E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి మాటతో కమల్ హ్యాపీ.. శ్రీయ పై భానుమతి ఫైర్.. అడ్డంగా దొరికిన పల్లవి..

Intinti Ramayanam Today Episode: పల్లవి మాటతో కమల్ హ్యాపీ.. శ్రీయ పై భానుమతి ఫైర్.. అడ్డంగా దొరికిన పల్లవి..
Advertisement

Intinti Ramayanam Today Episode august 16th : అక్షయ్ కోపంగా ఉన్నాడని ఎంతగా బతిమిలాడినా సరే తను మాత్రం మాట వినకుండా ఉంటాడు. అసలు అక్షయ్ నిజంగా మాట్లాడతాడా లేదా అని అవని చాలా సేపు బ్రతిమలాడు చూస్తుంది. కానీ తను మాత్రం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో అవని ఇక కోపమా నాపైన అంటూ అక్షయ్ కోపాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది.. ఎంతగా సాంగ్ పాడిన తనని బుజ్జగించాలని చూసినా కూడా అక్షయ్ మాత్రం కరగకుండా అలానే ఉంటాడు. అది చూసిన కమల్ వదిన అన్నయ్య కోపాన్ని తగ్గించేందుకు పాటుపడుతుంది అన్నయ్య ఇక తగ్గిపోయినట్లే అని సంతోష పడుతూ ఉంటాడు. అక్షయ్ మాత్రం ఎంతగా అవని బ్రతిమలాడి ప్రపోజ్ చేసిన కూడా.. అక్షయ్ అస్సలు వినకుండా వెళ్ళిపోతాడు అక్షయ కోపం తగ్గడానికి ఏం చేసినా కూడా మారడం లేదే అని అవని ఆలోచిస్తూ ఉంటుంది..

పల్లవి ప్రేమకు కమల్ ఫిదా..

అవని వదిన అక్షయ్ అన్నయ్య ఇద్దరు చాలా సరదాగా పాటలు పాడుకుంటూ ఉన్నారు అని కమల్ అంటాడు. పల్లవి వాలిద్దరు లాగా మనిద్దరము అంటే నాకు పాటలు రావు బావా అని ఎంతగా చెప్తున్నా సరే.. వాళ్లంతా సంతోషంగా ఉన్నారు మనం కూడా అంతే ఉండాలి అని కమల్ వినకుండానే ఉంటాడు.. ఇకపోతే పల్లవి కూడా కమల్ ని ప్రేమగా చూసుకోవాలి అని అనుకుంటుంది. కమల్ పల్లవి ప్రేమకు ఫిదా అయిపోతాడు. వీళ్ళిద్దరి రొమాన్స్ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది.. అవని అక్షయ్ఎలాగైతే సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారు మనం కూడా అంతే సంతోషంగా ఉండాలి అని కమల్ అడగగానే పల్లవి సరే బావ నీ ఇష్టం అని అంటుంది.. పల్లవిలో ఇంత మార్పు నేనే అని అస్సలు ఊహించలేదు అని కమల్ కూడా చాలా సంతోషంగా ఉంటాడు. వీరిద్దరూ రొమాన్స్ చేసుకోవడం ఎపిసోడ్లో హైలెట్ అయిన అంశం అని చెప్పాలి.

Advertisement

పిల్లలు కావాలని అడిగిన కమల్..

