, తమిళనాడులో 14, తెలంగాణలో 12, పుదుచ్చేరిలో ఒకరు పట్టుబడ్డారు. దొరికిన వారిలో నిరక్షరాస్యులు మొదలుకుని పీజీ పూర్తి చేసిన వారు కూడా ఉన్నారు.

17కోట్ల రూపాయల లావాదేవీలతో సంబంధం ..

నిందితుల నుంచి పెద్ద సంఖ్యలో సిమ్ కార్డులు, బ్యాంక్​ పాస్​ బుక్కులు, చెక్​ బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో పట్టుబడ్డ 101మంది నిందితుల అకౌంట్లకు 17కోట్ల రూపాయల లావాదేవీలతో సంబంధం ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. దాడులను సమన్వయం చేసి ఫలితాలు సాధించిన ఎస్పీ సాయిశ్రీ, అదనపు ఎస్పీ సూర్యప్రకాశ్​, డీఎస్పీ కే.వీ.ఎం.ప్రసాద్​, క్షేత్రస్థాయి ఇన్​ ఛార్జ్​ లు వెంకటరమణ, ఫణీందర్​, వేణుగోపాల్​ రెడ్డి, రమేశ్​, రాజు, వెంకటయ్యలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్​ శిఖాగోయల్​ అభినందించారు.

Also Read: మూసీ పునరుజ్జీవంలో మరో కీలక అడుగు.. ఓంకారేశ్వర ఆలయాభివృద్ధికి రూ.1,108 కోట్లు మంజూరు

Tags

Related News

రోడ్ డస్ట్‌పై సర్కార్ మాస్టర్ ప్లాన్.. వాయు కాలుష్యానికి చెక్ పెట్టేలా బిగ్ స్టెప్!

రైతులకోసం తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. కొత్త సేవలు ప్రారంభం!

మూసీ పునరుజ్జీవంలో మరో కీలక అడుగు.. ఓంకారేశ్వర ఆలయాభివృద్ధికి రూ.1,108 కోట్లు మంజూరు

పటేల్‌కు ఓట్లు పడితే నెహ్రూను ప్రధాని చేశారు.. ఓటు చోరీ కాంగ్రెస్‌దే: బండి సంజయ్

నా రూటే సెపరేటు.. ఆశ-ఆసక్తి లేదన్న బండ్ల గణేష్, తెర వెనుక అసలు ఏం జరిగింది?

హైదరాబాద్‌వాసులపై అధికారులు నిఘా.. ఓ వ్యక్తికి రూ.20 వేల జరిమానా, నీటిని వృథా చేసినందుకు

గ్లోబల్ సంస్థలకు తెలంగాణలో తిరుగులేని ఆఫర్లు.. ఐటీ శాఖ రోడ్‌మ్యాప్ ఇదే?

Big Stories

Advertisement
×