TRS Chief Kavitha: టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో తనకు-షర్మిలకు మధ్య ఎలాంటి పోలిక లేదని కుండబద్దలు కొట్టేశారు. ఆమె నేపథ్యం వేరని.. తనది వేరని చెప్పుకొచ్చారు. తాను ఉద్యమ బిడ్డనని, కేసీఆర్ ఎలాగైతే పార్టీ పెట్టి సక్సెస్ అయ్యారో, ఆ విధంగా తెలంగాణలో కొత్త చరిత్ర రాయబోతున్నట్లు తెలిపారు.
ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెళ్లడించారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. తెలంగాణలో చాలామంది నేతలు పార్టీలు పెట్టి ఆ తర్వాత వేరే పార్టీల్లో విలీనం చేసిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. ఫెయిల్యూర్ ఉదాహరణగా తీసుకుని ఎవరూ ముందుకు అడుగులు వేయరని, నిరుత్సాహ పడతారని అన్నారు. తాను మాత్రం సక్సెస్ అయినవారి ఎగ్జాంఫుల్‌గా తీసుకున్నట్లు అడుగులు వేస్తున్నట్లు ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
కేసీఆర్-జగన్ మాదిరిగా తాను సక్సెస్ అవుతానని భావిస్తున్నారని మనసులోని మాట బయపెట్టారు కవిత. ఈ విషయంలో ఎందుకు కాకూడదు? తండ్రి ఉన్నప్పుడు జగన్ కూడా ఎంపీగా ఉన్నారని, తాను కూడా ఎంపీగా ఉన్నానని కంపేర్ చేశారు. సక్సెస్ అయినవారిని ఇన్స్పిరేషన్‌గా తీసుకుని ముందుకెళ్తే తప్పేముందని ఎదురు ప్రశ్న వేశారు. కేసీఆర్ మాదిరిగా తాను కూడా ఉద్యమంలో పాత్రదారినేనని అన్నారు. ఈ విషయంలో తెలంగాణ సమాజం ముందుకొస్తుందని, తన ఏజెండాలో క్లారిటీ ఉందన్నారు. తాను కాంప్రమైజ్ రాజకీయాలు చేయలేదని, ప్రజలు తనతో కలిసి వస్తారని వెల్లడించారు. దానికి తగ్గట్టుగా ఆలోచనలు, క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్నట్లు చెప్పుకొచ్చారు.
దేశంలో జరుగుతున్న పరిణామాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. యువత అంతా ఢిల్లీకి వచ్చి నిరసనలు చేశారని, వాళ్లకు ఏమి ఆర్గనైజేషన్ ఉందని ఎదురు ప్రశ్నించారు. సమాజంలో నిరంతరం చైతన్యం ఉంటుందని, అందరూ ఒకేతాటి మీదకు వచ్చినప్పుడు బయటకు వస్తుందన్నారు. సామాజిక న్యాయం కావాలనే అంశం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉందని, లేనప్పుడు ఉందన్నారు. తెలంగాణ కోసం కోట్లాట జరిగినప్పుడు ఈ విషయం ప్రస్తావనకు వచ్చిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక న్యాయం చేద్దామన్నారు. అలాంటివారే మొన్న బీఆర్ఎస్ ఓటమిలో కీలకంగా పని చేశారన్నారు.
ALSO READ: ప్రాజెక్టు పూర్తిచేసే భాధ్యత నాదే.. హుస్నాబాద్ ప్రజలకు మంత్రి పొన్నం భరోసా!
చాలా రాజకీయ పార్టీలు పట్టుకోని అంశాలను ఎజెండా తీసుకుని అడుగులు వేస్తున్నానని, తానేమీ క్రియేట్ చేసింది కాదన్నారు కల్వకుంట్ల కవిత. అంబేద్కర్, పూలే మహనీయులు కొట్లాడిన ఎజెండా అని, ఈ విషయంలో వారు చాలావరకు అడుగులు వేశారన్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ గురించి కూడా మాట్లాడారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు ఆ పార్టీతో పని చేయనని తేల్చేశారు. కుటుంబ సభ్యులతో వ్యక్తిగత సంబంధాలు వేరు-రాజకీయాలు వేరని తేల్చిచెప్పారు. ఆ పార్టీని అధికారంలోకి రాకుండా చేయడం తమ సిద్ధాంతం కాదన్నారు. మాది ఆర్ట్ మూవీ కాదని, కమర్షియల్ మూవీ కాదన్నారు.