Big Stories

Medchal Asian Blood Centre: బ్లడ్ సెంటర్ లో అధికారుల తనిఖీలు.. RBC, ప్లాస్మా బ్యాగులు సీజ్!

Drugs Control Officals Searches in Asian Blood Centre: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఏఎస్ రావు నగర్ లో ఉన్న ఏసియన్ బ్లడ్ సెంటర్ అనే బ్లడ్ బ్యాంక్ లో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్, ప్యాక్డ్ ఆర్బీసీ, ప్లాస్మా సహా.. బ్లడ్ కాంపోనెంట్లను అక్రమంగా తయారు చేసి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

- Advertisement -

ఈ తనిఖీలపై డీసీఏ డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. తమకు అందిచిన సమాచారం మేరకు.. ఏసియన్ బ్లడ్ సెంటర్ పై దాడి చేశామని తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏఎస్ రావు నగర్ క్రాస్ రోడ్స్ లో శాంతి సురభి కాంప్లెక్స్ లో ప్లాట్ నంబర్ 2 లో ఉన్న బ్లడ్ సెంటర్ పై శుక్ర, శనివారాల్లో తనిఖీలు చేపట్టామని తెలిపారు. ఈ బ్లడ్ సెంటర్ కు హోల్ హ్యూమన్ బ్లక్ సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్, పంపిణీ కార్యకలాపాలకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అనుమతిచ్చింది.

- Advertisement -

కానీ.. బ్లడ్ సెంటర్ లో సింగిల్ డోనర్ ప్లేట్ లెట్స్, ప్యాక్డ్ ఆర్బీసీ, ప్లాస్మా వంటి కాంపోనెంట్లను అక్రమంగా తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. వీటికి డ్రగ్స్ కంట్రోల్ అనుమతి లేదని తెలిపారు. ‘ప్లేట్‌లెట్‌ఫెరిసిస్’ అనే ప్రక్రియ ద్వారా సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కానీ.. ఈ సెంటర్ కు అలాంటి సామర్థ్యం లేదు. ఇక్కడ అఫెరిసిస్ మెషిన్, బ్లడ్ సెపరేటర్ వంటి పరికరాలు లేవు.

Also Read : కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు నమోదు.. ఒక్కొక్కటిగా బయటపడుతున్న అరాచకాలు..!

సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్లను ఇతర బ్లడ్ బ్యాంకుల నుంచి అక్రమంగా సేకరించి అనధికార పద్ధతిలో రోగులకు సరఫరా చేస్తున్నట్టు బ్లడ్ సెంటర్ టెక్నీషియన్ జె.రవికుమార్ ఈ దాడిలో వెల్లడించారు. ఆర్బీసీ బ్యాగులు, ప్లాస్మా బ్యాగులతో పాటు.. రిజిస్టర్, సేల్స్ బుక్, మెయింటైనెన్స్ బుక్ లను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News