E-Paper
Advertisement

తెలంగాణలో కొత్త స్కీమ్.. రూ. 1.50 లక్షల సబ్సిడీ, ఇంకెందుకు ఆలస్యం

తెలంగాణలో కొత్త స్కీమ్..  రూ. 1.50 లక్షల సబ్సిడీ, ఇంకెందుకు ఆలస్యం
Advertisement

Telangana Govt New Scheme: తెలంగాణలో కొత్త స్కీమ్ రాబోతోంది. లబ్దిదారులకు దాదాపు లక్షన్నర వరకు సబ్సిడీ రానుంది. త్వరలో రానున్న కొత్త స్కీమ్ వివరాలు ఏంటి? అనేది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. పెట్రోల్‌-డీజిల్‌ ఆటోలను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చేందుకు రాబోతోంది ఈ కొత్త స్కీమ్.

తెలంగాణ కొత్త స్కీమ్.. లబ్దిదారులకు లక్షన్నర వరకు

హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ రీజియన్‌లో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగా ప్రభుత్వం. కాలుష్య నియంత్రణ-హరిత రవాణా లక్ష్యంగా పెట్రోల్‌, డీజిల్‌ ఆటోలను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చనుంది. తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్‌ కన్వర్షన్‌ స్కీమ్‌-2026 స్కీమ్‌‌ని తీసుకొచ్చింది. ఈ పథకానికి శుక్రవారం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ సిటీలో ఉన్న ఆటోలను దశలవారీగా ఈవీలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
దీనిద్వారా ఆటో డ్రైవర్లకు గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సాయం అందనుంది.

Advertisement

 

అర్బన్ జోన్‌లో పాత ఆటోలు ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్పు

ఈ పథకం కింద హైదరాబాద్ అర్బన్ జోన్‌లోని దాదాపు 18 వేలకు పైగానే పాత ఇంధన ఆటోలను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చనుంది.
నగర వాతావరణంలో కర్బన ఉద్గారాలను పెరుగుతున్న నేపథ్యంలో, పాత ఇంధన వాహనాలను రోడ్లపై తగ్గించడం, పెరుగుతున్న ఇంధన ధరల భారం నుంచి ఆటో డ్రైవర్లకు ఉపశమనం కలిగించడం ముఖ్య ఉద్దేశం. భవిష్యత్‌లో ప్రజా రవాణా వ్యవస్థను కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు వేసిన మొదటి అడుగు. అందుకోసం ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సదుపాయాలు, గ్రిడ్ మౌలిక వసతుల పెంపుపై దృష్టి సారించనుంది.

Advertisement

 

తొలి విడత 18 వేల ఆటోలు, 16 వారాల గడువు

ఈ పథకం అమలులో ఎలాంటి అవకతవకలకు ఛాన్స్ లేకుండా పూర్తిగా డిజిటల్‌ విధానంలో చేపట్టనుంది. అందుకోసం రవాణా శాఖ 16 వారాల సుదీర్ఘ కార్యాచరణ ప్రణాళిక రెడీ చేసింది. తొలి 8 వారాలలో ఆటో యూనియన్లతో సదస్సులు నిర్వహించనుంది. ఎలక్ట్రిక్‌ కన్వర్షన్‌ కిట్ల తయారీ సంస్థలను ఎంపిక చేయడం, వాటి ధరలను స్థిరీకరించడం చేయనుంది. ఆ తర్వాత ప్రత్యేక ఆన్‌లైన్‌ పోర్టల్‌ను వారికి అందుబాటులోకి తెస్తారు. దరఖాస్తుదారు అర్హతలు, పత్రాల ధ్రువీకరణ, ఆర్‌టీవో వెరిఫికేషన్ ఆన్‌లైన్‌లో జరగడంతో ఆటోడ్రైవర్లు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. 16 వారాలు తర్వాత నిధులను డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది ప్రభుత్వం.

ALSO READ: జగన్ మారిదిగా తాను కూడా.. షర్మిలాతో నాకు పోలికేంటి? కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ పథకంలో రెండు ఆప్షన్లు అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. మొదట.. తమ పాత పెట్రోల్ లేదా డీజిల్ ఆటోలకు ప్రభుత్వం ఆమోదించిన అధికారిక ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్‌ను అమర్చుకోవచ్చు. ఇక రెండోది తమ పాత ఆటోను ప్రభుత్వం గుర్తించిన స్క్రాప్‌ చేసిన కేంద్రాల్లో ఇవ్వడం, దాని స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ ఆటోను తీసుకోవచ్చు. రెండు ఆప్షన్లలో దేన్ని ఆటోడ్రైవర్లు ఎంచుకున్నా అర్హులు. దీనివల్ల ప్రతి డ్రైవర్‌కు దాదాపు రూ. 1.50 లక్షల సబ్సిడీ రానుంది. ఆటో డ్రైవర్ల ప్రారంభ పెట్టుబడి భారాన్ని తగ్గించడమే.

Related News

దమ్ముంటే రాజీనామా చేయండి.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డీకే అరుణ ఓపెన్ ఛాలెంజ్!

జగద్గిరిగుట్టలో వరుస చోరీలు.. రూ.58 లక్షల సొత్తు మాయం

మద్యం ప్రియులకు షాక్.. నేటి నుంచి తెలంగాణలో బార్లు-రెస్టారెంట్లు బంద్, మళ్లీ ఏమైంది?

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

Big Stories

Advertisement
×