అన్నయ్య వదినలకు ఆరాధ్య ఉంది కాబట్టి వాళ్ళ సంతోషం ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇక ఇప్పుడు శ్రేయ వదిన శ్రీకర్ అన్నయ్యలు కూడా బాబు పుట్టడంతో చాలా సంతోషంగా ఉన్నారు. మనం కూడా అంతే సంతోషంగా ఉండాలి అని అడుగుతాడు కమల్. కానీ పల్లవి సిగ్గుపడుతూనే సరే బావా మనం కూడా పిల్లలు కందామని అంటుంది. కమల్ కి పల్లవి ముద్దు పెడుతుంది.. వీరిద్దరి రొమాన్స్ కాస్త ప్రేక్షకులని సిగ్గుపడేలా చేస్తుందనే చెప్పాలి. పల్లవి కమల్ చాలా సంతోషంగా ఉంటారు. త్వరలోనే కమల్ కోరిక నెరవేరు పోతుంది అని అర్థమవుతుంది. ఒకప్పుడు కోపంతో ఆవేశంతో ఉండే పల్లవి ఇప్పుడు తన భర్తకి దగ్గర అవుతుంది అని తనలో తానే సంతోష పడిపోతూ ఉంటుంది పల్లవి..

శ్రీయను తిట్టిన భానుమతి..

Advertisement

ఉదయం ఇంట్లోని వాళ్ళందరూ కూడా పూజ చేసుకుంటూ ఉంటారు. అవనీ పార్వతి ఇద్దరూ పూజ గదిలో పూజ చేస్తూ ఉండగా శ్రేయ అక్క అని గట్టిగా అరుస్తుంది. అక్కడికొచ్చిన భానుమతి ఆ అవతారం ఏంటి ఆ డ్రెస్ ఏంటి గుర్రం గాడిద అయిందంటే ఇదేనేమో అని వెటకారంగా మాట్లాడుతుంది. మనుషుల్లో మార్పుండాలి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇంత మార్పు అవసరమా అని భానుమతి శ్రేయ అని తిడుతుంది. కానీ పక్కనే ఉన్న శ్రీకర్ మాత్రం బామ్మ గురించి తెలిసింది కదా నువ్వేమీ బాధపడకు అని అంటాడు. అయితే శ్రేయ నేనేమీ ఫీల్ అవ్వట్లేదు శ్రీ అని అంటుంది.

అవని ఫుల్ హ్యాపీ..

శ్రియ అవని అక్క అని గట్టిగా పిలుస్తుంది. అక్క నేను స్టార్ట్ అప్ కంపెనీ గురించి చెప్పాను కదా.. వాళ్ళు ఇవాళ రమ్మని చెప్పారు నేను అక్కడికి వెళ్లాలి అని అంటుంది. అయితే మీరు బాబుని చూసుకుంటారు కదా నేను వెళ్లేసి వస్తాను అని శ్రీ అంటుంది. బాబు సంగతి నువ్వు మర్చిపో నేను చూసుకుంటాము నువ్వు హ్యాపీగా వెళ్లి మంచి న్యూస్ ని చెప్పాలి అని పార్వతి అంటుంది. అంతే కదూ భానుమతి శ్రేయ డ్రెస్ ని బాగోలేదని తిడితే.. పార్వతి మాత్రం నీ డ్రెస్ చాలా బాగుందమ్మా అని అంటుంది. పక్కనే ఉన్న భానుమతి ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం ఎందుకు అని చెప్పాల్సింది పోయి డ్రెస్ బాగుంది అని అంటున్నావ్ ఏంటి అని తిడుతుంది. ఇక అవని నువ్వు దీంట్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. మంచిగా క్షేమంగా వెళ్లి లాభంగా రావాలి అని దీవించి పంపిస్తుంది అలాగే పల్లవి కూడా ఆల్ ది బెస్ట్ అని చెప్తుంది. ఇంకా పల్లవి నాకు వేరే పని ఉంది అత్తయ్య నేను బయటికి వెళ్లి వస్తాను అని అడుగుతుంది. పల్లవి వెనకాలే అవని కూడా ఫాలో అవుతూ వెళ్తుంది ఇక మొత్తానికి పల్లవి అవనికి నిజం చెప్పేస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : పూజ పూర్తి చేసిన మాధవ్.. చక్రీ, మహా ఫుల్ హ్యాపీ.. తాయారుకు షాక్..

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×